జక్కన్న వీరుడే కాదు.. అవేంజర్స్ వీరుడతనే..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒక్కడే నాలుగు పాన్ వరల్డ్ సినిమా లు చేస్తున్నాడన్న విషయం ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది..

Post Published By: dialnews
Updated : 23 February 2026, 3:50 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒక్కడే నాలుగు పాన్ వరల్డ్ సినిమా లు చేస్తున్నాడన్న విషయం ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తోంది.. ఇండస్ట్రీ జనాలని షాక్ కి గురి చేస్తోంది. ఇంతవరకు వారణాసి తర్వాత రాజమౌళి తీయబోయేది ఎన్టీఆర్ సినిమా అని మాత్రమే తేలింది. కాని ఇప్పుడు సీన్ లోకి హాలీవుడ్ మూవీ అవేంజర్స్ కొత్త సీక్వెల్ కూడా వచ్చేస్తోంది. రాజమౌళి మూవీ తోపాటు, డ్రాగన్ రెండు భాగాలు, అలానే అవేంజర్స్ లో సూపర్ హీరో పాత్రతో మొత్తంగా ఎన్టీఆర్ ఏకంగా నాలుగు వరల్డ్ ప్రాజెక్టులు చేస్తున్నట్టేనా? ఈవిషయంలో ప్రభాస్,మహేశ్, బన్నీ అందరికంటే అద్రుష్టం కాస్త ఎక్కువే ఎన్టీఆర్ కి దక్కుతోందా? ఈ డౌట్లన్నీ తన ఫేట్ తో నిజం చేస్తున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. నిజం చెప్పాలంటే హాలీవుడ్ సూపర్ హీరోల ఫ్రాంచైజీ అయిన అవేంజర్స్ లో తొలి ఇండియన్ సూపర్ హీరోగా మారే ఛాన్స్ ఎన్టీఆర్ కి వస్తే అదే సెన్సేషనల్ న్యూస్.. దానికి రాజమౌళి ప్రాజెక్ట్ తోడుక కాబోతోందా? లక్ష థియేటర్ల రికార్డుకి ఎన్టీఆర్ సినిమా కేరాఫ్ అడ్రస్ కాబోతోందా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ లో గోల్డెన్ ఎరా మొదలయ్యేలా కనిపిస్తోంది. రెండంటే రెండు హెవీ ప్రాజెక్టులు, తన ఫేట్ నే మార్చేలా ఉన్నాయి.. అందులో ఒకటి రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్. రెండోది హాలీవుడ్ సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజీ అవేంజర్స్ కొత్త సీక్వెల్.. ఔను ఇందులో ఏఒక్కటి అఫీషియల్ గా ఎనౌన్స్ అయినా ఒకటి ఇండియాలో సెన్సేషనల్ న్యూస్ అవుతుంది. అవేంజర్స్ అయితే గ్లోబల్ గా ఎన్టీఆర్ పేరు మారిమోగుతుంది..అయితే ఇక్కడ హాట్ టాపిక్ ఇది మాత్రమే కాదు, తోటి హీరోలు పాన్ ఇండియా లెవల్లో వరుసగా ప్రాజెక్టులు చేయటానికి కిందా మీద పడుతుంటే, ఎన్టీఆర్ ఏకంగా 4 పాన్ వరల్డ్ ప్రాజెక్టులు కన్ఫామ్ చేసుకునేలా ఉన్నాడు. ఇవేవి పాన్ ఇండియా కాదు. పక్కగా పాన్ వరల్డ్. ఇంకో విషయం ఏంటంటే రాజమౌళి డైరెక్షన్ లో ఎన్టీఆర్ మూవీ అన్నది ప్రస్థుతానికి ప్రచారం మాత్రమే..

ఆల్ మోస్ట్ ఇది కన్పామనే అనుకుంటున్నారు. వస్తున్న ఫీలర్స్ అలా ఉన్నాయి. కాకపోతే అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ వారనాసి టీజర్ రోజే వస్తుందనంటున్నారు. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, రాజమౌళి ఈసారి బాహుబలి మించే ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. అంటే మేకింగ్, కంటేంట్ పరంగా మాత్రమేకాదు, ఎన్ని భాగాలు అనే విషయంలో రెండు కాదు, మూడు భాగాలతో బాహుబలినే మించే రిస్క్ కి రెడీ అయ్యాడనంటున్నారు.ఇదే నిజమైతే, ఎన్టీఆర్ ఎకౌైంట్ లో మొత్తం పాన్ వరల్డ్ సినిమాలు 4 కాదు ఆరు పడినట్ౌతుంది..ఆల్రెడీ డ్రాగన్ రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇవి పాన్ వరల్డ్ ప్రాజెక్టులుగా వస్తున్నాయి. ఇక అవేంజర్స్ కన్ఫామ్ అయితే ఆ లెక్కేవేరు. ఈ మూడీంటికి రాజమౌళి మేకింగ్ లో తెరకెక్కే మూడు భాగాల ప్రాజెక్ట్ తోడైతే, 4 కాదు ఆరు పాన్ వరల్డ్ సినిమాలతో 2030 వరకు అసలు గ్యాపే లేకుండా సెట్లకే పరిమితమయ్యేలా ఉన్నాడు ఎన్టీఆర్..అద్రుష్టం కలిసొచ్చి అవేంజర్స్ లోసూపర్ హీరో రోల్ కూడా కన్ఫామ్ అయితే, ఇక అవేంజర్స్ సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి.. అందులో తన పాత్ర కనిపిస్తూనే ఉంటుంది. కాబట్టి పాన్ వరల్డ్ మార్కెట్ లో ఎన్టీఆర్ కి మరో పదేళ్లవరకు సూపర్ ఫ్యూచర్ ఉన్నట్టే అని కన్ఫామ్ చేసుకోవాల్సిందే.. అందుకే ఇది మ్యాన్ ఆఫ్ మాసెస్ కెరీర్ కి సూపర్ గోల్డెన్ ఎరా అనంటున్నారు.

Published : 
  • 23 February 2026, 3:50 PM IST