మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సూపర్ హీరో అవటానికి ముందే.. సూపర్ హీరోగా సాహసాలు చేయాల్సి వస్తున్నట్టుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నడూ చూడనిది ఇప్పుడు జరిగేలా ఉంది. ఆల్రెడీ ఈ వార్త వైరలైంది. కేవలం ప్రచారం అనుకున్న మాటే ఇప్పుడు నిజమౌతోంది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 5 కిలో మీటర్ల ఎత్తునుంచి దూకబోతున్నాడు ఎన్టీఆర్. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ స్టార్ చేయని సాహసం మ్యాన్ ఆఫ్ మాసెస్ చేయబోతున్నాడు. నిజానికి ఇదంతా గ్రీన్ మ్యాట్ లో చేయొచ్చు.. స్టూడియోలోపని కానియ్యొచ్చు.. కాని హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ రూట్లో నిజాయితీగా రెండు రిస్క్ లు చేయబోతున్నాడు. అందులో ఒకటి 5 కిలో మీటర్ల ఎత్తునుంచి దూకటం. రెండోది ఏకంగా జీరో గ్రావిటీలో నటించటం.. అంటే కనీసం పావు గంట ఫైట్ సీన్ కోసం ఏకంగా పదిరోజులు ఒకసారి కాదు, రెండు సార్లు కాదు కనీసం 100 సార్లు ఆకాశంలో 5 కిలో మీటర్ల ఎత్తునుంచి దూకటం.. ఇంతకి ఎన్టీఆర్ ఎంతుకు హాలీవుడ్ స్టార్స్ లా లైఫ్ తో ఇంత రియలిస్టిక్ రిస్క్ లు చేస్తున్నాడు? గ్రాఫిక్స్ ఉన్నాక కూడా అంత అవసరమేమొచ్చింది?
జస్ట్ ఇమాజిన్, కిందపడుతున్న ఒక విమానం మీద విలన్ తో హీరో ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది.. ఇలాంటివి హాలీవుడ్ మూవీల్లోనే జరుగుతాయనే అనుకుంటాం..అక్కడ ఏది గ్రాఫిక్సో ఏది నిజమో తెలియనంతగా యాక్షన్ సీక్వెన్స్ తీస్తారు కాబట్టి. ఐతే ఇలా రోమాలు నిక్కబోడిచే ఫైట్ సీన్ కోసం ఎన్టీఆర్ లైఫే రిస్క్ చేస్తున్నాడు. ఏకంగా 5 కిలో మీటర్ల ఎత్తులో మైండ్ బ్లాంక్ అయ్యే ఫీట్ చేయబోతున్నాడు.నిజానికి హాలీవుడ్ మూవీ బ్యాట్ మ్యాన్ లో ఇలాంటి సీనే ఉంది. కాకపోతే విలన్ టీం నిజంగానే ఎగురుతున్న విమానాన్ని కిందపడేలా చేస్తూ, అది కిందపడుతుంటే, విమానం లోపల ఫైట్ చేస్తారు.. ఇదేదో గ్రాఫిక్స్ తో తీసిన సీన్ కాదు.. నిజంగా విమానం పడుతుంటే తీశారు.. రియల్ కిక్ కోసం, జనాల్లో ఈ మూవీ మీద అంచనాలు పెంచేందుకు ఫిల్మ్ టీం రిస్క్ తీసుకుంంది.
అచ్చంగా ఇలాంటి రిస్కే ఎన్టీఆర్ తీసుకుంటన్నాడు. మిషన్ ఇంపాజిబుల్ సినిమాకు ఏది సీక్వెల్ తెరకెక్కుతున్నా, అందులో ఇలాంటి ఒకటైనా రిస్కీ ఫైట్ సీన్ రియల్ గా చేస్తాడు టామ్ క్రూజ్. అలానే ఒకసారి విమానం తోకని పట్టుకుని, వేల అడుగులు పైకి ఎగిరే వరకు అలానే బయటే పట్టుకుని లైఫ్ రిస్క్ చేశాడు. ఎంతగా తనను చైన్ తో కట్టినా, ఏమాత్రం అటు ఇటైనా, పారా చూట్ లేకుండా వేల మీటర్ల ఎత్తునుంచి కిందపడటమే.అంటే ఛావు గ్యారెంటీ. ఇలానే దుబాయ్ లో బుర్జ్ ఖలీఫాని ఎలాంటి పారా చూట్ సాయంలేకుండా ఎక్కాడు. రిస్క్ చేశాడు. ఇలాంటివేదో చేస్తేనే వరల్డ్ ఆడియన్స్ ఈజీగా కనెక్ట్ అవుతారు. అందుకే కిందపడే విమానంలో ఫైట్ సీన్ ని డ్రాగన్ లో ప్లాన్ చేశారట. అంతేకాదు విమానం కిందపడుతుంటే, దాని లోపల జీరో గ్రావిటీ లాంటి సిచ్చువేషన్ వస్తుంది.
అంటే భూమి ఆకర్షన శక్తి ఉండదు.. మనం గాల్లో తేలినట్టు పరిస్థితులుంటాయి. 5 కిలోమీటర్ల ఎత్తునుంచి విమానం కిందపడుతుంటే, అందులో జీరో గ్రావిటీతో ఫైట్ సీన్ తీయబోతోంది ఫిల్మ్ టీం. ఇదే ఇంటర్వెల్ బ్యాంగ్ అని కూడా ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ 14 కిలోల వేయిట్ తగ్గే ఆరోగ్యంతో చలగాటమాడుతున్న ఎన్టీఆర్, ఇప్పుడు డ్రాగన్ ఇంటర్వెల్ కోసం కూలే విమానంలో భారీ ఫైట్ సీన్ తో లైఫ్ రిస్క్ చేస్తున్నాడు.