మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీద వినిపించిన ఒకే ఒక్క రూమర్ అక్షరాల నిజమౌతోంది.. అదే డ్రాగన్ ఛేంజెస్.. ఔను మొదట్లో ఇదంతా యాంటీ ఫ్యాన్స్ పని అనుకున్నారు. కాని హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్ కొట్టే క్రమంలో వార్ 2 ఇచ్చిన షాక్, ఎన్టీఆర్ కి వేకప్ కాల్ లా మారినట్టుంది.. అందుకే డ్రాగన్ విషయంలో ఏడాదిన్నర టైం వేస్టైనా పర్లేదనుకున్నాడట. కథ కత్తిలా ఉండొచ్చు.. కాని ఒకటి మిస్సింగ్.. 40శాతం షూటింగ్ జరిగినా... అది బాగున్నా కూడా ఒకటి మిస్ అయ్యింది.. ఆ మిస్ అయిన ఒకటికోసమే ఇంత తతంగా.. అందుకే షూటింగ్ మొదలై ఏడాదిన్నరైనా సింగిల్ టీజర్ లేదు.. కనీసం గ్లింప్స్ రాలేదు.. కాని ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చేసిన మార్పు మంచికే అన్న నిర్మాత మాట, తూటాలా పేలుతోంది.. ఇంతకి ఏం మార్పు? ఎలాంటి మార్పు? దీంతో అంతిమ తీర్పు మారుతుందా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ రేంజ్ తో తొక్కుకుంటూ పోవాలి.. దేవర రేంజ్ లో ప్రత్యేక ఐడెంటిటీని కూడా క్రియేట్ చేసుకోవాలి.. ఈరెండు కూడా వర్కవుట్ అయ్యాయి.. అలాంటి టైంలో వార్ 2 తో హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్ వస్తుందనుకుంటే, అసలుకే మోసం జరగింది. దిక్కుమాలిన బాలీవుడ్ దర్శకులని నమ్ముకుంటే, బొక్కబోర్లా పడాల్సిందే...ఇది గతంలో తెలిసినా, ఎన్టీఆర్ దేశ ముదురే అయినా, కేవలం బాలీవుడ్ దిగ్గజం ఆదిత్య చోప్రా కోసం ఈ మూవీ చేశాడు. నిజంగా వార్ 2 ఎంత వరస్ట్ స్క్రిప్టో ఎంత వీక్ గా రాశారో తర్వాత ఆ ఫిల్మ్ టీం రివ్యూ చేసుకుని ఒప్పుకోవాల్సి వచ్చింది. ఆ ఎఫెక్టే డ్రాగన్ మీద పడినట్టుంది. అందుకే చాలా వరకు రూమర్లు ఈ విషయంలో నిజమౌతున్నాయి.
డ్రాగన్ స్క్రిప్ట్ ఏకంగా ఎనిమిది సార్లు మార్చారన్న చేదు వార్త ఇప్పుడు బయటికొచ్చింది. అలాని డ్రాగన్ కి ఏదో అవుతుందని కాదు, ఇది కూడా ఒకరకంగా మంచికే.. ఎలాగా ఎన్టీఆర్ కి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిందని, కొన్ని స్క్రిప్ట్స్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ గా చేసే ఛాన్స్ఉంది. అలా చేస్తే కుదరదని వార్ 2 తో తేలింది. అదో వేకప్ కాల్ గా మారింది..అందుకే ఎలాంటి ఛాన్స్ తీసుకోవద్దని, సలార్ వచ్చినప్పుడుజనాలనుంచి కొంత కన్ ఫ్యూజన్, ఇంకొంత షాక్ లాంటి రెస్పాన్స్ వచ్చింది. ఒకటి రెండు సీన్లు, హీరో పాత్ర తప్ప సలార్ లో కొన్ని లోపాలు కనిపించాయనే అన్నారు. ఏదో ప్రభాస్ ఇమేజ్ వల్ల అది 800 కోట్లు రాబట్టింది.. లేదంటే కొద్దిలో ఫ్లాప్ మిస్ అన్నారు. మరి అదే సినిమా తీసిన ప్రశాంత్ నీల్ ని ఎన్టీఆర్ లైట్ తీసుకుంటాడా...?
ఒకవైపు వార్ 2 టైంలోనే డ్రాగన్ మొదలైంది... కాని వార్ 2 ఇచ్చిన పంచ్ ఎఫెక్ట్ తో, మళ్లీ కథ, కథనాలు మార్చాల్సి వచ్చిందట. ఏడెనిమిది సార్లు కథలో మార్పులు జరగటమే కాదు, రెండు భాగాలుగా ఈ సినిమా తీయాలన్న నిర్ణయానికి టీం వచ్చి, కథని సాలిడ్ గా రెడీ చేసుకున్నాకే, అసలు షూటింగ్ రీస్టార్ట్ చేశారు. మళ్లీ హీరో పాత్రకి ఉండాల్సిన లుక్ లేకుండా, మరి ఎన్టీఆర్ బక్క పలుచగా మారటంతో, తీసిన షూటింగ్ ఫుటేజ్ ని లైట్ తీసుకున్నారట. ఎన్టీఆర్ మజిల్స్ పెంచి మరో లుక్ లోకి మారగానే, ఇప్పుడు మళ్లీ షూటింగ్ మొదలు పెట్టారు. చిన్న బ్రేక్ తీసుకున్నారు.. ఇది రూమర్స్ ని నిజం చేసినా కాని, డ్రాగన్ ని కాపాడేందుకు, సాలిడ్ గా మార్చేందుకు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయం... నిజంగా ఇలా కలగచేసుకోకపోతే డ్రాగన్ కూడా దారి తప్పే ఛాన్స్ఉందనే, ఎన్టీఆర్ చాలా పర్సనల్ కేర్ తీసుకునే, ప్రతీ విషయంలో క్వాలిటీ తగ్గకుండా జాగ్రత్తపడుతున్నాడు. లేదంటే 40శాతం షూటింగ్ అయిపోయాక, మళ్లీ మొదటి నుంచి షూటింగ్ అంటే, ఆ నిర్ణయం తీసుకోవటానికి చాలా ధైర్య కావాలి... లేదంటే ఇదంతా సాధ్యం కాని పని.