వారణాసి తర్వాత రాజమౌళి తీసే సినిమా 2027 జూన్ లో మొదలయ్యే అవకాశాలున్నాయి. రైటర్ విజయేంద్ర ప్రసాద్ టీం ఆల్రెడీ రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం కథ ని షేప్ చేసేపనిలో పడింది. ఐతే ఇప్పటి వరకు బాహుబలి, త్రిబుల్ ఆర్ లో దేశభక్తులు, ఇలాంటి జోనర్లే టచ్ చేసిన రాజమౌళి... ఫస్ట్ టైం సూపర్ హీరో కాన్సెప్ట్ తీస్తే ఎలా ఉంటుంది. తన సినిమాలో నార్మల్ హీరోలనే సూపర్ హీరోలను మించేలా చూపించే దర్శకుడు, ఏకంగా సూపర్ హీరో జోనర్ నే టచ్ చేస్తే, ఇక హీరోయిజం ఏ రేంజ్ లో ఎలివేట్ అవుతుంది? అంతేకాదు టైటిల్ కూడా నరుడా అనంటున్నారు. దానికి కారనం రాజమౌళి కొడుకు కార్తకేయ నరుడా టైటిల్ ని రిజిస్టర్ చేయించటమే. దీనికి తోడు డ్రాగన్ బడ్జెట్ 700 కోట్లు, దేవర సీక్వెల్ బడ్జెట్ 900 కోట్లనే టాక్ ఉంది.. ఇప్పడు రాజమౌళితో ఎన్టీఆర్ చేసే సినిమా బడ్జెట్ కూడ వారనాసి లెవల్లోనేఅంచనా వేస్తున్నారు. అంటే అది ఒక వెయ్యికోట్ల పైనే బడ్జెట్ తో తెరకెక్కొచ్చనుకోవాలా? ఇక నుంచి పాన్ ఇండియా సినిమా అంటే 350 కోట్లు, పాన్ వరల్డ్ మూవీ అంటే 1000 కోట్లు మినిమమ్ బడ్జెట్టు ఉండాల్సిందేనా?
సూపర్ స్టార్ మహేశ్ బాబుని, రుద్రుడిగా, రాముడిగా, శివుడిగా చూపించబోతున్న రాజమౌలి... వారణాసి తర్వాత ఎన్టీఆర్ ని సూపర్ హీరోగా చూపించబోతున్నాడా? ఇంతవరకు రాజమౌలి టచ్ చేయని జోనర్ అంటే సూపర్ హీరో జోనరే..ఎందుకంటే తన రెగ్యులర్ మూవీల్లో హీరోలే సూపర్ హీరో రేంజ్ లో కనిపిస్తారు.. వెండితెరనీ షేక్ చేస్తారు.కాబట్టే ఇంతవరకు రాజమౌళి సూపర్ హీరో జోనర్ టచ్ చేయాల్సి రాలేదు. కాని ఫస్ట్ టైం వారణాసి తర్వాత తను తీయబోయే రెండో పాన్ వరల్డ్ మూవీ సూపర్ హీరో జోనర్ లోఉండేలా ఉంది. లార్డ్ హనుమంతుడి పాత్రే అలా చూపిస్తాడో, లేదంటే రామాయణ మహాభారతాల్లోని కొన్ని పాత్రల కలయికతో, హీరో పాత్రని రెడీ చేస్తున్నాడో.. కాని మైథాలజీకి సూపర్ హీరో జోనర్ ని కలిపే ప్రయత్నం గట్టిగానే జరుగుతున్నట్టుంది.
ఇప్పుడు విజయేంద్ర ప్రసాత్ రైటింగ్ టీం, పుణ్యామాని ఎన్టీఆర్ తో రాజమౌళి ప్రాజెక్ట్ విషయం బయటికొచ్చిందంటున్నారు. ఇక జోనర్ కూడా సూపర్ హీరో జోనర్ అని ప్రచారం జరగటానికి ఆ టిమే కారణమంటున్నారు. ఏదమైనా డ్రాగన్ తర్వాత రాజమౌళి మూవీతో అంటే పాన్ వరల్డ్ మార్కెట్లో సాలిడ్ ప్రాజెక్ట్ పడినట్టే.. ఆల్రెడీ హాలీవుడ్ మూవీ అవేంజర్స్ కొత్త సీక్వెల్ లో షారుఖ్, ఎన్టీఆర్ ఇద్దరిలో ఒకర్ని సూపర్ హీరోగా తీసుకోవాలనుకుంటున్నారు.అలాంటి టైంలో ముందుగానే రాజమౌళి మేకింగ్ లో ఎన్టీఆర్ సూపర్ హీరో మూవీ చేస్తే, అవేంజర్స్ కూడా దానికి తోడైతే, ఒకేసారి రెండు పాన్ వరల్డ్ ప్రాజెక్టులు తనకి దక్కినట్టౌతుంది. దీనికి తోడు డ్రాగన్ కూడా పాన్ వరల్డ్ ప్రాజెక్టే అంటున్నారు. అది ఏమాత్రం వర్కవుట్ అయినా, అది కూడా రెండు భాగాలంటే, పాన్ వరల్డ్ లెవల్లో నాలుగు మూవీలతో బ్యాక్ టు బ్యాక్ ఎటాక్ చేసినట్టౌతుంది.