డ్రాగన్ గర్జిస్తే.. 10 రోజుల్లో 15 కోట్లు…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పర్ డే ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా... కేవలం పదిరోజుల్లో 15 కోట్లు... 50 కోట్ల వరకు ప్లాన్ చేస్తే అందులో 15 కోట్లే ఖర్చు చేశాడని తేలింది.

Post Published By: dialnews
Updated : 19 March 2026, 6:15 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పర్ డే ఎంత ఖర్చు పెట్టాడో తెలుసా... కేవలం పదిరోజుల్లో 15 కోట్లు... 50 కోట్ల వరకు ప్లాన్ చేస్తే అందులో 15 కోట్లే ఖర్చు చేశాడని తేలింది. అంటే రోజుకి ఆల్ మోస్ట్ కోటిన్నర ఖర్చైనట్టు.. అంతా తన కొత్త మూవీ డ్రాగన్ కోసమే... జోర్జాన్ షెడ్యూల్ కి మొత్తంగా అయిన ఖర్చు 15 కోట్లు.. అది కూడా పదిరోజుల్లో... అలా లెక్కేస్తేనే రోజుకి, కోటి యాభైలక్షలని తేలింది. పదిరోజుల్లో 15 కోట్లంటే చిన్న విషయం కాదు... అసలు జోర్డాన్ లో డ్రాగన్ టీం ఏం తెరకెక్కించింది.. ఎందుకు రోజుకి కోటిన్న ఖర్చు పెట్టింది. అంతగా ఏం తీశారు? ఇంకెందుకు 35 కోట్లు మిగిలింది? అసలేం తీయాలనుకున్నారు. నిర్మాత నవీన్ యేర్నేని మాటలు ఎందుకు ఇప్పుడు సోషల్ మీడియాను అంతగా కుదిపేస్తున్నాయి.

డ్రాగన్ మూవీ జోర్జాన్ ట్రిప్ నిజంగా షాక్ కి గురి చేస్తోంది. ఆమధ్య పవన్ ఒక్కరోజుకి 2 కోట్లు తీసుకుంటా అంటే షాక్ అయ్యారు. బ్రో మూవీలో గెస్ట్ రోల్ కి అలా ఖర్చయ్యిందంటారు. విచిత్రం ఏంటంటే కాల్ షీట్లతో సంబందం లేకుండా, కేవలం డ్రాగన్ మూవీ ఒక్కరోజు షూటింగ్ కి కోటిన్నర ఖర్చయ్యిందన్న మాట, టాలీవుడ్ ని షేక్ చేస్తోంది.కోటిన్నర పెద్ద ఎమౌంట్ కాకపోవచ్చు.. కాని ఒక రోజు సినిమా షూటింగ్ కి అంత ఎమౌంట్ అయ్యిందంటే మాత్రం ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.. ఎందుకంటే స్టార్ల రెమ్యునరేషన్లు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు కాకుండానే, కోటిన్నర పెట్టి ఏం ఖర్చు చేస్తారు.. ఎంత పెద్ద ఈవెంట్ చేసినా టెక్నీషియన్స్ రెమ్యునరేషన్ పక్కన పెడితే , అంత ఖర్చు కాదు.

అందుకే జోర్డాన్ లో డ్రాగన్ మూవీ టీం పదిరోజుల్లో 15 కోట్లు, అది కూడా కేవలం మేకింగ్ కే ఖర్చు పెట్టిందని ప్రొడ్యూసర్ బాంబ్ పేల్చాడు. హీరో, టెక్నీషియన్స్ ఇలా వీళ్ల రెమ్యూనరేషన్ ని కలిపితే ఆ ఎమౌంట్ మరింత పెరిగే ఛాన్స్ఉంది. కాని వాటన్నీంటిని తీసేసి, కేవలం అక్కడ రోజుకి కోటిన్న ఖర్చు పెట్టారనటమే ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

జోర్డాన్ లో హై ఇంటెన్స్ ఫైట్ సీన్లు తీసినట్టు తెలుస్తోంది. హాలీవుడ్ బ్యాచ్ కి కూడా దొరకిన కొన్ని ఎక్స్ క్లూజీవ్ లొకేషన్స్ కోసం అలానే, అక్కడ భారీ యాక్షన్ పార్ట్ ఫైట్ సీన్స్ కోసమే అంతగా ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ఎడారుల్లో ఛేజింగ్ సీన్స్ కోసం, భారీ ఎత్తున రియల్ ట్రక్స్ ని వాడరని తెలుస్తోంది. ఇంతవరకు ఎడారుల్లో అంతా కార్లు, జీబులతో షూట్ చేశారు.

హాలీవుడ్ మూవీల్లో కూడా ఎవరూ ఎడారుల్లో భారీ ట్రక్కులు వాడిందిలేదు. కాని జోర్డాన్ లో డ్రాగన్ టీం, భారీ ట్రక్కులతో షూట్ చేశాని తెలుస్తోంది. నిర్మాత నవీన్ యెర్నేని చెప్పిందాన్ని బట్టి చూస్తే గ్రాఫిక్స్ లేకుండానే రోజుకి కోటిన్నర ఖర్చు చేస్తే, ఆ సీన్స్ కి డీఐ, గ్రాఫక్స్ సపోర్ట్ కి ఇంకెన్ని కోట్లు ఖర్చవుతుంది.. నిజానికి 50 కోట్లు ఖర్చయ్యేంత భారీ సీన్లు ప్లాన్చేసినా, 10రోజులే షూటింగ్ చేయటంతో, 15 కోట్లే ఖర్చయ్యిందట. మిగతా 35 కోట్లతో పెండింగ్ యాక్షన్ సీక్వెన్స్ ని మరో షెడ్యూల్ లోప్లాన్ చేయబోతున్నారు.సో జోర్డాన్ లో రోజుకో రెండు మూడు ట్రక్కులను పేల్చేస్తే తప్ప ఇంత ఖర్చు అయ్యుండదు.. మరీ రియలిస్టిక్ గా తీయాలనే ప్లాన్ లో భాగంగా యాక్సన్ సీక్వెన్స్ ని కాస్ట్ లీ సీన్ గా మార్చేస్తోంది ఫిల్మ్ టీం.

Published : 
  • 19 March 2026, 6:15 PM IST