హాలీవుడ్ లో కొత్త జేమ్స్ బాండ్ ఎవరో తేలలేదు.. కాని కథ సిద్దమౌతోంది.. ఐతే ఇండియా లో మాత్రం మన జేమ్స్ బాండ్ సూపర్ స్టార్ మహేశ్ బాబని తేలింది. స్టోరీ లైన్ కూడా సిద్దమైనట్టు తెలుస్తోంది. సుకుమార్ డైరెక్షన్ లో మహేశ్ బాబు చేయబోయే, మూవీ టైటిల్ మోస్ట్ లీ మిస్టర్ భీమ్ అయ్యుండొచ్చు.. లేదా భీమ్ అన్న పదం ఖచ్చితంగా టైటిల్ లో ఉండొచ్చు.. ఐతే ఇక్కడ సమస్య అది కాదు... హాలీవుడ్ జేమ్స్ బాండ్ మూవీ... ఔను ఇది అలానే సూపర్ స్టార్ మహేశ్ బాబు మూవీ రెండూ కూడా ఒకే స్టోరీలైన్ తో తెరకెక్కేలా ఉన్నాయి.. అది కూడా ఒకే టైం లైన్ లో షూటింగ్ మొదలయ్యేలా ఉంది. ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ విషయంలో హాలీవుడ్ జేమ్స్ బాండ్ వర్సెస్ ఇండియన్ జేమ్స్ బాండ్ అంటున్నారు.. ఇంతకి సడన్ గా ఇంతగా హాలీవుడ్ మూవీతో ఇండియన్ జేమ్స్ బాండ్ కి ఇంత కోఇన్స్ డెన్స్ ఏంటి?
సూపర్ స్టార్ మహేశ్ బాబుని చాలా మంది, చాలా సార్లు జేమ్స్ బాండ్ మూవీ తీస్తే, తనే సరైనోడన్నారు. ఐతే ఈ మాటలన్నీ ఇప్పడు నిజం కాబోతున్నట్టున్నాయి.. ఎంత నిజం గా మారబోతున్నాయంటే, రియల్ జేమ్స్ బాండ్ తో పోటీ పడేంతగా మహేశ్ బాబు మూవీ షాక్ ఇచ్చేంత... ఎందుకంటే అప్పడెప్పుడో నో టైం టు డై సినిమా తర్వాత మరో జేమ్స్ బాండ్ మూవీ రాలేదు.ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ నడుస్తోంది. డ్యూన్ డైరెక్టర్ ఈ సినిమాను తీయబోతున్నాడు. పీకీ బ్లైండర్స్ వెబ్ సీరీస్ రైటర్ ఈ మూవీకి స్క్రిప్ట్ రెడీ చేస్తున్నాడు. విచిత్రం ఏంటంటే, ఇంతవరకు కొత్త జేమ్స్ బాండ్ ఎవరో కూడా డిసైడ్ కాలేదు. మోస్ట్ లీ ఈ ఇయర్ ఎండ్ లోగా కొత్త జేమ్స్ బాండ్ ఎవరో తేలబోతోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ నుంచి కొత్త జేమ్స్ బాండ్ సినిమామొదలవ్వొచ్చు.
ఇక్కడ సూపర్ స్టార్ మహేశ్ బాబుకి కనెక్ట్ అయ్యే అంశం ఏంటంటే, 2027 లోనే మహేశ్ బాబుతో సుకుమార్ తీయాలనుకుంటున్న సినిమా మొదలయ్యేలా ఉంది. అది కూడా జేమ్స్ బాండ్ జోనర్ లోనే తెరకెక్కబోతోంది. కేవలం అలాంటి జోనర్ లో సినిమా తీస్తే, రెండూ ఒకదానికి ఒకటి పోటీ అనగలమా? అక్కడే సీన్ లోకి ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ వచ్చి కూర్చుంది.హాలీవుడ్ జేమ్స్ బాండ్ మూవీలో విలన్ తోపాటు అసలు సబ్జెక్ట్ అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్ చుట్టూనే తిరుగుతుందని ప్రచారం జరుగుతోంది. ఎమ్ జీ ఎం బ్యానర్ కూడా బేసిక్ జోనర్ ని కూడా తేల్చింది. కాబట్టే ఇక్కడ సమస్య వస్తోంది. ఎందుకంటే సుకుమార్, మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా ఏఐ నే కీ ఎలిమెంట్ గా వాడబోతున్నారట.
ఇక ఆ ఏఐ పేరు మిస్టర్ భీమ్... ఇదేం కొత్త పాయింట్ కాదు.. హాలీవుడ్ మూవీ మిషన్ ఇంపాజిబుల్ లాస్ట్ వర్షణ్ లో ఇధే పాయంట్ తో సినిమా వచ్చంది. ఒక యంత్ర తన ఆదీనంలోకి ప్రపంచాన్ని తీసుకోవాలనుకుంటే, హీరో ఎలా ఆ ఆర్టీఫీషియల్ ఇంటెలీజెన్స్ ని బ్రేక్ చేశాడు అనేదే కథ...ఇది కూడా కొత్త పాయింట్ కాదు.. హాలీవుడ్ లోనే 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈగల్ ఐ నుంచి ప్రేరణతోనే మిషన్ ఇంపాజిబుల్ వచ్చింది.. ఇప్పుడు జేమ్స్ బాండ్ మూవీ రాబోతోది. విచిత్రం ఏంటంటే ఇది మొదలయ్యే టైం లోనే మహేశ్ బాబుతో సుకుమార్ మూవీ మొదలయ్యేలా ఉంది. కాన్సెప్ట్ లో కూడాకో ఇన్సైడ్ అయ్యే అంశం ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్... అందుకే ఏమాత్రం క్వాలిటీలో జేమ్స్ బాండ్ ని మహేశ్ బాబు సినిమా రీచ్ అయినా, వారణాసి తర్వాత వచ్చే తన పాన్ వరల్డ్ ఇమేజ్ కి తగ్గట్టు, ఇదో సెన్సేషన్ అయ్యే ఛాన్స్ఉంది.