NTRకోసం 30 మంది.. మహేశ్ కోసం 24 మంది.. షాకింగ్ క్యూ…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం 30 మంది నిర్మాతలు, కాల్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కోసం రెండు డజన్ల మంది ప్రొడ్యూసర్లు ఎదురుచూపులు చూస్తున్నారు.

Post Published By: dialnews
Updated : 17 February 2026, 9:15 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కోసం 30 మంది నిర్మాతలు, కాల్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కోసం రెండు డజన్ల మంది ప్రొడ్యూసర్లు ఎదురుచూపులు చూస్తున్నారు. అందరి టార్గెట్ ఒకటే, ఎన్టీఆర్, మహేశ్ బాబు డేట్లు పట్టేయాలి.. ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే, ఇండియాలోనే తోపు ప్రొడ్యూసర్స్ అనుకున్న హంబలే నుంచి యష్ రాజ్ ప్రొడక్షన్స్ వరకు, అన్ని బ్యానర్లు వీళ్లకోసం వేయిటింది. బాహుబలి తీసిన శోభు యార్లగడ్డ ఇప్పటికే మహేశ్ బాబుని 8 సార్లు కలిశాడు.. ఐనా సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రమే కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా ప్రొడ్యూసర్ల ఆఫర్లకు ఏది తేల్చట్లేదు.ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే సూపర్ స్టార్ మహేశ్ బాబు, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరికి 300 నుంచి 400 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు. 100 కోట్ల వరకు అడ్వాన్సే పే చేసేందుకు రెడీ అయ్యారు.. ఐనా ఇటు మహేశ్, అటు ఎన్టీఆర్ ఎటు తేల్చట్లేదు? ఎందుకు? ఏదైనా ఊహకు మించే బాంబు పేల్చే ప్రయత్నమా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ ఫస్ట్ పార్ట్ 90శాతం అయిపోయిందని తెలుసా? ఇది నిజంగా షాకింగ్ న్యూసే.. 90శాతం షూటింగ్ అయిపోతే, ఎందుకు ఇంకా దసరా వరకు డ్రాగన్ టీం షూటింగ్ ని కంటిన్యూ చేస్తోంది.. అక్కడే సెకండ్ పార్ట్ ప్లానింగ్ రివీల్ అవుతోంది. కట్ చేస్తే ఇంచుమించు ఇలానే సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి సినిమా షూటింగ్ కూడా పూర్తి కావస్తోంది.. 50శాతం టాకీ పార్ట్,70శాతం గ్రాఫిక్స్ పూర్తైందని తెలుస్తోంది..అయితే ఇక్కడ ఇది కాదు మైండ్ బెండ్ చేస్తోన్న న్యూస్... మహేశ్ బాబు నెక్ట్స్ ఏంటి? ఎన్టీఆర్ డ్రాగన్ తర్వాత ఎంచుకునే ప్రాజెక్ట్ ఏంటి? కనీసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ మూవీ చేస్తాడు, లేదంటే దేవర 2 పైప్ లైన్ లో ఉందని అందరికి హింట్స్ ఉన్నాయి.. కాని సూపర్ స్టార్ నెక్ట్స్ ఏంటనే ప్రశ్నకే సమాధానం లేదు.. అక్కడే రెండు డజన్ల కొద్ది పెద్ద నిర్మాతలు.. వేయిటింగ్...

బాహుబలి తీసిన శోభుయార్లగడ్డ మహేశ్ బాబుని ఇప్పటికే 8 సార్లు కలిశాడు. 400 కోట్ల వరకు భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశాడు. ఇక కేజీయఫ్ లాంటి సినిమాలు తీసిన కన్నడ బ్యానర్ హంబలే నుంచి ఇంచుమించు ఇలాంటి ఆఫరే మహేశ్ బాబు కి వచ్చింది. డ్రాగన్ తో పాన్ ఆసియాని షేక్ చేసే అవకాశం ఉండటంతో, ఎన్టీఆర్ డేట్లు పట్టేందుకు కూడా 30కి మంది బడా నిర్మాతలు క్యూలో ఉన్నారు.యష్ రాజ్ నుంచి ధర్మా ప్రొడక్షన్ వరకు, హంబలే నుంచి మైత్రి మూవీ మేకర్స్ వరకు, ఇలా చాలా మంది నిర్మాతలు, ఎన్టీఆర్, మహేశ్ బాబు నెక్ట్స్ ప్రాజెక్టులకోసం అడ్వాన్స్ ఇచ్చి, డేట్లు పట్టేందుు క్యూలో నిలుచున్నారు. ఎందుకంటే ఇండియాలో ఇప్పుడు ఈ ఇద్దరే పాన్ ఆసియా, పాన్ వరల్డ్ లెవల్లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్న స్టార్..

ఆల్రెడీ వారణాసి షూటింగ్ జూన్ లో పూర్తవుతుందని తేలింది. తర్వాత ఎలాగూ మహేశ్ బాబు ఫ్రీ అవుతాడు.. కాబట్టి తన డేట్లకోసం, దిల్ రాజు నుంచి మైత్రీ వరకు, హంబలే నుంచి యష్ రాజ్ బ్యానర్ వరకు 24 టాప్ ప్రొడ్యూసర్స్ వేయిటింగ్. ఎన్టీఆర్ డ్రాగన్ తర్వాత సీనే మారిపోతుంది కాబట్టి, అది పూర్తయ్యేలోపే తన నెక్ట్స్ ప్రాజెక్టుని కన్ఫామ్ చేసుకోవాలి... అలానే నిర్మతలు క్యూ కట్టారు.అయితే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తేలలేదు... దేవర 2 ఎలాగో హోం బ్యానరే కాబట్టి టెన్షన్ లేదు... ఎటొచ్చి, ఎన్టీఆర్, గాడ్ ఆఫ్ వార్ విషయంలోనే నిర్ణయం తీసుకోలేకపోతున్నాడట. డ్రాగన్ రెండో పార్ట్ కూడా ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలౌతుందట. ఈలోపు 90శాతం పూర్తైన డ్రాగన్ ఫస్ట్ పార్ట్ పెండింగ్ వర్క్ కూడా పూర్తి చేస్తారని తెలుస్తోంది. ఐతే సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రం తనకి ఎంతమంది బంపర్ ఆఫర్లు ఇచ్చినా, కథ, దాన్ని తీసే దర్శకుడు వీటితో రమ్మనే అంటున్నాడు తప్ప... కేవలం రెమ్యేనరేషన్ కి టెమ్ట్ కావాట్లేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ ది కూడా అదే మాటని తెలుస్తోంది.

Published : 
  • 17 February 2026, 9:15 PM IST