సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫేట్ ని మార్చిన మూవీ అంటేనే పోకిరి... తనకి సూపర్ కమర్శియల్ హిట్ ముందుగా మురారితో రావొచ్చు... ఒక్కడుతో మాస్ ఇమేజ్, అతడుతో డైలాగ్ డెలివరీ మారిపోయుండొచ్చు.. కాని ప్రిన్స్ ని సూపర్ స్టార్ రేంజ్ హీరో గా మార్చింది మాత్రం పోకిరినే.. కట్ చేస్తే ఆతర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్లు తన ఎకౌంట్ లో పడ్డాయి. అలాంటి తనకి మళ్లీ తన తలరాత మార్చే రేంజ్ కంటెంట్ పడలేదు.. అలాని వారణాసి తన ఫేట్ నే మారుస్తుందా అంటే, మార్కెట్ పరంగా మార్చొచ్చు.. గ్లోబల్ గా వారణాసితో తనకి ఉన్న గుర్తింపు పెరిగిపోవచ్చు... కాని తన తలరాత మార్చే మూవీ పడాలంటే ఒక్కడితోనే.. ఆ ఒక్కడే ఈ ఒక్కడితో ఇంతవరకు సినిమా తీయలేదు. అలాంటప్పుడు ఆ ఒక్కడే మహేశ్ ఫేట్ మారుస్తాడని ఎలా అనుకోగలం? అక్కడే రౌడీ పోకీరి ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు.. పోకిరి తర్వాత రౌడీ పోకిరిగా సూపర్ స్టార్ మారబోతున్నాడు.
ప్రిన్స్ నుంచి సూపర్ స్టార్ వరకు ఎదిగే క్రమంలో మహేవ్ బాబు తలరాతని చాలా సినిమాలు మార్చాయి..మురారి, ఒక్కడు, అతడు, ఇలా గుంటూరు కారం వరకు చాలా సినిమాలు మహేశ్ బాబు ఫేట్ ని , కెరీర్ ని షేప్ చేసుకుంటూ వచ్చాయి. కాని తనలోని మాస్ స్టార్ ని ఒక్కడు మూవీ పరిచయం చేస్తే, అతడు తన డైలాగ్ డెలివరీనే మార్చేసింది.ఐతే అన్ని సినిమాలు ఒకలా ఉండవనేలా, ట్రెండ్ సెట్ చేసింది మాత్రం పోకిరి. పూరీ జగన్నాథ్ మేకింగ్ లో వచ్చిన ఈ సినిమా తర్వాతే మహేశ్ బాబు ఫేట్ మారిపోయింది. ఆతర్వాత పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్లు మహేశ్ ఎకౌంట్ లో చాలానే పడ్డాయి. కాని పోకిరీ అంటేనే ట్రెండ్ సెట్టర్.. అలా అనిపించే డిఫరెంట్ కాన్సెప్ట్స్ మాత్రం పుష్కరానికోసారి వస్తాయి.
అలాంటిదే వారణాసా అంటే; ఒకరకంగా నిజమే కాని.. ఇదేదో మహేశ్ బాబు తలరాతని మార్చే తరహా మూవీ అనలేం. డెఫినెట్ గా పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ లెవల్ కి మహేశ్ నీ వారణాసి తీసుకెళుతుంది. గ్లోబల్ గా గుర్తింపు దక్కేఛాన్స్ఉంది... మార్కెట్, రెమ్యునరేషన్, రీచ్ అన్ని పెరిగిపోతాయి. కాని మహేశ్ ఆల్రెడీ సూపర్ స్టార్...తనని కొత్తగా రాజమౌళి ఏం మారుస్తాడు.. మహాఅయితే జుట్టు పెంచేలా చేసి లుక్ మార్పిస్తాడు.. గొప్ప హిట్ ఇస్తాడు.. కాని తన తలరాతనే పోకిరి లెవల్లో వారణాసి మారుస్తుందా? కేవలం మార్కెట్ ని, క్రేజ్ ని మాత్రమే వారణాసి మూవీ పెంచే ఛాన్సింది. కొన్ని సినమాలను వసూళ్ల తో పోల్చలేం.. అలాంటి మూవీలే పోకిరి, నిజం... ఇందులో ఒకటి ఇండస్ట్రీ హిట్.. నిజంతో మాత్రం మహేశ్ పెర్ఫార్మర్ గా నెక్ట్స్ లెవల్ అనిపించాడు. అతడు కూడా మహేశ్ డైలాగ్ డెలివరి స్టైల్ నే మార్చేసింది.
అందుకే అప్పటి వరకు ఒక లెక్క, ఆతర్వాత ఇంకో లెక్క అనిపించే పాత్ర పడితే చాలు.. అది వసూళ్ల సునామీలు తేకున్నా, అలాంటి మూవీనే హీరో ఫేట్ మారుస్తుందనుకోవచ్చు.. అలాంటి కాంబినేషన్ సందీప్ రెడ్డి వంగతోనే పడేలా ఛాన్స్ఉందా?ఆల్రెడీ సుకుమార్ తో జేమ్స్ బాండ్ తరహా మూవీ చేయబోతున్నాడు మహేశ్ బాబు. ఇక ప్రశాంత్ నీల్ మైథలాజికల్ డ్రామాతో సూపర్ స్టార్ కృష్ణావతారం కన్ఫామ్ అంటున్నారు. ఇలాంటి టైంలో యానిమల్ ఫేం సందీప్ స్పిరిట్ తర్వాత మహేశ్ తో సినిమా మొదలు పెడితే ఏంటి పరిస్తితి... తన సినిమాలంటే రౌడీ డాక్టర్, రౌడీ బిజినెస్ మ్యాన్, రౌడీ పోలీస్... అర్జున్ రెడ్డి, యానిమల్, స్పిరిట్ లో హీరోయిజం అంటే ఇదే.. ఆలెక్కన మహేశ్ బాబుని రౌడీ పొలిటీషియన్ గాచూపిస్తాడా? అదే జరిగితే ఇదే తన ఫేట్ ని, నటుడిగా తన జర్నీని మార్చే మూవీ అన్న అంచనాలున్నాయి. కాని ఏది ముందు పట్టాలెక్కుతుందో, దాన్ని బట్టే, 2028 లో సూపర్ స్టార్ వైబ్రేషన్స్ మారే ఛాన్స్ఉంది.