పాన్ ఇండియా డెఫినేషనే మారాలి.. 1000 కోట్ల గోడ…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా డెఫినేషనే మార్చే పనిలో ఉన్నాడా... చేసిన జానర్ టచ్ చేయట్లేదు.. మార్కెట్ ని పట్టించుకోవట్లేదు.. నమ్మిందే చేస్తున్నాడు..

Post Published By: dialnews
Updated : 6 February 2026, 2:20 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పాన్ ఇండియా డెఫినేషనే మార్చే పనిలో ఉన్నాడా... చేసిన జానర్ టచ్ చేయట్లేదు.. మార్కెట్ ని పట్టించుకోవట్లేదు.. నమ్మిందే చేస్తున్నాడు.. నచ్చిందే చేస్తున్నాడు.. అలా ఒక్కో ఇటుక పేర్చి 1000 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మిస్తున్నాడా? ఆల్రెడీ త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గుర్తింపు దక్కింది. దేవరతో రాజమౌళి సాయం లేకుండానే 670 కోట్లు రాబట్టగలడని ప్రూవ్ అయ్యింది. ఐనా ఎన్టీఆర్ కి ఇంకేదో కావాలి.. టార్గెట్ మాస్ మాత్రమే కాదు.. నార్త్ ఇండియన్స్.. అలాని యూత్ ని వదిలే ప్రసక్తి లేదు.. కాని ఇన్ని లేయర్స్ లో ఆడియన్స్ ని త్రుప్తి పరచాలంటే మాస్ కి మైథాలజీ, దానికి స్టైలిష్ యాక్షన్ ఫ్లేవర్లు కావాల్సిందే.. అందుకే ఒకేసారి మూడు జోనర్స్ లో రిస్క్ చేస్తున్నాడు. తోటి హీరోలను మించాలంటే ఎన్టీఆర్ సినిమా మాత్రమే గొప్పగా ఉంటే సరిపోదు.. అంతకుమించి ఇంకేదో చేయాలి.. అదేంటి? తనలో కొత్త ఎన్టీఆర్ ని మళ్ళీ మళ్లీ కొత్తగా పరిచయం చేయటం తన వల్లవుతుందా? సైలెంట్ గా ఎన్టీఆర్ ఏ బాంబు పేల్చబోతున్నాడు?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేస్తున్న లిస్ట్ ఆఫ్ మూవీస్ చూస్తే, ప్రభాస్, చరణ్, బన్నీ కన్నా విభిన్నమైన ధారిలో నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పడు ఎన్టీఆర్ వరుసగా ప్రయోగాలు చేయట్లేదు.. తను కొత్తగా మార్కెట్ ని నిలబెట్టుకునేందుకు, ఇమేజ్ లెయర్స్ ని నిర్మిస్తున్నట్టున్నాడు. ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ గా త్రిబుల్ ఆర్ తో పేరొచ్చింది. దేవరతో నార్త్ ఇండియాలో కూడా మాస్ ఫాలోయింగ్ పెరిగింది.అలాంటప్పుడు కొత్తగా ఇమేజ్ కోసం ఎన్టీఆర్ ఏదో చేయాల్సిన పనిలేదు.. అలాని రిలాక్స్ అయితే, నార్త్ ఇండియాలో తన మార్కెట్ బలపడదు.. ఎంత పాన్ ఇండియా హిట్లొచ్చినా, ఇంతవరకు మలయాలం, తమిళ్ మార్కెట్ లో ఎన్టీఆర్, చరణ్, బన్నీకి పెద్దగా మార్కెట్ క్రియేట్ కాలేదు. వీళ్లు మూవీలు దేశవ్యాప్తంగా హిట్ అవ్వొచ్చు.. కాని రియలిస్టిక్ కిక్ ని కోరుకునే తమిళ, మలయాళ బ్యాచ్ కి మాత్రం మన పాన్ ఇండియా సినిమాలు ఎక్కలేదు.

ఒక్క బాహుబలికి మాత్రం ఎక్జెమ్షన్ దొరికింది... అందుకే ఎన్టీఆర్ తమిళ, మలయాల మార్కెట్లు శాసించేందుకే, నెల్సన్ దిలీప్ మూవీ చేయబోతున్నాడు. నార్త్ ఇండియా కోసం మైథాలజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. గాడ్ ఆఫ్ వార్ విషయంలో తనని మోసం చేసిన త్రివిక్రమ్ మేకింగ్ నచ్చకున్నా కండీషన్స్ తో కమిటయ్యాడు. ఇక దేవర సీక్వెల్ ని కూడా కమిటవ్వటం వెనక సేఫ్ గేమ్ ఉండొచ్చు.కాకపోతే, బాహుబలి ట్రాప్ లో ప్రభాస్ ఇరుక్కుని బయటికి రాటానికి పదేల్లు వేయిట్ చేసినట్టు... సలార్, కల్కీ లాంటి హిట్లు పడే వరకు ప్రభాస్ ఇబ్బంది పడినట్టు, త్రిబుల్ ఆర్ ఇమేజ్ వల్ల ఎన్టీఆర్ ఇబ్బంది పడకూడదని, ఆ ఇమేజ్ నుంచి బయట పడాలనుకుంటున్నాడు. ఎవరైనా పాన్ ఇండియా హిట్ పడి, ఆ మూవీతో ఇమేజ్ వస్తే పండగ చేసుకుంటారు.

కాని టెంపరరీ సంతోషాలకంటే, లాంగ్ రన్ లో మార్కెట్ ని కమాండ చేసేందుకు, ఇలా కొత్త ఇమేజ్ ని సరికొత్త లేయర్స్ తో నిర్మించుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఎన్టీఆర్. ఒక హిట్ ఇమేజ్ ని కంటిన్యూ చేయట్లేదు. చేసిన జోనర్ చేయట్లేదు. డ్రాగన్ తో మాఫియా డాన్ గా, గాడ్ ఆఫ్ వార్ తో మిథాలజీ, నెల్సన్ దిలీప్ తో డార్క్ కామెడీ యాక్షన్ డ్రామా ఇలా ఫ్లేవర్లు మారుస్తున్నాడు ఎన్టీఆర్.తోటి పాన్ ఇండియా స్టార్స్ లో ఎవరూ కూడా ఎన్టీఆర్ లా పాన్ ఇండియాలెవల్లో లాంగ్ రన్ కోసం ప్లాన్ చేయలేకపోతున్నారు. అందుకే మిగతా హీరోలతో పోలిస్తే, తన లుక్ ని మార్చుకుంటున్నాడు. తన వాయిస్ లో మాడ్యూలేషన్... దీనికి తోడు తనకు బలం అంటే పెర్ఫామెన్స్ కాబట్టి, దాన్నే ఎక్కువ నమ్ముకుని, బలమైన కథలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నాడు. అందుకే దేవర సీక్వెల్ ని కాస్త డిలే చేసి, ఈలోపు కదిలించే ప్రయోగాలకే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నట్టున్నాడు. డైరెక్టర్ల ఎంపికలో, పాన్ ఇండయా మార్కెట్ ని ఫాలో కాకుండా, ఎక్కుడ కంటెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. ఇవన్నీ చూసే తన స్ట్రాటజీ నచ్చే బన్నీ, అలానే తన టీం కూడా ఎన్టీఆర్ ని ఫాలో అప్ చేస్తోందని ప్రచారం పెరిగింది. తనమీద అల్లు అర్జున్ ఒక కన్నేశాడనే వార్తల వర్షం పెరుగుతోంది.

Published : 
  • 6 February 2026, 2:20 PM IST