మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీని చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నట్టున్నాడు. నిజానికి ఈ సినిమా షూటింగ్ ఈనెల్లోనే పూర్తవాలి. పోస్ట్ ప్రొడక్షన్ కి 4 నెలల టైం తీసుకున్నా జూన్ లో మూవీ రిలీజ్ అవ్వాలి.. కాని షూటింగ్ మాత్రం దసరా వరకు కొనసాగేలా ఉంది. రెండు భాగాలుగా వస్తుందా? ఒకే భాగం లెంథీగా రాబోతోందా? ఈ ప్రశ్నలకు ప్రచారాలే తప్ప అఫీషియల్ గా ఎలాంటి కన్ ఫర్ మేషన్ రావట్లేదు. అసలే టీజరే ఎప్పుడో రావాలి.. దాన్నే వీళ్ళు వదలట్లేదు?. ఇంతకి ఏం జరుగుతోంది. రాజమౌళి కంటే కూడా ప్రశాంత్ నీల్, ఎన్టీఆరే వాళ్ల సినిమా విషయంలో చాలా సీక్రసీ మేయింటేన్ చేస్తున్నారు. ఒక్క మోషన్ పోస్టర్ తప్ప ఈ సినిమానుంచి ఇంతవరకు సింగిల్ అప్ డేట్ లేదు. తీరా చూస్తే ఇప్పుడు ఏకంగా 3 యాక్షన్ ఎపిసోడ్స్ కోసం జార్జియా వెళుతోంది ఫిల్మ్ టీం.. ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్ తాలూకు యాక్షన్ సీక్వెన్స్ కోసం ఒక్కో ఎపిసోడ్ కి పాతిక లక్షలు ఖర్చు చేస్తున్నారు.. ఇంతకి ఇది నిజంగా పాన్ వరల్డ్ మూవీనా? పాన్ ఆసియా సినిమానా? అసలీ సీక్రసీకీ రీజనేంటి?
వారనాసి మూవీ విషయంలో రాజమౌళి టీం ఎంత సీక్రసీ మేయింటేన్ చేస్తుందో అంతకు రెట్టింపు సీక్రసీ ని మేయింటేన్ చేస్తోంది డ్రాగన్ టీం. అసలు ఇంతవరకు ఈ సినిమా టైటిలే అది కాదన్నారు కాని, అసలు టైటిల్ ఏంటో చెప్పలేదు... రిలీజ్ డేట్ జూన్ నుంచి దసరాకు వాయిదా అన్నారు. కాని డేట్ తేల్చలేదు. షూటింగ్ సమ్మర్ లోగా అవ్వాలి..కాని అది దసరాలోపు అవుతుందంటున్నారు కాని, ఎగ్జాక్ట్ గా గుమ్మడికాయకొట్టేదెప్పుడో తేలట్లేదు. దీనికి మించి, ఇది రెండు భాగాలంటున్నారు. అందుకే కథలో మార్పులు జరిగాయని ప్రచారం చేశారు. ఈవిషయంలో కూడా ప్రశాంత్ నీల్ కాని, ఎన్టీఆర్ కాని ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు. ఎప్పుడో మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్ డే కి రిలీజ్ అవ్వాల్సిన టీజర్ ని ఆపేశారు.
కొత్త టీజర్ వస్తుందన్నారు.. కాని సంక్రాంతికి ఎలాంటి అప్ డేట్ లేదు.. కట్ చేస్తే జార్జియాలో ఈనెల మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ఫిక్స్ చేశారు. ఫిల్మ్ టీం 15 లొకేషన్స్ ని కన్ఫామ్ చేస్తే, టోటల్ కాస్ట్ అండ్ క్రూ జార్జియాకు బయలు దేరేందుకు రెడీ అయ్యింది. అక్కడే ఒకటి కాదు రెండు కాదు, మూడు భారీ పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ పూర్తి చేసేలా ఉన్నారు.నిజానికి ఆఫ్రికాలోనే చాలా పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని పూర్తి చేసింది డ్రాగన్ టీం. ఇప్పుడు ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్, ప్రీ క్లైమాక్స్ తో పాటు క్లైమాక్స్ సీక్వెన్స్ ని కూడా జార్జియాలోనే పూర్తి చేయాలనుకుంటున్నారు. ఒక్కో యాక్షన్ ఎపిసోడ్ కి ఇనీషియల్ గా ప్లాన్ చేసిన బడ్జెట్ 25 కోట్లు. అంటే మూడు ఫైట్ సీన్లకోసం డ్రాగన్ టీం 75 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు.
సినిమాలో టాకీ పార్ట్ వేగంగా పూర్తవుతుంది. లేటయ్యేదేమైనా ఉంటే, అది యాక్షన్ సీక్వెన్సే.. ఆలెక్కన ఆల్రెడీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పూర్తైంది... ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ , ప్రీ క్లైమాక్స్,క్లైమాక్స్ తాలూకుఫైట్ సీన్లు జార్జియాలోనే ఫిబ్రవరి, మార్చ్ లో పూర్తి చేస్తే, మేయిన్ కంటెంట్ పూర్తైనట్టే.. ఆలెక్కన సమ్మర్ లోగానే డ్రాగన్ షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టాలి.. కాని ఎందుకు దసరా లోపు షూటింగ్ పూర్తవుతుందంటున్నారు. సీక్వెల్ తాలూకు పనులు కూడా ఇప్పుడు 70శాతం పూర్తి చేస్తున్నారా? ఇందులో హీరో లుక్ తో పనున్న సీన్లన్నీ ముందుగానే తీసి, రెండో భాగం పనులు 70 శాతం పూర్తి చేయాలనుకుంటున్నారా? అన్నీ ఫీలర్స్ లేదంటే లీకులే తప్ప ఒక్కటంటే ఒక్క అప్ డేట్ లేదు. ఈ విషయంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి నిరాశ ఉన్నా, ఈ సీక్రసీ మాత్రం అందరిలో క్యూరియాసిటీ పెంచుతోంది.. ఇది పాన్ ఇండియామూవీనా, పాన్ ఆసియానా, పాన్ వరల్డా అనేది కూడా తేలాల్సి ఉంది.