తనకి బుద్దిచెప్పాలంటే.. నటసింహమే కరెక్ట్…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో దేవర 2 ని దసరా నుంచి పట్టాలెక్కించబోతున్నాడు కొరటాల శివ. అలాంటి తను వెంటనే అబ్బాయ్ తర్వాత తన బాబాయ్ బాలయ్యతో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు.

Post Published By: dialnews
Updated : 23 April 2026, 7:50 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో దేవర 2 ని దసరా నుంచి పట్టాలెక్కించబోతున్నాడు కొరటాల శివ. అలాంటి తను వెంటనే అబ్బాయ్ తర్వాత తన బాబాయ్ బాలయ్యతో సినిమాను సెట్స్ పైకి తీసుకెళుతున్నాడు. ఇది ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. ఎప్పటి నుంచో నటసింహానికి కథ చెప్పాలని ట్రై చేస్తుంటే, ఫైనల్ గా బాలయ్య డాటర్ వల్లే ఈ కాంబినేషన్ సెట్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ కొరటాల శివ పర్సనల్ రివేంజ్ థియరీ వినిపిస్తోంది.. ఒకరికి బుద్ది చెప్పాలంటే, బాలయ్యనే రంగంలోకి దింపాలి... నిజంగా తనకి నష్టం చేసిన వ్యక్తో, నలిపేసిన కటౌట్ కో కౌంటర్ ఇవ్వాలంటే, నటసింహమే కరెక్ట్ అని కొరటాల శివ అనుకున్నాడా? ఇంతకి కొరటాల శివని ఎందుకు బాలయ్యకి తన కూతురు రెఫర్ చేసింది...? ఈ కాంబినేషన్ లో ఎలాంటి సినిమా రాబోతోంది?

కొరటాల శివ డైరెక్షన్ లో నటసింహం బాలయ్య సినిమా ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. ఇక రావాల్సింది అఫీషియల్ ఎనౌన్స్ మెంటే.. అది కేవలం లాంచనమే... బాలయ్య కూతురే ఈ ప్రాజెక్ట్ కన్ఫామ్ అవటానికి రీజన్ అని తెలుస్తోంది. ఆల్ మోస్ట్ తనవల్లే కొరటాల శివ, బాలయ్య కాంబినేషన్ ఓకే అయినట్టు తెలుస్తోంది. నిజానికి బాలయ్యతో సినిమా తీయాలనేది కొరటాల బిగ్ డ్రీమ్..బాలయ్య ఎంత గొప్ప స్టార్ అయినా, కొరటాల శివ ఏం తక్కువ వాడు కాదు.. కాని మొదటి నుంచి బాలయ్య ఈ దర్శకుడిని దూరం పెడుతూనే ఉన్నాడనే ప్రచారం ఉంది. అసలు కొరటాల శివ ఎందుకు బాలయ్య సినిమా కోసం ఇంతగా మళ్లీ మళ్లీ ట్రై చేస్తున్నాడనే ప్రశ్నని ఆన్సర్ మొదట్లో ఎవరికీ అంతుచిక్కలేదు.

ఎందుకంటే, కొరటాలా ఏం కొత్త దర్శకుడు కాదు. సీనియర్ రైటర్, అలానే ఆచార్య ఒక్కటి పక్కన పెడితే, మాస్ హిట్లతో రాజమౌలి తర్వాత స్థానంలో ఉన్నదర్శకుడు. మిర్చీ,శ్రీమంతుడు, భరత్ అనేనేను, జనతా గ్యారేజ్, దేవర ఇలా అన్నీ మాసీవ్ హిట్లే... అయినా ఒక కొత్త దర్శకుడిలా బాలయ్య డేట్స్ కోసం అంత కసిగా తను, లైట్ తీసుకుంటున్నా, కొరటాల శివ అలా వెంటపడతానికి రీజన్ రివేంజే..ఎక్కడపోగొట్టుకుంటే, అక్కడే తిరిగి రాబట్టుకోవాలనంటారు.. అలానే బాలయ్య ప్రాజెక్ట్ లో కొరటాల శివ కోల్పోయింది, అక్కడే రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడట ఈ దర్శకుడు. లెజెండ్ టైంలో తనకి దక్కాల్సిన రైటర్ క్రెడిట్ ని బోయపాటి తన ఎకౌంట్ లో వేసుని మోసం చేశాడనే ప్రచారం ఎప్పటి నుంచో జరుగుతోంది. ఒకానొక ఇంటర్వూలో కొరటాల శివ కూడా ఇదే విషయాన్ని ఓపెన్ గా చెప్పాడు.

సో బాలయ్యతో లెజెండ్ ని మించే సౌండ్ తో సినిమా తీసి, బోయపాటి మీద రివేంజ్ తీర్చుకునేందుకే కొరటాల శివ ఇంతగా కష్టపడి బాలయ్య డేట్లు పట్టాడట. నిజానికి ఎన్ని సార్లు బాలయ్యకి కథ చెప్పాలనుకున్నా, ఎందుకో యంగ్ దర్శకులకి తప్ప బాలయ్య కొరటాల శివకి ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. ఫైనల్ గా బాలయ్య కూతురు తేజస్విని ఎంట్రీతో, కొరటాల శివ కథని బాలయ్య విన్నాడని, ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని తెలుస్తోంది. దేవర 2 అయిపోయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కటం ఖాయంగా తెలుస్తోంది. ఈ నెలాఖరి లేదంటే, వచ్చేనెల మొదటి వారం అఫీషియల్ స్టేట్ మెంట్ రావొచ్చు.. సో ఇటు బాలయ్యతో సినిమా తీయాలనే కళ, మరో వైపు బోయపాటికి కౌంటర్ ఇవ్వాలనే డ్రీమ్ ఇలా ఒకే దెబ్బకి రెండు పిట్టల్లు థియరీని కొరటాల ఫాలో అవుతున్నాడనే ప్రచారం జరుగుతోంది.

Published : 
  • 23 April 2026, 7:50 PM IST