మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ తీయబోతున్న గాడ్ ఆఫ్ వార్ మూవీ, ఒక సెన్సేషనల్ నిర్ణయం.. ఎందుకు ఇది అంత స్పెషలో ఇప్పుడిప్పుడే బయటపడుతోంది.. ఎంతసేపు మైథాలజీ మూవీలంటే ఐతే రామాయణం, లేదంటే మహాభారతాలని బేస్ చేసుకునే తీసేవాల్లు.. ఎన్నడూ మరోవైపు చూసింది లేదు.. అదే ఇప్పుడు జరుగుతోంది. దక్షిణాదినే ఫేమస్ అయిన దేవుడి కథని, ప్రపంచానికి మాస్ స్టైల్లో చెప్పబోతున్నాడు త్రివిక్రమ్. దీనికి తోడు ఊర మాస్ స్టార్ ని దేవుడిగా మార్చే ప్రయత్నం కూడా కాస్త ఫ్యాన్స్ ని షేక్ చేసేదే.. దీనికి తోడు ఇక్కడ కొడితే సౌండ్ మలేషియాలో రావాలనే కోణం ఉంది. అలానే ఏదో మాయ చేసి తమిళ మార్కెట్ లో తిష్టవేయాలని కూడా బలంగా ప్రయత్నిస్తున్నాడు ఎన్టీఆర్. .పాన్ ఇండయాని షేక్ చేసిన ఎన్టీఆర్ కి కోలీవుడ్ అంత ముఖ్యమా అంటే, అక్కడే తలరాతలు మారే స్ట్రాటజీ ఉంది... ఇది పాన్ వరల్డ్ సినిమాగా మారాలంటే, ఎక్కడ కొట్టాలో అక్కడే బుల్లెట్ దింపాలి... ఆ ప్రయత్నం వెనకున్న స్ట్రాటజీ చూస్తే, త్రివిక్రమ్ మామూలోడు కాదని అర్ధమైపోతుంది... ఆ ప్లానింగే రాజమౌళి అండ్ టీం ని షేక్ చేసేలా ఉంది.
గాడ్ ఆఫ్ వార్ మూవీ ఎందుకు ఎన్టీఆర్ కెరీర్ లో వెరీ వెరీ స్పెషల్ మూవీగా మారబోతోందంటే, నిజంగా పాన్ వరల్డ్ గేట్లు తెరవటంతో, ఇదే చాలా కీలకం... రాజమౌలి తన వారణాసితో పాన్ వరల్డ్ గేట్లు బద్దలుకొట్టాలనుకుంటున్నాడు. దానికి తనదగ్గరో స్ట్రాటజీ ఉంది. కాని త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ మరో కోణంలో పాన్ వరల్డ్ మార్కెట్ లోకి ఎంటరవ్వాలనుకుంటున్నాడు.ప్రాక్టికల్ గా కూడా అది చాలా లాజికల్ గానే ఉంది. త్రిబుల్ ఆర్, దేవర పాన్ ఇండియాని షేక్ చేసినా, కోలీవుడ్ లో మాత్రం అనుకున్నంత రెస్పాన్స్ రాలేదు. అసలే అరవోళ్లు, మన హీరోలని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయరు.. ఏదో ఒక్క బాహుబలి వరకు నడిచింది కాని, మరే పాన్ ఇండియా తెలుగు హిట్స్ ని కోలీవుడ్ ఆదరించలేదు... అందుకే అక్కడ కొట్టాలని ఎన్టీఆర్ ఫిక్స్ అయ్యాడు.
టాలీవుడ్ కంటే కోలీవుడ్ చిన్న మార్కెట్టే కావొచ్చు... కాని సింగపూర్, మలేషియా, ఇండోనేషియాలో తమిళులెక్కువ... అక్కడ మన సినిమా పేలాలంటే, కోలీవుడ్ జనాలకు నచ్చేలా మూవీ చేయాలి.. అందుకే గాడ్ ఆఫ్ వార్ మురుగన్ గా మారిపోతున్నాడు ఎన్టీఆర్.. అంతేకాదు పాన్ వరల్డ్ మూవీ అంటే భారీ తనం కంటే, లోకల్ కథనే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీయాలనే స్ట్రాటజీనే త్రివిక్రమ్ ఫాలో అయ్యేలా ఉన్నాడు.ఇక మైథలాజికల్ మూవీస్ అంటే, ఎంతసేపు రామాయణం, మాహభారతం, కోణంలోనే సినిమాలొచ్చేవి.. ఫస్ట్ టైం దక్షనాదిలో ఫేమస్ అయిన మురుగన్ కథతో ఒక పాన్ వరల్డ్ మూవీ రాబోతోంది. అది కూడా కోలీవుడ్, తోపాటు ఇండోనేషియా, మలేషియా మార్కెట్లనే టార్గెట్ చేస్తూ.. ఇది డెఫినెట్ గా చాలా ముదురు స్కెచ్చే..
మురుగన్ అంటేనే సౌత్.. ఎంత శివ పార్వతుల కొడుకైనా, కార్తికేయుడిగా, సుబ్రహ్మణ్యుడిగా నార్త్ ఇండియన్స్ కి తెలిసినా... మైథాలజీలో సౌత్ వాసనతో పాన్ ఇండియా, పాన్ ఆసియాని షేక్ చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇక తమిల లిట్రేచర్ లో మురుగన్ మీద లేని బుక్ లేదు... కాబట్టి గాడ్ ఆఫ్ వార్ ఏమాత్రం వర్కవుట్ అయినా, కోలీవుడ్ మార్కెట్ లోఎన్టీఆర్ జెండా ఎగరేయొచ్చు.అలానే సింగపూర్, మలేషియాలో ఉన్న తమిళుల వల్ల కూడా ఈ సినిమాకు మార్కెట్ పెరుగుతుంది. అలా సౌత్ ఏషియాలో మన హీరోకి మార్కెట్ పెరిగితే, కొరియా, జపాన్, చైనా లో డ్రాగన్ రూపంలో ఎన్టీఆర్ మార్కెట్ పెంచుకోవచ్చు.. ఇవే జరిగితే, ఇక్కడే ఎన్టీఆర్ కి మార్కెట్ క్రియేట్ అయితే, యూరప్, అమెరికన్ మీడియాలో ఎన్టీఆర్ పేరు మారుమోగుతుంది. ప్రజెంట్ కొరియన్ వేవ్ నడుస్తోంది. కాబట్టే అక్కడ ఎవరు జెండా ఎగరేస్తే, వాల్లకి మిగతా ప్రపంచ ద్వారాలు ఈజీగా తెరుచుకుంటాయి... సో ఇలా పరోక్షంగా, భారీ స్కెచ్ తోనే పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్.