2వ ఆస్కార్… అదే జరిగితే భూకంపమే…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా 50శాతమే పూర్తైంది..కాని అప్పడే అరడజన్ ఆస్కార్లు బుక్కైనట్టే అన్న ప్రచారం, చర్చ విచిత్రంగా ఉంది. ఇది కాస్త అతిలా అనిపించినా, ఆశపడటంలో తప్పులేదనే కొందరి వాదన కూడా అంతకంటే విచిత్రంగా

Post Published By: dialnews
Updated : 18 March 2026, 9:00 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమా 50శాతమే పూర్తైంది..కాని అప్పడే అరడజన్ ఆస్కార్లు బుక్కైనట్టే అన్న ప్రచారం, చర్చ విచిత్రంగా ఉంది. ఇది కాస్త అతిలా అనిపించినా, ఆశపడటంలో తప్పులేదనే కొందరి వాదన కూడా అంతకంటే విచిత్రంగా ఉంది. కాకపోతే రాజమౌళి మాత్రం ఇండియన్ సినిమాకు, ఆస్కార్ రేంజ్ ఉందని ప్రూవ్ చేసిన దర్శకుడు. త్రిబుల్ ఆర్ తో ఒక లోకల్ మూవీకి గ్లోబల్ గా ఆస్కార్ దక్కింది. నాటు నాటు పాట ఇంగ్లీష్ సాంగ్ కాదు.. అయినా ఒక తెలుగు పాటకి ఆస్కార్ దక్కటం అంటే, ఎన్నో ఆస్కార్ అవార్డులతో సమానమన్నారు. అదే సాధ్యమైనప్పుడు, వారణాసితో మరో ఆస్కార్ అంచనా వేయటం ఎలా అత్యాశ అవతుంది.. దానికి తోడు, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, గ్రాఫిక్స్ కేటగిరీల్లో వారణాసి 2028 ఆస్కార్ నామినేషన్లలో ఉండి తీరుతుందనేంతగా, వర్క్ జరుగుతోందనంటున్నారు. అంతా బానే ఉంది. అంతా అనుకున్నట్టే జరిగి, మరోసారి రాజమౌళి మూవీకి ఆస్కార్ ఏదైనా కేటగిరీలో దక్కితే... తెలుగు సినిమా రేంజేమారిపోతుందా? బాలీవుడ్ ని టాలీవుడ్ పూర్తిగా తొక్కేసినట్టౌతుందా?

త్రిబుల్ ఆర్ మూవీ ఆస్కార్ రేసులో ఉంటుందని ఎవరైనా అనుకున్నారా? ఒక తెలుగు పాట నాటు నాటు కి గ్లోబల్ గా గుర్తింపే కాదు, బెస్ట్ సాంగ్ కేటగిరీలో కీరవాణికి, చంద్రభోస్ కి కంబైండ్ గా ఆస్కార్ దక్కుతుందని ఎవరైనా ఊహించారా? ఇప్పడు వారణాసి కి కూడా అలాంటి అవకాశం చాలా కేటగిరీల్లో దక్కేలా ఉందా? కేవలం 50శాతం షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకున్న వారణాసి లో ఏముంటుందో, ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం.కేవలం కాన్సెప్ట్ గ్లింప్స్ ని మాత్రమే ఫిల్మ్ టీం రిలీజ్ చేసింది. అలాంటప్పుడు, టీజర్, ట్రైలర్ కూడా రాకముందే రాజమౌళి పుణ్యామాని తన మరో మూవీ వారణాసికి కూడా ఆస్కార్ దక్కుతుందని ఇప్పుడు అంచనాలు పెరుగుతున్నాయి. కారణం రీసెంట్ గా ఆస్కార్ అవార్డుల సందడి జరగటం, దీనికి తోడు వారణాసిలో చాలా అంశాలు ఆస్కార్ స్టాండర్డ్స్ ని రీచ్ అయ్యేలా ఉండటం.

త్రిబుల్ ఆర్ కి హాలీవుడ్ నటులు, టెక్నీషియన్స్ ఫిదా అవటం వల్లే, అమెరికన్లు, యూరోపియన్లను కూడా ఆ సినిమా రీచ్ అయ్యింది. సో కొన్ని సినిమాలకు ఇలాంటివి కూడా ప్రమోషన్ లా పనిచేస్తాయి. కాబట్టే ఆస్కార్ రేసులో వారనాసి మూడు కేటగిరీల్లో పక్కగా ఉంటుందనే ప్రచారం, ఇప్పుడు వరల్డ్ వైడ్ గా వారాణాసి రీచ్ ని పెంచేస్తోంది.ఒక సారి ఊహించుకోండి, రాజమౌళి మూవీ కి మళ్లీ ఆస్కార్ దక్కితే సీన్ ఎలా ఉంటుందో.. పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసిన తను, పాన్ వరల్డ్ ట్రెండ్ ని సెట్ చేసే పనిలో ఉన్నాడు. ఆల్రెడీ త్రిబుల్ ఆర్ కి బెస్ట్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ దక్కింది. తర్వాత తీస్తున్న వారణాసికి కూడా ఏదో ఒక కేటగిరీలో ఆస్కార్ దక్కితే, మనిరత్నాలు, శంకర్ లే కాదు బాలీవుడ్ భన్సాలీలు ఇలా అంతా సైడ్ కి వెళ్లిపోయినట్టే.. ఇండియన్ సినిమా అంటే రాజమౌళి తప్ప మరొకరి పేరు వినిపించదు.

రెహమాన్ కి, లేదంటే భాను అథేయాకు కూడా గతంలో ఆస్కార్ రావొచ్చు.. కాని వాల్లకు హాలీవుడ్ మూవీల పుణ్యామాని ఆ అవకాశం దక్కింది. అదే ఒక ఇండియన్ సినమాను అది కూడా రీజినల్ సినిమా తో ఆస్కార్ సొంతం చేసుకోవటం చిన్న విషయమేం కాదు. బెస్ట్ సాంగ్ కేటగిరీలో కీరవాణి, చంద్రభోస్ కి ఆస్కార్ దక్కొచ్చు.. కాని ఎవరి వల్ల అంత రీచ్ వచ్చందంటే ఎవరైనా రాజమౌళి పేరే చెబుతారు.సో వారణాసికి ఫ్యూచర్ లో గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ డిజైన్, సాంగ్స్ విషయంలో నామినేషన్లు దక్కొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో కావాలని ఇలా అంటున్నారనుకున్నా, రాజమౌళి మేకింగ్ స్టాండర్డ్స్ ప్రకారం చూస్తే ఈ డిస్కర్షన్ వ్యాల్యూడ్ డిస్కర్షనే.

 

Published : 
  • 18 March 2026, 9:00 PM IST