ఎన్టీఆర్ కి ప్రేమతో… కొత్త సినిమా DUDUL…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో, సుకుమార్ మూవీ అంటే చాలు ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ఎందుకంటే తనతోనే పుష్పరాజ్ మూవీ పడాలి.. మిస్ అయ్యింది.

Post Published By: dialnews
Updated : 12 May 2026, 6:55 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో, సుకుమార్ మూవీ అంటే చాలు ఇండస్ట్రీ షేక్ అవుతుంది. ఎందుకంటే తనతోనే పుష్పరాజ్ మూవీ పడాలి.. మిస్ అయ్యింది. తను మిస్ చేసుకున్నా కనీసం సూపర్ స్టార్ మహేశ్ బాబు అయినా ఆ కథకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనుకుంటే, అది జరగలేదు. ఫైనల్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కే దక్కింది. నిజానికి రంగస్థలం కూడా ఎన్టీఆర్ చేయాల్సిన సినిమానే అని కూడా రూమర్స్ వచ్చాయి.. కాని ఫిల్మ్ టీం, నుంచి ఎన్టీఆర్ వరకు ఎవరూ ఈ టాపిక్ మీద ఎన్నడూ స్పందించింది లేదు. ఐతే ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే, సుకుమార్ కూడా తను ఏ మాస్ మూవీ తీయాలనుకున్నా, ముందు ఎన్టీఆర్ నే సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. తను నో చెబితేనో, తనకి కుదరకపోతేనో ఇలా మరో హీరోని ఆ కథ లు వరిస్తున్నాయి.. ఐతే రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్నమూవీ తర్వాత, ఎన్టీఆర్ తో సాలిడ్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు సుకుమార్. ఆ సినిమా పేరు డుడులేనా? ఇంతకి ఏంటా పేరు? దానర్ధం ఏంటి? మళ్లీ ఎన్టీఆర్ ని సుకుమార్ జీనియస్ లకే జీనియస్ సూపర్ జీనియస్ గా చూపించబోతున్నాడా?

సుకుమార్ తో ఎన్టీఆర్ ఎప్పుడో పదేళ్ల క్రితం సినిమా తీశాడు. అదే నాన్నకుప్రేమతో మూవీ...... నిజానికి ఆతర్వాత రంగస్థలం, పుష్పరాజ్ మూవీలు తీసిన సుకుమార్, ఆరెండు కథలు ముందు ఎన్టీఆర్ కి చెప్పినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. కాని తనకి ఎందుకు కుదర్లేదో కాని, ఇదే పుష్పరాజ్ కథని సూపర్ స్టార్ మహేశ్ బాబు కి చెబితే, హీరో పాత్ర లుక్ విషయంలో ఇద్దరికి వేవ్ లెంథ్ కుదరక, కాంబినేషన్ సెట్ కాలేదనే టాక్ నడిచింది.ఆతర్వాత మహేశ్ బాబు కి చెప్పిన కథ వేరు, పుష్ఫరాజ్ కథవేరని సుకుమార్ ఎంత కవర్ చేసినా, ఇండస్ట్రీ జనాలకు ఉండాల్సిన క్లారిటీ ఉంది. ఐతే ఎందుకో మాస్ కథని ఎన్టీఆర్ తో తీయలేకపోయాననే బాధ సుకుమార్ కి ఉందనే అభిప్రాయం ఇండస్ట్రీ లో ఎప్పుడూ వినిపిస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ ఇష్టపడటం వల్లే, స్టైలిష్ రోల్ నాన్నకు ప్రేమతో డిజైన్ చేశాడు సుకుమార్.

కాని అంతకంటే హై ఇంటెన్సిటీ ఉన్న రంగస్థలం, పుష్పరాజ్ కథలని ఎన్టీఆర్ తో తీయాలనుకున్నాడు. కాని కుదర్లేదు. అయినా ప్రజెంట్ రామ్ చరణ్ తో ప్లాన్ చేస్తున్న మూవీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఎన్టీఆర్ తో సినిమా తీయాలనుకుంటున్నాడు. 2029 లో ప్లాన్ చేసి, 2030 లో రిలీజ్ చేసేలా ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. అయితే ఆ కథేకి టైటిలే డూడుల్ అని తెలుస్తోంది.డూడుల్ అంటే అనుకోకుండా ఏవో గీతలు గీయటం అన్న అర్ధం వస్తోంది... ఆల్రెడీ హాలీవుడ్ ని కుదిపేసిన క్రిస్టోఫర్ నోలాల్ తన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ పేరు డూడుల్ బగ్ అని పెట్టాడు. అది తొలుస్తూ పోయే పేడ పురుగు లాంటి ప్రవర్తన అని అర్ధం వచ్చేలా ఉండే ఆ టైటిల్ లో డూడుల్ కి, ఎన్టీఆర్ తో సుకుమార్ ప్లాన్ చేస్తున్న మూవీ కి పెట్టిన డూడుల్ పేరుకి కనెక్షన్ ఉందా అన్న అనుమానాలున్నాయి.

ఇంకా ఇది ఎన్టీఆర్ మూవీకి పెట్టని పేరా కాదా అన్నది తేలట్లేదు. కాని ఇండస్ట్రీ ఇన్ సైడ్ టాక్ ప్రకారం, డూడుల్ టైటిల్ ని మాత్రం సుకుమార్ రిజిస్టర్ చేయించుకున్నాడట. అందుకే అదే ఎన్టీఆర్ మూవీ కి పెట్టే టైటిల్ అని ప్రచారం జరుుగతోంది. ఐతే నాన్నకు ప్రేమతో లో తండ్రి కోరిక తీర్చే కొడుకుని చూపించిన సుకుమార్, దానికి సీక్వెల్ లాంటిది తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేశాడట.ఆల్రెడీ ఎన్టీఆర్ కి ఒక కథ చెప్పిన తను, మరో ఆప్షన్ గా నాన్నకు ప్రేమతో కి సీక్వెల్గా, ఎన్టీఆర్ కొడుకు రివేంజ్ డ్రామా ప్లాన్ చేశాడట. ఇది మోర్ సైంటిఫిక్, మోస్ట్ జీనియస్ థ్రిల్లర్ గా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈరెండు ఆప్షన్స్ లో ఎన్టీఆర్ ఏం ఎంచుకుంటాడోచూడాలి.. కాకపోతే ఈ సినిమాకు డూడుల్ టైటిల్ పెట్టడం అంటే, పాన్ వరల్డ్ లెవల్ ఐడియాతోనే సుకుమార్ ఉన్నట్టు తెలుస్తోంది. తేలిపోతోంది.

Published : 
  • 12 May 2026, 6:55 PM IST