నటసింహం బాలయ్య, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటిస్తే, అదో నటవిద్వంసమే... ప్రాక్టికల్ గా ఇప్పటికిప్పుడు అది సాధ్యం అయ్యేలా లేదు. కాని ఇద్దరికీ కామన్ కనెక్షన్ కొరటాల శివతో కుదురుతున్నట్టే ఉంది. కొరటాల శివ బాలయ్యకి చెప్పిన కథ ఒకే అవ్వటంతో, సడన్ గా ఈక్వేషన్స్ మారుతున్నాయి. ఐతే నటసింహం తీసుకున్న నిర్ణయంతో దేవర సీక్వెల్ కి గండం ఎదురయ్యేలా ఉందా? ఎన్టీఆర్ తో ఆల్రెడీ దేవర 2 కమిటైన కొరటాల శివ, సడన్ గా బాలయ్య తో సినిమాను అది వన్ ఇయర్ లో కంప్లీట్ చేసేలా కమిట్మెంట్ ఎందుకు ఇచ్చాడు? ఇదే నిజమైతే, దేవర 2 దసరా లాంచింగ్ ఆగిపోయినట్టేనా? ఒకవైపు బాలయ్య యస్ అని చెప్పిన ఒక్క మాటతో, దేవర2 కి పరోక్షంగా బ్రేకులు పడ్డాయంటున్నారు.. కాని అసలు స్టోరీలో మాస్ ట్విస్ట్ ఏమైనా ఉందా?
నటసింహం బాలయ్యతో కొరటాల శివ సినిమా ఓకే అయ్యిందంటే, దేవర సీక్వెల్ లేనట్టే.. ఇది ఇంటర్నెట్ లో వైరలౌతున్న వార్త..నిజం చెప్పాలంటే, ఈ రూమర్ కొంతవరకు నిజానికి దగ్గరగా ఉంది. కాని అదే నిజం కాదు. అయ్యే అవకాశం లేదు..అదే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇస్తున్న ట్విస్ట్.. ఐతే ముందు బయట జరుగుతున్న ప్రచారంలో నిజమెంతోచూస్తే..కొరటాల శివతో బాలయ్యమూవీ ఓకే అయ్యేలా తన కూతురే స్టోరీ డిస్కర్షణ్ వరకు తెచ్చింది. కథ నచ్చి బాలయ్య ఈ సినిమా ఓకే చేశాడని తెలుస్తోంది. మేఎండ్ లో కనక బాలయ్యతో కొరటాల శివ మూవీ ఎనౌన్స్ మెంట్ వస్తే, ఇక దేవర 2 లేదని అంతా కన్పామ్ చేసుకోవచ్చే ప్రచారం జరుగుతోంది. ఇంతకి బాబాయ్ యెస్ కి ఎన్టీఆర్ దేవర 2 ఆగిపోవటానికి ఉన్న లింకేంటి?
ఇదే కాస్త షాకింగ్.. వన్స్ బాలయ్యతో కొరటాల శివ సినమా ఓకే అయ్యిందంటే, దానర్ధం దేవర2 లేదనటానికి చాలా కారణాలున్నాయి. ఎన్టీఆర్ డ్రాగన్ 1 పార్ట్ ని జూన్ లోగా పూర్తి చేస్తే, పార్ట్ 2 ని 2027 సమ్మర్ లోగా పూర్తి చేసే ఛాన్స్ ఉంది. సో కనీసం ఏడాదిన్నర వరకు డ్రాగన్ 2 భాగాల షూటింగ్ తోనే సరిపోతుంది. తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో గాడ్ ఆఫ్ వార్ మొదలౌతుంది..దానికి ముందే దేవర 2అన్నారు. తర్వాత కాదన్నారు. మధ్యలో దేవర 2అయ్యాకే గాడ్ ఆఫ్ వార్ అని మళ్లీ ప్రచారం చేశారు. కాని గాడ్ ఆఫ్ వార్ కార్తికేయుడి సినిమానే ముందు మొదలయ్యేలా ఉంది. కాబట్టే, దేవర2 ఇక ఆగినట్టే అనంటున్నారు. అందుకు హింటే బాలయ్యతో కొరటాల శివ సినిమా అని కూడా లింక్ పెడుతున్నారు. కాని రియాలిటీ మరోలా ఉంది.
డ్రాగన్ రెండు భాగాలు, త్రివిక్రమ్ మూవీ గాడ్ ఆఫ్ వార్ ఇవి వరుసగా తెరకెక్కటం ఆల్ మోస్ట్ కన్ఫామ్. అంతమాత్రాన దేవర2 లేనట్టు కాదు. ఆ సినిమా కథని కొరటాల శివ ఎప్పుడో రెడీ చేశాడు. ఎన్టీఆర్ ఫ్రీ అయితే దేవర 2 తీయటం పక్కా.. కాని రెండేళ్లవరకు ఇటు డ్రాగన్, అటు త్రివిక్రమ్ సినిమాతోనే సరిపయేలా ఉంది. కాబట్టే ఆ తర్వాతే ఎన్టీఆర్ ఫ్రీ అయ్యేఛాన్స్ఉంది. కాబట్టేఈలోపు బాలయ్యతో సినిమా తీసి, ఆతర్వాత దేవర2 ని కొరటాల ప్లాన్ చేసకుంటున్నాడట. ఐతే నెగెటీవ్ ప్రచారం చేసే బ్యాచ్ మాత్రం, దేవర తెలుగులో బాగా ఆడింది. హిందీలో పర్లేదు.. కాని మిగతా ప్రాంతాల్లో అంతగా ఆడలేదు. కాబట్టే ఎన్టీఆర్ దాని సీక్వెల్ ని పక్కన పెట్టాడంటున్నారు. ఐతే రాజమౌళి సెంటిమెంట్ నే బ్రేక్ చేయటమే కాదు, తెలుగు, హిందీ మార్కెట్లే పెద్దవి కాబట్టి, అక్కడ ఆడి, తమిల్, మలయాళంలో సోసోగా ఆడినా నష్టం లేదనే అభిప్రాయముంది. కథంతా సెకండ్ పార్ట్ లోనే ఉందన్నారు కాబట్టే, అలా చూసినా దేవర2 పట్టాలెక్కేందుకే చాలా స్కోప్ ఉంది.. అందుకే లేట్ అయినా పర్లేదు కాని, దాన్ని పక్కన పెట్టే ఛాన్సేలేదనే థియరీ నమ్మేలా ఉంది.