కటౌట్+ కంటెంట్ తోడైతే నమ్మాలి Dude…!

రెబల్ స్టార్ ప్రభాస్ ని అప్పట్లో బాహుబలిగా చూసి దేశం మొత్తం షేక్ అయింది.. అసలు రాజు కటౌట్ అంటే ఇలానే కదా ఉండాలి, అనేంత గంభీరంగా కనిపించాడు ప్రభాస్. అందుకే కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మాల్సివస్తుంది.

Post Published By: dialnews
Updated : 9 May 2026, 5:50 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ని అప్పట్లో బాహుబలిగా చూసి దేశం మొత్తం షేక్ అయింది.. అసలు రాజు కటౌట్ అంటే ఇలానే కదా ఉండాలి, అనేంత గంభీరంగా కనిపించాడు ప్రభాస్. అందుకే కటౌట్ చూసి కొన్ని కొన్ని నమ్మాల్సివస్తుంది.. ఈ మాటకు తగ్గట్టే బాహుబలి కథ, అందులో ఎమోషన్స్, అంతకుమించి వార్ సీన్స్ మైండ్ బ్లాంక్ చేశాయి.. కాబట్టే థియేటర్స్ బయట అప్పట్లో వరదలా జనాలు క్యూ కట్టి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇవన్నీ జరిగి పదేళ్లు దాటుతోంది. మరి ఇప్పుడు పాన్ ఇండియా అడ్డుగోగల్ని బద్దలుకొట్టిన బాహుబలి ఎక్కడ..? టాలీవుడ్ కి బాహుబలి తర్వాత మరో బాహుబలి అర్జెంట్ గా ఇప్పుడు కావాలి... అదే చాలా ఏళ్లుగా మిస్ అవుతోంది. త్రిబుల్ ఆర్ హిట్టవ్వొచ్చు, కాని బాహుబలితో పోల్చలేం... కల్కీ, సలార్ లు బాక్సాఫీస్ ని షేక్ చేయొచ్చు, ఐనా బాహుబలి స్రుష్టించిన భీభత్సం మాత్రం రిపీట్ కాలేదు... అందుకే అందరి చూపు స్పిరిట్ పైనే ఉంది. సాలిడ్ కంటెంట్ కి సందీప్ రెడ్డి కేరాఫ్ అడ్రస్.. ఎలాంటి కంటెంట్ నైనా తన కటౌట్ తో ఎక్కడికో తీసుకెళ్లే ఓరా, క్రేజ్ ప్రభాస్ సొంతం.. అందుకే ఈ కాంబో స్పిరిట్ ని సెన్సేషనల్ గా మారుస్తుందా? అందరిలో అవే అంచనాలున్నాయి.. మరి అవి బాహుబలి రోజులని రిపీట్ చేస్తాయా

: బాహుబలి అంటేనే రోమాలు నిక్కబొడిచే సెన్సేషనల్ హిట్.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎవరూ ఊహించని విధంగా, దేశాన్నే ఈ సినిమా కుదిపేసింది. బాలీవుడ్ మూవీలకు కూడా సాధ్యం కాని కలెక్షన్స్ ని, ఒక తెలుగు సినిమా రాబట్టి, చరిత్ర స్రుష్టించింది. ఇదంతా జరిగి పదేళ్లు గడుస్తోంది.. కాని ఇంతవరకు మళ్లీ అలాంటి సినీసునామీ రాలేదు.ఇదే రెబల్ స్టార్ ప్రభాస్ కల్కీతో 1200 కోట్లు కొల్లగొట్టాడు. సలార్ తో 800 కోట్ల తుఫాన్ క్రియేట్ చేశాడు.. ఇక కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీనుంచి కేజీయఫ్ తుఫాన్ వచ్చింది. కాంతారా లాంటి షాకులు, పొన్నియన్ సెల్వన్ లాంటి తమిల ప్రయోగాలు వచ్చాయి... బాలీవుడ్ ని సైడ్ కి వెళ్లిపోయేలా చేశాయి... పాన్ ఇండియా సినిమా అంటే సౌత్ సినిమానే అనేంతగా పరిస్థితి మారిపోయింది.

కాని బాహుబలిని ఏ మూవీ గుర్తు చేయలేకపోయింది. భాషతో సంబంద లేకుండా, దేశం మొత్తంఊగిపోయేలా, ఏకంగా విదేశీ మీడియా కూడా ఇండియాలో సినిమా తూఫాన్ అన్న హెడ్ లైన్స్ తో న్యూస్ వేసేంతగా సీన్ మారిపోయింది. అలాంటి రోజులు మళ్లీ రావాలంటే స్పిరిట్ తోనేనా.. ఈమధ్య ధురందర్ కూడా మరో బాహుబలి అన్నారు. కాని దాని ఎఫెక్ట్ నార్త్ లో ఉన్నంత సౌత్ లో కనిపించలేదు.కాబట్టి వసూళ్ల పరంగా బాహుబలి ని రీచ్ అయ్యిందనొచ్చు.. అంతేకాని బాహుబలి క్రియేట్ చేసినంతగా ఈమూవీ అన్ని ప్రాంతాల్లోపూనకాలు తీసుకువచ్చిందనలేం. ఐతే స్పిరిటి్ లో డార్క్ నేచర్ తో హీరోయిజం చూపించబోతున్న సందీప్, నిజంగా బాహుబలి జమానాని రీక్రియేట్ చేస్తాడా? అంటే రాజులు, రాజ్యాలు, యుద్ధాలని కాదు.

ఇండియన్ ఆడియన్స్ ఎన్నడూ చూడని, భారీ సెట్లు, అంతకంటే భారీ గ్రాఫిక్స్, మైండ్ బ్లాంక్ చేసే యుద్దాలు, అంతకు మించేలా ఎమోషన్ ని పీక్స్ కి తీసుకెళ్లే మేకింగ్.. ఇలాంటి నెవర్ బిఫోర్ ఎక్స్ పీరియన్స్ ని స్పిరిట్ లో సందీప్ రెడ్డి చూపిస్తాడా? ఏమో ఏం చేసినా తనే చేయాలి... లేదంటే మళ్లీ వారణాసితో రాజమౌలినే ట్రై చేసుకోవాలి...ఐతే ఇక్కడ స్పిరిటే ఎందుకు అంత స్పెషల్ అంటే, చాక్లెట్ బాయ్ రణ్ బీర్ నే యానిమల్ గా చూపించిన దర్శకుడు సందీప్ రెడ్డి.. అలాంటి తన చేతిలో డైనోసార్ లాంటి ప్రభాస్ పడితే, బాక్సాఫీస్ లో భూకంపమే వస్తుంది.. ఏమాత్రం కథ బాగున్నా, టాక్ కిక్ ఇచ్చినా, బాహుబలి మించే మూవీగా మారే అవకశం ఉన్న ఒకే ఒక్క సినిమా స్పిరిట్... ప్రస్థుతం మార్కెట్ లో, ఇండస్ట్రీజనాల్లో ఉన్న అంచనాలు ప్రకారం చూస్తే ఇదే నిజం.

Published : 
  • 9 May 2026, 5:50 PM IST