జేమ్స్ బాండ్ కి నచ్చిన యానిమల్.. MADMAX షురూ..?

సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి తర్వాత ఏం చేయబోతున్నాడు? ఏం చేస్తాడు..? ఇవే ప్రశ్నలు ఆల్ ఆఫ్ సడన్ గా ఎదురౌతున్నాయి.

Post Published By: dialnews
Updated : 19 February 2026, 6:50 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి తర్వాత ఏం చేయబోతున్నాడు? ఏం చేస్తాడు..? ఇవే ప్రశ్నలు ఆల్ ఆఫ్ సడన్ గా ఎదురౌతున్నాయి. కారనం వారణాసి షూటింగ్ 50 శాతానికి పైనే పూర్తవటం... జూన్ లోగా షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టబోతుండటం.. ఐతే ఆల్రెడీ సుకుమార్ తో జేమ్స్ బాండ్ జోనర్ లో మూవీ ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. కాని సందీప్ రెడ్డి వంగ వచ్చి మహేశ్ బాబు డేట్లు ఎగరేసుకుపోయినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకు ఇది కేవలం రూమరే.. కాని యానిమల్ సీక్వెల్ ని త్యాగం చేసి సందీప్ రెడ్డి చాలా పెద్ద నిర్ణయమే తీసుకున్నాడని తెలుస్తోంది. అర్జున్ రెడ్డి హిట్ తర్వాత సందీప్ రెడ్డి కలిసిన హీరో అంటే సూపర్ స్టారే.. అప్పటి నుంచి తనకో కథ చెప్పి, దాని అప్రూవల్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు సందీప్ రెడ్డి వంగ.. మరి సూపర్ స్టార్ నుంచి భారీ పిలుపు రావటంతో, స్పిరిట్ షూటింగ్ లో ఉన్న తను, యానిమల్ సీక్వెల్ నే త్యాగం చేశాడా? 900 కోట్లు రాబట్టిన సినిమాకు సీక్వెల్ అంటే 2 వేల కోట్లుపైనే వసూల్లు రాబట్టే ఛాన్స్ఉంది.. అలాంటిఅవకాశాన్ని రణ్ బీర్ కపూర్ వదులుకుంటాడా? ఈప్రశ్నలకు సందీప్ రెడ్డి కనిపెట్టిన సొల్యూషన్ మైండ్ బెండయ్యేలా చేస్తోందా? ఇంతకి ఆ ఆన్సర్ ఏంటి?

సూపర్ స్టార్ మహేశ్ బాబు తో సందీప్ రెడ్డి మూవీ కన్ఫామ్ అయినట్టేనా? ఆల్ ఆఫ్ సడన్ గా ఈ ట్విస్ట్ ఏంటి? ఒకవైపు వారణాసి షూటింగ్ జరుగుతోంది. తర్వాత సుకుమార్ తో జేమ్స్ బాండ్ జోనర్ లో సినిమాను లెక్కల మాస్టారు టీం ప్లాన్ చేస్తోంది.. ఇలాంటి టైంలో సందీప్ రెడ్డికి మహేశ్ బాబు బల్క్ గా డేట్లు, కావాల్సినన్ని గ్రీన్ సిగ్నల్లు ఇచ్చేశాడా?ఇదే షాకింగ్ గా ఉంది. ఎందుకంటే ప్రజెంట్ రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ తీస్తున్నాడు సందీప్ రెడ్డి.. తర్వత ఎలాగూ రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తీయబోతున్నట్టు ఈమధ్యే తేల్చాడు. అఫీషియల్ గా నే తను, తన టీం తేల్చింది.. కాని ఆల్ ఆఫ్ సడన్ గా సందీప్ రెడ్డి ఇప్పుడు మహేశ్ బాబు మూవీ తీసేందుకు రెడీ అయ్యాడు..

అక్కడే సూపర్ స్టార్ మహేశ్ బాబు నుంచి వచ్చిన కాలే కారణం అంటున్నారు. గతంలో చాలా సార్లు ఇటు మహేశ్ బాబు, అటు ఎన్టీఆర్ ఇద్దరికీ స్టోరీ లైన్లు వినిపించి, ఇద్దరి మధ్య చక్కర్లు కొట్టాడు సందీప్. అయితే డ్రాగన్ తర్వాత దేవర2 , ఆతర్వాత సందీప్ రెడ్డితో ఎన్టీఆర్ సినిమా ఉండొచ్చనే బలంగా వార్తలు వినిపించాయి. అవే నిజానికి చాలా దగ్గరగా ఉన్నాయి.కాని వారణాషి జూన్ ఎండ్ లోగా షూటింగ్ పూర్తి చేసుకోబోతోంది. ఇక జులై నెల ఫ్యామిలీకి కేటాయించబోతున్న మహేశ్ బాబు, ఆగస్ట్ నుంచి వారణాసి ప్రమోషన్ కోసం వరల్డ్ టూర్ కి వెళ్లబోతున్నాడు. సో తను తిరిగొచ్చాక కొత్త సినిమా మొదలవ్వొచ్చు. రెగ్యులర్ షూటింగ్ మాత్రం 2027 మే నుంచే ఉండాలనేది మహేశ్ బాబు కండీషన్.. ఆలెక్కన ఈలోపు స్పిరిట్ ని సందీప్ రెడ్డి వంగ పూర్తి చేసే ఛాన్స్ఉంది.

కానీ ఈలోపు సుకుమార్ తో రామ్ చరణ్ మూవీ మొదలవ్వటమే కష్టం, ఇక పూర్తై, మహేశ్ కి సుకుమార్ అందుబాటులో ఉండే ఛాన్స్ లేదు.. కాని తను ఫ్రీ అయ్యేలోపు సందీప్ తో సినిమా, ఆతర్వాత సుకుమార్ తో మూవీని ప్లాన్ చేసుకున్నాడట మహేశ్. మొత్తానికి మహేశ్ బాబు కాల్ చేయటం వల్లే, రణ్ బీర్ కపూర్ ని ఒప్పించి యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ తాలూకు ప్లాన్ వాయిదా వేశాడట సందీప్. మహేశ్ బాబు మూవీ అయ్యాకే యానిమల్ పార్క్ ఉంటుందని తెలుస్తోంది. ఇంతకి మహేశ్ బాబుతో సందీప్ రెడ్డి తీయబోయే సినిమా జోనర్ ఏంటో తెలుసా? అదే హాలీవుడ్ క్రేజీ సబ్జెక్ట్ మ్యాడ్ మ్యాక్స్.. ఈ సినిమా స్టోరీ లైన్ కాపీ రైట్సే సందీప్ టీం ట్రై చేస్తుండటంతో, ఆ జోనర్ లో అదే మూవీ ప్రేరణతో ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు సందీప్ రెడ్డి.

 

Published : 
  • 19 February 2026, 6:50 PM IST