డైనోసార వీరుడు.. WORLDలో ఫస్ట్ పోకిరి..?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాలీవుడ్ డైనోసార్లు తప్ప...మనకు లోకల్ డైనోసార్లు లేవు.. అంటే డైనోసార్ కాన్సెప్ట్ తో ఇక్కడ సింగిల్ సినిమా రాలేదు. తీయాలన్నా, ఆరేంజ్ లో గ్రాఫిక్స్ , విజువల్ ఎఫెక్ట్స్ అంటే బడ్జెట్ బక్కెట్ తన్నేయాల్సిందే..

Post Published By: dialnews
Updated : 21 April 2026, 8:20 PM IST

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాలీవుడ్ డైనోసార్లు తప్ప...మనకు లోకల్ డైనోసార్లు లేవు.. అంటే డైనోసార్ కాన్సెప్ట్ తో ఇక్కడ సింగిల్ సినిమా రాలేదు. తీయాలన్నా, ఆరేంజ్ లో గ్రాఫిక్స్ , విజువల్ ఎఫెక్ట్స్ అంటే బడ్జెట్ బక్కెట్ తన్నేయాల్సిందే.. అలాంటి టైంలో జురాసిక్ పార్క్ లాంటి ఎపిసోడే ప్లాన్ చేశాడు రాజమౌలి. వారణాసిలో డైనోసార్ ఎపిసోడ్ ఇప్పుడు తెరకెక్కబోతోంది. ఈ వేసవి చిన్న బ్రేక్ లో చాలా పెద్ద షాకింగ్ సీన్ కి రాజమౌళి స్కెచ్చేసినట్టే కనిపిస్తున్నాడు. హాలీవుడ్ జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్ లో కూడా రాక్షస బల్లులని చూపించారు.. కాని వాటి మీద హీరో స్వారి చేసింది లేదు.. అలాంటి విచిత్రం ఇండియన్ సినిమాలో కనిపించబోతోందా? త్రిబుల్ ఆర్ లో ఎన్టీఆర్ ఎలాగైతే యానిమల్స్ తో మైండ్ బెండైయ్యే ట్విస్ట్ ఇచ్చాడో.. అచ్చం అలాంటి ట్విస్ట్ వారణాసిలో డైనోసార్లతో రాజమౌళి ఇవ్వబోతున్నాడా?

గుర్రం మీద హీరో స్వారి అంటే మగధీర గుర్తుకొస్తుంది... అదే డైనోసార్ మీద హీరో స్వారి అంటే ఏం గుర్తుకు రావాలి.. వారణాసి.. ఔను వింటానికి వింతగా ఉన్నా... ఆ వింతనే జూన్ లో జరగబోతోంది. వారణాసిలో ఊర మాస్ ఎలివేషన్ సీన్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ ని ప్లాన్ చేసిన రాజమౌళి, ఆ సీక్వెన్స్ ని జూన్ లో షూట్ చేయబోతున్నాడు. ఈలోపు వేసవి సెలవులు ఇచ్చేశాడు.ఎంత సేపు రాక్షస బల్లులంటే, హీరో అండ్ టీం వెంటపడి, చంపుకుతినే భారీ జంతువుల్లానే చూశాం... జురాసిక్ పార్క్, జురాసిక్ వరల్డ్.. ఇలా చాలా ఫ్రాంచైజీల్లో సినిమాలొచ్చాయి. వరల్డ్ మార్కెట్లని షేక్ చేశాయి. మన ఇండియన్ ఆడియన్స్ కి కూడా డైనోసార్ల సీనిమాలను పరిచయం చేసింది హాలీవుడ్ మూవీలే.. కనీసం జపాన్ వాళ్లైనా, సాహస మోత్ర సాగర గాడ్జిల్లా అని వాళ్లవంతుగా వాల్ల ప్రయత్నం చేశారు.

కాని ఇండియన్ సినిమాల్లోనే గ్రాఫిక్స్ ఎంత గొప్పస్థాయికి వెళ్లినా, డైనోసార్లను చూపించే ప్రయత్నం చేయలేదు. జాంబీ మూవీలొచ్చాయి.. కౌబాయ్ సినిమాలొచ్చాయి.. ఆఖరికి జేమ్స్ బాండ్ జోనర్ ని కూడా మనోళ్లు టచ్ చేశారు. కాని డైనోసార్ల జోలికి మాత్రం ఇక్కడి ఫిల్మ్ మేకర్లు వెళ్లలేదు. ఆ ప్రయత్నమే వారణాసిలో ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం చేస్తున్నాడు రాజమౌళి.త్రిబుల్ ఆర్ ఇంటర్వెల్ సీన్ లో జంతువులన్నీంటికితో ఎలాగైతే హీరో జెంప్ చేసే ఊర మాస్ సీన్ ఉంటుందో.. అచ్చం అలాంటిదే వారణాసిలో డైనోసార్ సీన్ ప్లాన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఫస్ట్ ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కే సినిమానే కాదు, ఫస్ట్ టైం ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద డైనోసార్లని చూపించబోతున్నసినిమా కూడా ఇధే.

కాలంలో వెనక్కి వెళ్లాల్సి రావటంతో హీరోనే డైనోసార్ల కాలంలో వెనక్కి వెళ్లి, తను పోగొట్టుకున్న విశ్వని కిచెందిన వస్తువుని తీసుకు వస్తాడు.. ఈప్రాజెస్ లో డైనసార్లతో ఫైట్ చేయటం లాంటివి లాజిక్ కి దగ్గరగా ఉండేలా గట్టిగానే ప్లాన్ చేశాడట రాజమౌలి. అందులో భాగంగా ఒక డైనోసార్ మీద హీరో స్వారి ఉంటుందనే టాక్ ఫ్యాన్స్ కే కాదు,మూవీ లవర్స్ కి కూడా కిక్ ఇస్తుంది.. మరి ఇదెప్పుడు రివీల్ చేస్తారో కాని, ప్రచారం బానే జరుగుతోంది. ఆఫ్టర్ సమ్మర్ బ్రేక్, జూన్ నుంచి ఈ డైనోసార్ ఎపిసోడ్ షూట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

Published : 
  • 21 April 2026, 8:20 PM IST