దేవర”డెన్ లో సూపర్ స్టార్.. వారణాసికి 100 కోట్ల దే”వరం”…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు సడన్ గా అంటార్కిటికా వెళ్లే ప్లాన్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. వారణాసి కోసం రాజమౌలి టీం 300 కిలోల వేయిట్ ఉండే, ఐమ్యాక్స్ కెమెరాను అంటార్కిటికాకు ట్రాన్స్ పోర్ట్ చేయాలనకుంది.

Post Published By: dialnews
Updated : 15 April 2026, 8:15 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు సడన్ గా అంటార్కిటికా వెళ్లే ప్లాన్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. వారణాసి కోసం రాజమౌలి టీం 300 కిలోల వేయిట్ ఉండే, ఐమ్యాక్స్ కెమెరాను అంటార్కిటికాకు ట్రాన్స్ పోర్ట్ చేయాలనకుంది. కాని సడన్ గా ప్లాన్స్ మారాయి... అంటార్కిటికా షెడ్యూల్ లో 20 శాతం ఇక్కడే షూట్ చేయాలనే ఆర్డర్స్ వచ్చాయి.. అది కూడా దర్శక ధీరుడి నుంచే.. ఎందుకు? ఈవిషయంలో రాజమౌళి టీం కోసం దేవరే దిగి వచ్చాడు.. దేవర్ ఇప్పుడు తన డెన్ ని వరంగా ఇచ్చేస్తున్నాడు. ఔను వారణాసి షూటింగ్ సడన్ గా దేవర సెట్ లో మొదలౌతోంది.. దేవర సీక్వె్ల కోసం రెడీ చేసిన సెట్ లో అలా ఎలా వారణాసి షూట్ చేస్తారు? ఐనా అంటార్కిటికా షెడ్యూల్ ఎందుకు క్యాన్సిల్ అయ్యింది. దానికి దేవర సెట్ కి ఉన్న లింకేంటి?

సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక చోప్రా నిజానికి ఈ వారంలో అంటార్కిటికా ఖండం చేరాలి.. అక్కడే వారణాసి కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశారు. హాలీవుడ్ మూవీల్లో కూడా ఇంతవరకు అక్కడా 4 సినిమాలే షూట్ చేశారు. సో అక్కడ తెరకెక్కుతున్న ఐదో సినిమాగా, ఒక భారతీయమూవీ, అందులోనూ తెలుగు సినిమా చరిత్ర స్రుష్టించబోతోంది.అంతవరకు బానే ఉంది. కాని ఇరాన్ , యూఎస్ వార్ పుణ్యమాని ఇప్పుడు అంటార్కిటికాలో షూటింగ్ కి ఇబ్బందులు ఎదురయ్యేలా ఉన్నాయని తెలుస్తోంది. ఎక్కడో గల్ఫ్ కి, ఇంకెక్కడో ఉండే అంటార్కిటికాకి ఎలాంటి లింక్ లేదు. అదో మంచు ఖండం.. కాని యూఎస్ బేస్ ఆ మంచు కండానికి దగ్గర గా ఉండటంతో, ఎప్పుడైనా ఏదైనా జరగొచ్చని అంటార్కిటికాకి జర్నీలు చాల వరకు తగ్గిస్తున్నారని తెలుస్తోంది.

అందుకే వారణాసి టీం, అంటార్కిటికా ప్రయానం ఇందుకే వాయిదా పడింది. అక్కడ తీయాల్సిన సీన్స్ లో 20శాతం సీన్స్ ని ప్రజెంట్ హైద్రబాద్ లో బ్లూ మ్యాట్ లోనే తీయబోతున్నారు. ఈలోపు ఇరాన్, యూఎస్ వార్ కూల్ అయితే, పెండింగ్ సీన్స్ అంటార్కిటికాలో తీయొచ్చని తెలుస్తోంది. అందుకోసం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీసిన దేవర సెట్ ని వాడుకోబోతున్నారు.ఔను దేవర సెట్లో వారణాసి షూటింగ్ అన్న వార్త వైరలైంది. నిజంచెప్పాలంటే, దేవర మూవీ మొత్తం సముద్రం, దాని తీర ప్రాంతం చుట్టూనే ఉంటుంది. అందుకే ఆర్టిఫిషియల్ గా చిన్న చెరువుని, దాని చుట్టూ 5 అంతస్తుల ఎత్తులో బ్లూమ్యాట్ సెట్ ని వేసింది ఫిల్మ్ టీం. దేవర ఫస్ట్ పార్ట్ ని అక్కడే తీశారు. హిట్ కొట్టారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ లో 70శాతం షూటింగ్ కూడా అక్కడే తీయబోతున్నారు.

అలాంటి సెట్ ని తన గురువు రాజమౌలి మూవీ కోసం ఫ్రీ గా ఇచ్చేస్తున్నాడట ఎన్టీఆర్. ఔను ఒక సినిమా కోసం వేసిన సెట్ ని ఆమూవీ షూటింగ్ తర్వాత వేరే వాల్లకు రెంట్ కి ఇవ్వటం కామన్. కాని దేవర సీక్వెల్ ఇంకా మొదలు కాలేదు. ఈలోపే ఆ సినిమా కోసం వాడాల్సిన సెట్ ని వారణాసి షూటింగ్ కి రెంట్ లేకుండా ఇవ్వటానికి రీజన్, దర్శక ధీరుడు రాజమౌళితో ఎన్టీఆర్ కి ఉన్న అనుబంధం..కారణం ఏదైనా, ఇప్పుడు అదే దేవర సెట్ లో వారణాసి కోసం ఇంకొన్ని స్మాల్ కరెక్షన్స్ చేస్తున్నారట. కాకపోతే ఈ సెట్ లో షూట్ చేసే సీన్స్ కోసం 100 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. అంత ఖర్చు పెట్టి తీసే కాస్ట్ లీ సీన్స్ ని ఈ సెట్ లో షూట్ చేస్తున్నారంటే, అదెంత క్వాలిటీ ఔట్ పుట్ కి ఉపయోగ పడే సెట్టో తెలిసిపోతోంది. అలా కూడా దేవర 2 మీద జనాల్లో ఆసక్తి పెరిగేలా ఉంది.

Published : 
  • 15 April 2026, 8:15 PM IST