మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కొత్త ట్యాగ్ రాబోతోందా? ఆల్రెడీ గతంలో యంగ్ టైగర్ అనేవాళ్లు.. ఆ బిరుదు నుంచి, మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారాడు. త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా హిట్ తర్వాత దేవర నుంచే తనకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ట్యాగ్ వచ్చింది. అదే కంటిన్యూ అవుతోంది. ఐతే 2027 లో మాత్రం ఎన్టీఆర్ మరో కొత్త ట్యాగ్ తో మనముందుకొస్తాడా? 2027 లోనే తన డ్రాగన్ మూవీ రాబోతోంది. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాదు.. అలాని పాన్ వరల్డ్ మూవీ కాదు.. పాన్ ఆసియా సినిమాగా వచ్చి, రెండో భాగం మాత్రం పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఐతే ఇప్పడు తన ట్యాగ్ మారాల్సిన అవసరమేంటి? జూనియర్ ఎన్టీఆర్ అన్న పేరునుంచి సీనియర్ గా మారాక, యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారాక, మళ్లీ ఈ మార్పుకి రీజనేంటి? 2027 ఏడాదితో ఉన్న లింకేంటి? ఇంతకి ఎన్టీఆర్ కొత్త ట్యాగ్ ఏమై ఉంటుందని ప్రచారం జరుగుతోంది?
మ్యాన్ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ని ఒక ఏజ్ వరకు, ఇక స్టేజ్ వరకు జూనియర్ ఎన్టీఆర్ అనేవాళ్ళు..కొంత ఏజ్ వచ్చాక, మోస్ట్ లీ అరవింద సమేత టైం లైన్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కాస్త ఎన్టీఆర్ గా మారాడు. విచిత్రం ఏంటంటే, వెంటనే తను చేసిన త్రిబుల్ ఆర్ గ్లోబల్ గా హిట్టైంది... అంతే తన ట్యాగ్ మారిపోయింది. అప్పటి వరకు యంగ్ టైగర్ గా ఉన్న తన ట్యాగ్ మ్యాన్ఆఫ్ మాసెస్ గా మారింది.ఎలాచూసినా జూనియర్ నుంచి ఎన్టీఆర్ గా, అరవింద సమేత వీరరాఘవ తర్వాత మారింది.. యంగ్ టైగర్ నుంచి మ్యాన్ ఆఫ్ మాసెస్ కి త్రిబుల్ ఆర్ తర్వాత తన ట్యాగ్ మారింది. అంటే ఒక్కో సినిమాతో తన రేంజ్, మార్కెట్ లో ఇమేజ్ మారిన ప్రతీ సారి తనకు సంబంధించిన ఏదో ఒక అంశంలో మార్పు కనిపించింది. ఐతే పేరు ముందున్న జూనియర్, లేదంటే అంతకంటేముందున్న ట్యాగ్.
అందుకే పాన్ ఇండియా నుంచి పాన్ ఆసియా రేంజ్ కి వెళుతున్నాడు కాబట్టే, ఎన్టీఆర్ కొత్త ట్యాగ్ కూడా మారేలా కనిపిస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ అన్న ట్యాగ్ వచ్చి ఎంతకాలం కాలేదు. అంతలోనే డ్రాగన్ లాంటి పాన్ ఆసియా మూవీ చేస్తున్నాడని, కొత్త ట్యాగ్ ఇస్తారా? ఇక్కడ అలాంటి ప్రయత్నం జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఆల్ మోస్ట్ డ్రాగన్ తర్వాత తన కొత్త ట్యాగ్ సరికొత్తగా ఉండేలా ఉంది.2027 లో కొత్త సంవంత్సరం కానుకగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి, ప్రశాంత్ నీల్ సరికొత్త సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నాడు. సంక్రాంతికే డ్రాగన్ వస్తుందన్నారు కాని, ఈ ఏడాది కాదు, వచ్చే ఏడాది దసరాకు కూడా ఈ సినిమా వచ్చేలా లేదనే ప్రచారం జరుగుతోంది. అదెంత వరకు నిజమౌతుందో కాని, ఎన్టీఆర్ మాత్రం 2027 నుంచి సరికొత్త ట్యాగ్ తో అప్రోచ్ మార్చబోతున్నాడు.
అదే న్యూ డ్రాగన్ అని అంటున్నారు.. చైనాలో గొప్ప గొప్ప మార్షియల్ ఆర్టిస్ట్ లను డ్రాగన్ తో పోల్చటం కామన్. బ్రూస్లీ మూవీకైతే ఎంటర్ ది డ్రాగన్ అన్న పేర్లు కూడా వాడారు అప్పట్లో.. అలాంటిది న్యూ డ్రాగన్ గా ఎన్టీఆర్ ట్యాగ్ మార్చటం అంటే, చైనా, జపాన్, కొరియా ఇలా సౌత్ ఏషియా అంతా ఒక్కసారిగా ఇటువైపు చూస్తారు.. అందుకే సినిమా టైటిల్ వేరే పెట్టి, అందులో హీరో బిరుదుగా న్యూ డ్రాగన్ అని చూపించబోతున్నారట.తాత తర్వాత మాఫియాని లీడ్ చేసే పాత్రలో వచ్చే మనవడు కాబట్టే అంతా తనని న్యూ డ్రాగన్ అంటారని ప్రచారం జరుగుతోంది. అందువల్లే ఈ సినిమాకు డ్రాగనే టైటిల్ అని అంతా అనుకున్నారు కాని, అసలు టైటిల్ వేరు.. అందులో తన పాత్ర బిరుదు మాత్రమే న్యూడ్రాగన్ అని తెలుస్తోంది. అదే నిజమైతే, ఇదే ఎన్టీఆర్ కి కొత్త ట్యాగ్ అయితే, మాత్రం వరల్డ్ వైడ్ గా ఎన్టీఆర్ ఈజీగా పాన్ వరల్డ్ ఆడియన్స్ ని రీచ్ అవుతాడు. ముందు చైనా, జపాన్, కొరియాలో దూసుకెళతాడు.