రెబల్ స్టార్ ప్రభాస్ ఎవరు? అసలా పేరు ఎన్నడూ వినలేదే.. తను డాన్సరా? అసలెవరతను? కన్నడ మూవీలు చేస్తాడా? మలయాళీనా ఇలాంటి వెటకారపు ప్రశ్నలు వేస్తే ఎలా ఉంటుంది.. కాని అచ్చంగా అదే జరిగింది. అసలు ప్రభాస్ ఎవరు అనే స్టేజ్ నుంచి నువ్వెవరు అన్న స్టేజ్ రావటానికి పదేళ్ల టైం పట్టింది. 11 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి నుంచే పాన్ ఇండియా కింగ్ గా మారాడు రెబల్ స్టార్ ప్రభాస్. ఐతే రెబల్ స్టార్ ఎవరూ, ప్రభాస్ పేరే ఎన్నడూ వినలేదన్న, బాలీవుడ్ స్టారే ఇప్పుడు తగ్గాడు. తగ్గి వస్తున్నాడు.. ప్రభాస్ పక్కన నేను నటించటమా? ఏమనుకుంటున్నారు? అని లెక్కలేనట్టు మాట్లాడిన స్టారే పది కాదు, వందమెట్లు దిగి వస్తున్నాడు..ఇంతకి ఎవరా స్టార్? ఎందుకు తగ్గాడు?
ఒక్కసారి ఊహించుకోండి.. ఎవరు ప్రభాస్.. ఆయన తో నేను సినిమాచేయటమా? ఏమనుకుంటున్నారు? ఆ పేరే ఎప్పుడు వినలే ఇలాంటి మాటలు ఎవరైనా అంటే, మామూలుగానే రెబల్ స్టార్ ఫ్యాన్స్ కి కోపం వస్తుంది.. తన ఫ్యాన్ కాకపోయినా, తెలుగు వాళ్లకే కాదు, హిందీ ఆడియన్స్ కికూడా కోపం వస్తుంది. అంతగా పాన్ ఇండియా కింగ్ గా మారాడు ప్రభాస్..బాహుబలి నుంచే తను అందరివాడైపోయాడు. వివాదాలు లేకపోవటం తో పాటు ఐదు పాన్ ఇండియా హిట్లు తన సొంతం అవటంతో, ఇక ఇండియానే కాదు, ఇంటర్నేషనల్ గా తనకి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఒకప్పుడు ప్రభాస్ ఎవరని హిందీలో కొందరు స్టార్స్ టంగ్ స్లిప్ అయ్యారు. మలయాళం నటులు కూడా కొందరు తెలియనట్టే నటించేశారు.
కాని ఇప్పుడు ప్రభాస్ అంటే పాన్ ఇండియా కింగ్.. ఐతే ఒక హిందీ స్టార్ ప్రభాస్ పక్కన ఇంపార్టెంట్ రోల్ మిమ్మల్ని అడిగారట అనగానే, ఎవరు ప్రభాస్.. చూడండి నేను హీరోని, ఎప్పుడూ సోలోగానే నటిస్తా..మల్టీస్టారర్ లు చేయను.. అంటూ కోపంగా అరిచినంత పని చేశాడు.. తనే జాన్ అబ్రహం.. ధూమ్ సీరీస్ ఒకరకంగా తనతోనే మొదలైంది. యాక్షన్ ప్రాజెక్ట్స్ కి తను కేరాఫ్ అడ్రస్ గా దూసుకెళ్లాడు..అంతా బానే ఉంది కాని, తనకి సాలిడ్ హిట్ల సంగతి అటుంచితే, యావరేజ్ హిట్లు లేవు. అసలు తన సినిమాలే రావట్లేదు.. ఆ స్థాయికి పడిపోయాడు.
బాహుబలి 2 తో పోటీ పడగలరా? సాహో వస్తోంది ఏంటి పరిస్తితి, కల్కీ తో పోటీ పడటం కష్టమేమోలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు జాన్ అబ్రహం ఇబ్బంది పడ్డాడు. తన సినిమాలు రిలీజ్ టైంలోనే ప్రభాస్ మూవీలు రావటం, మీడియా ఇలాంటి ప్రశ్నలు వేయటంతో, ఎక్కడ లేని అహం అడ్డొచ్చినట్టుంది.మల్టీస్టారర్లు చేయను, ఎవరు ప్రభాస్ అనేంత పనిచేశాడు. అలాంటి తను ఇప్పడు, కల్కీలో స్పెషల్ రోల్ వేయబోతున్నాడట. అది కూడా నెగెటీవ్ రోల్.. ఔను ప్రభాస్ తో మల్టీస్టారరేచేయనన్నోడు, ఇప్పుడు చాలా మెట్లు దిగొచ్చి, నెగెటీవ్ రోల్ వేసేందుకు రెడీ అయ్యాడట. కమల హాసన్ వేసే యాస్కిన్ పాత్రకు జాన్ అబ్రహం వేసేది అసిస్టెంట్ రోల్ అని తెలుస్తోంది.