MASS”గుడ్ న్యూస్”.. బ్లాస్ట్ అయినట్టే…!

ఎన్టీఆర్ తారకమంత్రం వేశాడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మంత్రదండం రెడీ చేశాడు.. కట్ చేస్తే, పాన్ ఇండియా లెవల్లో మాస్ అప్ డేట్ రెడీ... మాస్ గుడ్ న్యూస్ తో రాబోతోంది షాకింగ్ అప్ డేట్ దాడి... డ్రాగన్ టీం మే 20కి ఎలాంటి అప్ డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్

Post Published By: dialnews
Updated : 17 April 2026, 8:15 PM IST

ఎన్టీఆర్ తారకమంత్రం వేశాడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మంత్రదండం రెడీ చేశాడు.. కట్ చేస్తే, పాన్ ఇండియా లెవల్లో మాస్ అప్ డేట్ రెడీ... మాస్ గుడ్ న్యూస్ తో రాబోతోంది షాకింగ్ అప్ డేట్ దాడి... డ్రాగన్ టీం మే 20కి ఎలాంటి అప్ డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుందనే విసయంలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. చాలా పుకార్లు వస్తున్నాయి. కాని గాడ్ ఆఫ్ వార్ మీద మాత్రం క్రిస్టల్ క్లారిటీ తో ఎనౌన్స్ మెంట్ రెడీ అయ్యింది. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ మాస్ బ్లాస్ట్ కి రంగం సిద్ధమైంది... ఎన్టీఆర్ బ్యాక్ లుక్ తో నెవర్ బిఫోర్ అనిపించేలా పోస్టర్ ని రెడీ చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇది జస్ట్ ఫస్ట్ లుక్ లాంటి పోస్టర్ కాదు. అంతుకుమించి.. ఇంతకి షణ్ముఖుడిగా ఆరు ముఖాలతో ఎన్టీఆర్ ఏం చేయబోతున్నాడు? ఆరు ముఖాలంటే, ఆరు పాత్రలా? ఆరు గెటప్పులా? ఇంతకి పోస్టర్ తో ఈ సినిమా మైథాలజీనా? సూపర్ న్యాచురల్ పవర్స్ జోనర్ లో వస్తోందా? అన్నది తేలబోతోందా?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ఏంటంటే, ఒకటి థియేటర్స్ లో సోసోగా ఆడిన వార్ 2 మూవీ ఓటీటీ లో మాత్రం దుమ్ముదులుపుతోంది. ఇక టాప్ వ్యూ ఆన్ డిమాండ్ ప్రకారం, వార్ 2 మూవీని డిజిటల్ గా మని పే చేసి ఎవరైనా చూడొచ్చు.. ఇండియా, ఫ్రాన్స్ లోనే ఈ ఆఫర్ లేదు. కాని వరల్డ్ వైడ్ గా ఈ ఆఫర్ గూగుల్, యాపిల్ టీవీలో ఉండటంతో, అక్కడ వార్ 2 కిరెస్పాన్స్ అదిరిందని తెలుస్తోంది.ఇలా థియేటర్స్ లో సక్సెస్ మిస్ అయినా, గూగుల్ టీవీ, యాపిల్ టీవీలో వార్ 2 వండర్స్ చేస్తోంది. ఇక మరో మాస్ గుడ్ న్యూస్ ఏంటంటే... మే 20న రాబోయే సాలిడ్ అప్ డేట్ ముందే కన్ఫామ్ అయ్యింది. షణ్ముఖ ఇదే టైటిల్ తో గాడ్ ఆఫ్ వార్ మూవీ కన్ఫామ్ అయినట్టే తెలుస్తోంది. టైటిల్ మాత్రం ఫిక్స్. ఎందుకంటే, ఈ టైటిల్ ని మరెవరు రిజిస్టర్ చేయించకుండా, త్రివిక్రమే తన పేరు మీదు టైటిల్ ని రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది.

అంటే గాడ్ ఆఫ్ వార్ కాన్సెప్ట్ మీద ఇన్ని ప్రచారాలు జరుగుతున్న టైంలో, షణ్ముక టైటిల్ రిజిస్ట్రేషన్ బట్టి ఇదే ఆ సినిమా టైటిల్ గా అంతా ఫిక్స్అవుతున్నారు. ఇక వెనక్కి నిలుచుని శూలం పట్టుకున్న ఎన్టీఆర్ ఫోటోని ఫస్ట్ లుక్ పోస్టర్ గా రెడీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా రివీల్ చేయబోతున్నారనేది ఆల్ మోస్ట్ కన్ఫామ్ న్యూసే.అఫీషియలల్ ఎనౌన్స్ మెంట్ కేవలం లాంచనంగానే కనిపిస్తోంది. మాస్ బ్లాస్ట్ ని త్రివిక్రమ్ ఈ సారి సాలిడ్ గానే ప్లాన్ చేశాడు. దాదాపు 800 కోట్ల నుంచి 1000 కోట్ల మధ్య హై బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇక ఇప్పుడు షూటింగ్ లాంచ్ డేట్, రెగ్యులర్ షూటింగ్ ఇన్ ఫర్ మేషన్ ని కూడా ఫిల్మ్ టీం రివీల్ చేయబోతోంది.

మే 20న ఈవెనింగ్ త్రివిక్రమ్, ఎన్టీఆర్ కలిసి ఓ ప్రెస్ మీట్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తేలటంటతో, సడన్ గా మాటల మాంత్రికుడెందుకు స్పీడ్ పెంచాడనే విషయం ఎవరికీ అర్ధం కావట్లేదు. ఏదేమైనా డ్రాగన్ టీం మాత్రం అప్ డేట్స్ ఇవ్వటంలో, టీజర్లు, గ్లింప్స్ తోపాటు కనీసం టైటిల్ పోస్టర్ రివీల్ చేయటంలో కూడా వెనకపబడింది... కాని ఇంకా ప్లానింగ్ దశలోనే ఉన్న గాడ్ ఆఫ్ వార్ కి టైటిల షణ్ముఖ్ అని ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ తీయబోయే సినిమాకు ఫస్ట్ లుక్ పోస్టర్ ని తన బర్త్ డేకి 34 రోజుల ముందే త్రివిక్రమ్ టీం రెడీ చేసినట్టు వార్త వైరలౌతోంది.

Published : 
  • 17 April 2026, 8:15 PM IST