హాలీవుడ్ లో నటించాలనే కోరిక మనోల్లకి ఉండటం కామన్... కాని ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లకే అక్కడ ఛాన్స్ లు చిక్కాయి.. కొందరు సపోర్టింగ్ రోల్స్ తో మేల్ ఆర్టిస్టులు కూడా హాలీవుడ్ జర్నీ చేశారు. ఇప్పుడు మన వాళ్ల వంతొచ్చిందా? అవేంజర్స్ లో ఇండియన్ హీరోకి ఛాన్స్ అని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, పాన్ ఇండియా బాద్ షా ఎన్టీఆర్ ఇద్దరిట్టో ఏజ్ పరంగా ఎన్టీఆర్ కే ఆ అవకాశం అని అప్పడెప్పుడో వార్తలొచ్చాయి.. ఇలా ఎన్టీఆర్ మీద ఇలాంటి వార్తలు రావటానికి రీజన్, త్రిబుల్ ఆర్ ఆస్కార్ ఎంట్రీ టైంలో, అవేంజర్స్ లో నటించాలని ఉన్నట్టు చెర్రీ, తారక్ ఇద్దరూ అన్నారు. కోరిక వ్యక్త పరిచారు.. అంతమాత్రానికే అవేంజర్స్ లో చాన్స్ దొరుకుతుందని కాదు.. అలాంటి వార్తలు వస్తాయని కాదు.. ఈ ఏడాది డిసెంబర్ లోరిలీజ్ అయ్యే అవేంజర్స్ డూమ్స్ డే కాకుండా, ఆతర్వాత తెరకెక్కే మూవీలో ఎన్టీఆర్ కి ఛాన్స్ఉంటుందా? కేవలం ఇది కలేనా?
హాలీవుడ్ మూవీ అవెంజర్స్ లో అమెరికన్స్, చైనీస్, ఆఖరికి ఆఫ్రికన్స్ కూడా ఉన్నారు. ఎవరైనా మిస్ అయ్యారంటే బ్రౌన్ ముఖం.. అంటే ఇండియన్ లుక్స్ ఉన్న సూపర్ హీరోనే అవేంజర్స్ లో కనిపించడు.. ఆలోటు తీర్చేందుకు అవేంజర్స్ టీం ఎప్పటి నుంచో కసరత్తు చేస్తోంది. ఆ ప్రాసెస్ లో భాగంగా ఒక ఇండియన్ కి అమెరికాలోనే సెలెక్ట్ చేయాలనుకున్నారు.కాని దానివల్ల బ్రౌన్ ఫేస్ కి రీచ్ పెరగొచ్చు..కాని పూనకాలొచ్చేంతగా ఇండియన్ మార్కెట్ లో అవేంజర్స్ దూకుడు పెరగదు.. ఆల్రెడీ అవేంజర్స్ సూపర్ హీరోల ఫ్రాంచైజీకి ఇండియాలో గిరాకీ బానే ఉన్నా, అది నెక్ట్స్ లెవల్ కి వెళ్లాలంటే, ఇక్కడి స్టార్స్ నే సూపర్ హీరోలుగా తీసుకోవాలి. ఆ లిస్ట్ లోనే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, పాన్ ఇండియా మాస్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఉన్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.
నిజానికి ఈ ఇద్దరు మంచి ఆప్షనే.. కాకపోతే బాలీవుడ్ కి షారుఖ్ ఎంత బాద్ షా అయినా తను సిక్స్ టీకి దగ్గరలో ఉన్నాడు. కాబట్టి ఎంత డూప్స్ ని పెట్టినా తను ఈ ఏజ్ లో సూపర్ హీరోల రిస్క్ లు చేయటం కష్టమే.. అలానే ఎక్కువ కాలం షూటింగ్ కి తను డేట్లిచ్చే పరిస్తితి ఉండదు.. అలానే తను ఎంత గొప్ప నటుడైనా, సౌత్ లో తనసినిమాకు పెద్దగా మార్కెట్ లేదు.. వచ్చే అవకాశం కూడా కనిపించట్లేదు.కాబట్టే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి అదే ఛాన్స్ చిక్కేలా ఉంది. మరి తనకే ఎందుకా ఆఫర్ అంటే, నిజానికి త్రిబుల్ ఆర్ కి ఆస్కార్ దక్కే టైంలో, ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ అవేంజర్స్ ఫ్యాన్స్ అని చెప్పారు. అందులో సూపర్ హీరో గా నటించటం తమ కలన్నారు. అప్పటి నుంచే హాలీవుడ్ ఏజెన్సీలతో టచ్ లో కెళ్లారు. అదే ఎన్టీఆర్ కి ఇప్పుడు కలిసొచ్చేలా ఉంది.
రెండు సార్లు ఇక్కడే హైద్రబాద్ లో ఎన్టీఆర్ ని 360 డిగ్రీస్ ఫోటోస్ తీసుకుని వెళ్లిన అవేంజర్స్ టీం, ఇప్పటి వరకు ఏది తేల్చలేదని తెలుస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ లో అవెంజర్స్ డూమ్స్ డే రాబోతోంది. అది రిలీజ్ అయ్యాకే అవేంజర్స్ కొత్త సీక్వెల్ కోసం ఎన్టీఆర్ ని తీసుకుంటున్నారా లేదా తేలుస్తారా? లేదంటే అవేంజర్స్ డూమ్స్ డే ని ఇక్కడ ప్రమోట్ చేసుందుకు ఎన్టీఆర్ ఉపయోగ పడతాడని,ముందే తన సూపర్ హీరో ఆఫర్ ని కన్ఫామ్ చేస్తారా? ఇవే తేలాలి... మోస్ట్ లీ ఆగస్ట్ లో ఈ విషయం మీద క్లారిటీ రావొచ్చు.