మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా వచ్చేఏడాది దాడిచేయబోతున్నాడు. అయితే ఈ ఏడాది మాత్రం తనకి బాగా కలిసొస్తున్నట్టుంది. ఒకటి ఓటీటీ డీల్, రెండు వరల్డ్ వైడ్ గా ఈసినిమాను ప్రమోట్ చేస్తూ, డిస్ట్రిబ్యూట్ చేసేందుకు ముచ్చటగా మూడు ఇంటర్నేషనల్ సంస్థలు రంగంలోకి దిగటం. హాలీవుడ్ నుంచి డ్రీమ్ వర్క్స్, అలానే వాల్ట్ డిస్నీప్ తోపాటు చైనీస్ థియేటర్స్ చైన్ కూడా రంగంలోకి దిగింది. ఆల్రెడీ ఈ మూవీ ఓటీటీ రైట్స్ 450 కోట్ట నుంచి 700 కోట్లని మొన్నటి వరకు టాక్ వినిపించింది. కాని ప్రశాంత్ నీల్ టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. టీజర్ వచ్చాక, దీని స్టామినా ఏంటో జనానికి అర్ధమయ్యేలా చేసి, అప్పుడు ఓటీటీ డీల్ గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది ఫిల్మ్ టీం. అంతవరకు బానే ఉంది, కాని హాలీవుడ్ సంస్థలు రంగంలోకి దిగినంత మాత్రాన , ఎన్టీఆర్ పాన్ వరల్డ్ డ్రీమ్ తీరుతుందా? 700 కోట్ల పెట్టుబడి, 5 వేల కోట్ల రాబడిగా మారేంత స్ట్రామినా డ్రాగన్ కి నిజంగా ఉందా? 40 వేల థియేటర్స్ లో రిలీజ్ చేసేంత సాహసం నిజంగా డ్రాగన్ టీం చేస్తోందా?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కెరీర్ లో త్రిబుల్ ఆర్ తర్వాత డ్రాగన్ తోనే గ్లోబల్ గా ఎటాక్ చేయబోతున్నాడు. త్రిబుల్ ఆర్ పాన్ ఇండియా మూవీ గా వచ్చినా, నాటు నాటు పాట వల్ల గ్లోబల్ గా గుర్తింపు వచ్చింది. ఆఐడెంటిటీ డ్రాగన్ ప్రమోషన్ టైంలో ఉపయోగ పడే ఛాన్స్ఉంది. కాకపోతే పాన్ ఇండియా లెవల్లో దేవరతో మార్కెట్ లో పాతుకుపోయే ప్రయత్నం చేసిన వెంటనే, ఇలా పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేయటం శక్తికి మించిన సాహసమే.ఇక్కడ తను గెలిస్తే గెలిచేతి ఎన్టీఆర్ మాత్రమే కాదు.. ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ.. ముఖ్యంగా టాలీవుడ్ హాలీవుడ్ స్ట్రాండర్ట్స్ ని రీచ్ అవుతున్న టాలీవుడ్ అంటారు.. విదేశియులైదే, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడు్ అని చూడరు కాబట్టి, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్ట్రాండర్ట్స్ నెక్ట్స్ లెవల్ కి వెలుతున్నాయంటారు.. డ్రాగన్ ఒక్కటి హిట్టైతే, పాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేస్తే ఇలాంటి స్టేట్ మెంట్స్ రావు..
ఇలా వారణాసి, డ్రాగన్, కల్కీ 2, స్పిరిట్, రాకా, హిందీ రామాయణం ఇలా చాలా సినిమాలు వరల్డ్ మార్కెట్ లో దూసుకెళితేనే, మన స్టాండర్ట్స్ హాలీవుడ్ రేంజ్ ని రీచ్ అయ్యాయని ఒప్పుకుంటారు. అందులో డ్రాగన్ మూవీ చాలా ప్రత్యేకం; ఎందుకంటే ఆ టైటిల్ లోనే సీక్రెట్ ఉంది. చైనా, జపాన్, ఇలా పాన్ ఏసియా కంట్రీస్ లో డ్రాగన్ అంటే ఒక మిథలాజికల్ క్రీచర్..బలానికి చిహ్నం, యూరప్ లో కూడా డ్రాగన్ మీదున్న కథలు, నమ్మకాలు వేరు. ఐతే త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ స్టేజ్ మీద డ్రాగన్ తోనే ఎన్‌జిఆర్ గర్జన బలంగా వినిపించబోతోంది. కేవలం మైథలాజికల్ కథ తో కాకుండా, మాఫియా బ్యాక్ డ్రాప్ లోఇండో,చైనా, బూటాన్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కతోంది. అయితే కేవలం గ్రాఫిక్స్‌ని భారీ సెట్టింగ్స్ ని నమ్ముకోకుండా, అంతకుమించిన ఎఫెర్ట్స్ పెడుతోంది ఫిల్మ్ టీం.
బ్రూస్లీ లా కనిపించేందుకు 14 కేజీలు తగ్గిన ఎన్టీఆర్, ఐమ్యాక్స్ కెమెరాతో యాక్షన్ సీక్వెన్స్ లు షూట్ చేయటం, ఇక 22 భాషల్లో 40 వేల థియేటర్స్ లో ఈ సినిమాను రిలీజ్ చేయటం... ఇవన్నీ 700 కోట్ల బడ్జెట్ ని 5 వేల కోట్ల కలెక్షన్స్ గా మార్చే ఛాన్స్ఉంది. ఆల్రెడీ హాలీవుడ్ బ్యానర్లైన, వాల్ట్ డిస్నీప్, వార్నర్ బ్రదర్స్ డ్రాగన్ ని యూరప్, యూఎస్ లో డ్రిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాయి.ఇక చైనీస్ సంస్థ అక్కడ 15 వేలకు పైనే థియేటర్స్ లో డ్రానగ్ ని రిలీజ్ చేసేలా డీల్ ఆల్ మోస్ట్ క్లోజ్ చేసుకుందనంటున్నారు. పేపర్ వర్క్ కేవలం ఫార్మాలిటీనే.. ఐతేఓటీటీ డీల్ మాత్రం 450 కోట్ల నుంచి 700 కోట్ల వరకు వచ్చినా, 1000 కోట్లు ఎక్స్ పెక్ట్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇలా అయితే 300 కోట్లు టేబుల్ ప్రాఫిట్ ఓటీటీ దశలోనే వచ్చినట్టౌతుంది. థియేట్రికల్ బిజినెస్ మొత్తం బోనసౌతుంది. ఇక 40 వేల థియేటర్స్ లో 250 చొప్పున యావరేజ్ గా సీట్లు ఉన్నా, ఒక్క షో హౌజ్ ఫుల్ అయినా 50 నుంచి 100 కోట్లు షోకి దక్కుతాయి.. అంటే రోజుకి 100 నుంచి 200 కోట్లు రావొచ్చు..కాని ఇండియాలో తప్ప వరల్డ్ వైడ్ గాడ్రాగన్ రిలీజైన వెంటనే హౌజ్ ఫుల్ అవ్వాలని లేదు. టాక్ బాగుండాలి, కంటెంట్ అదరాలి.. అలా చూస్తే ఓవరాల్ గా ఈ సినిమా ఏమాత్రం బాగున్నా, 3000 కోట్ల నుంచి 5 వేల కోట్ల వసూళ్లు కష్టమేమి కాదు. డ్రాగన్ టీం కూడా అత్యాశకు పోకుండా, 3000 కోట్ల నుంచి 5 వేల కోట్లను గ్లోబల్ మార్కెట్ లో టార్గెట్ గా పెట్టుకుంది.. అందుకు తగ్గ అడుగులే వేస్తోంది.