Countdown@”18Days”.. టీజర్ టెర్రర్…!

డ్రాగన్ గ్లింప్స్ లేదంటే టీజర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా 18 రోజుల గడువే ఉంది. ఎగ్జాక్ట్ గా మే 19 అర్ధరాత్రి డ్రాగన్ టీజర్ వచ్చే అవకాశం ఉందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్ డే

Post Published By: dialnews
Updated : 2 May 2026, 6:15 PM IST

డ్రాగన్ గ్లింప్స్ లేదంటే టీజర్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇంకా 18 రోజుల గడువే ఉంది. ఎగ్జాక్ట్ గా మే 19 అర్ధరాత్రి డ్రాగన్ టీజర్ వచ్చే అవకాశం ఉందని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా మ్యాన్ ఆఫ్ మాసెస్ బర్త్ డే గిఫ్ట్ గా ప్రోమో రాబోతోందని తేల్చాడు. సింగిల్ పోస్టర్ తో ఇది పాన్ వరల్డ్ మూవీ అన్న క్లారిటీ ఇచ్చాడు.. ఇంతకి టీజర్ రెడీ అయ్యిందా? దాని డ్యూరేషన్ ఎంతఉండబోతోంది? ఇది డైలాగ్స్ తో కూడిన ప్రోమోనా? ఈ వీకెండ్ లోగా ఏదో సాలిడ్ ఎనౌన్స్ మెంట్ ఇచ్చేయాలని ప్రశాంత్ నీల్ డిసైడ్ అయ్యిందా? ఈ డౌట్లన్నీంటికి ఫ్రైడే లోపు ఎండ్ కార్డ్ పడబోతోంది... ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కంబైండ్ గా స్టేట్ మెంట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకి అది రిలీజ్ డేట్ గురించా? ఇంకేమైనా సర్ ప్రైజ్ ఉందా?

డ్రాగన్ నిప్పుల వర్షానికి టైం అయ్యింది. మరో 18 రోజుల్లో డ్రాగన్ పూనకాలు మొదలుకాబోతున్నాయి. ఆల్రెడీ ప్రశాంత్ నీల్ కూడా మొన్నీమధ్యే పోస్టర్ రిలీజ్ చేశాడు. ప్రోమో కూడా బర్త్ డే స్పెషల్ గా వస్తుందన్నాడు. కాని ఆతర్వాత డ్రాగన్ టీం నుంచి ఆన్సర్ లేదు. రిలీజ్ చేసిన పోస్టర్ మీద 2027 జూన్ రిలీజ్ డేట్ తప్ప టైటిల్ పెట్టలేదు..సో ఇప్పుడు మే 19 అర్ధ రాత్రి రిలీజ్ చేయబోయే టీజర్ లేదంటే గ్లింప్స్ లో టైటిల్ ఉండటం ఖాయమైంది. కాని కన్పామ్ కాందేంటంటే, టీజర్ డ్యూరేషన్ ఎంత? డైలాగ్స్ ఉంటాయా ? లేదంటే మాంటేజ్ సాంగ్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తోనే సరిపెడటారా? ఏడాదిన్నరగా డ్రాగన్ ని చెక్కుతున్నాడు ప్రశాంత్ నీల్.. మరి ఇంతకాలం చెక్కిన ఈ కళా ఖండం ఎలా ఉంటుందో తేలాలంటే గ్లింప్స్ రావాలి.

ఐనా లాస్ట్ ఇయరే రావాల్సిన టీజర్, ఏడాది గ్యాప్ తర్వాత వస్తోందంటే, అంచనాలు ఆకాశాన్నంటుతాయి..గ్లింప్స్ ఏమాత్రం అటు ఇటుగా ఉన్నా, మ్యాన్ఆ ఫ్ మాసెస్ ఫ్యాన్స్ ఊరుకునే ఛాన్స్ లేదు. సోషల్ మీడియాను తగలబెట్టేస్తారు. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుని, ఫైనల్ కట్ ఎన్టీఆర్ ఓకే చేశాకే లాంచ్ చేయబోతున్నారు. ఏకంగా ఎనిమిది గ్లింప్స్ రెడీ చేసింది ఫిల్మ్ టీం.ఇందులో మాత్రంఎలాంటి అనుమానం లేదు, ఇండస్ట్రీలో వస్తున్న లీకులులతో తేలింది.. ఎనిమిది టీజర్స్ లో ఒకే ఒక్క టీజర్ ని ఎన్టీఆర్ ఫైనల్ చేయబోతున్నాడు. అందులో 5 డైలాగ్ టీజర్లు, 3 మాత్రం ఒక్క డైలాగ్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ , బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో ఉండే ప్రోమోలు... వీటిలో దేన్ని ఎన్టీఆర్ సెలక్ట్ చేస్తాడనే దాన్ని బట్టి, ఆ ప్రోమోకి డబ్బింగ్ చెప్పడం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు.ఐతే టీజర్ గా వచ్చినా, గ్లింప్స్ గా ప్లాన్ చేసినా ఏదైనా 90 సెకన్లకు తగ్గకూడదనేది ఎన్టీఆర్ కండీషన్ అని తెలుస్తోంది. 90 సెకన్లంటే నిముషమున్నర డ్యూరేషన్.. సో అంత సేపు వస్తే కనుక, అది ఖచ్చితంగా గ్లింప్స్ కాదు, టీజర్ గానే భావించాలి... సో ఈ టీజర్ ఏరేంజ్ లో ఉంటుందో కాని, మే 19 మిడ్ నైట్ మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్ లో పూనకాలు రావటం గ్యారెంటీ.

Published : 
  • 2 May 2026, 6:15 PM IST