మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మీడియాకు దూరంగా ఉండాల్సి వస్తోందా? తన సెట్లో తానే సెల్ ఫోన్ యూజ్ చేయలేని పరిస్తితి వచ్చిందా? ఈమధ్య ఏయిర్ పోర్టుల్లో అయినా కనిపించే ఎన్టీఆర్, ఆల్ ఆఫ్ సడన్ గా ఎవరి ముందుకు రావట్లేదు ఎందుకు? దీనికి డ్రాగన్ కి ఏమైనా లింకుందా? అంటే అదే కన్ఫామ్ అవుతోంది. ఔను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ భారీ సర్ ప్రైజ్ ప్లాన్ చేశాడు. తుఫాన్ కి ముందు ఉండే సైలెన్స్ లాంటి మార్కెటింగ్ స్ట్రాటజీనే ఫాలో అవుతున్నాడు. డ్రాగన్ టీం మేలో ఇచ్చే రెండు సర్ ప్రైజులు ఎలా ఉన్నా, ఇప్పుడు మాత్రం మూడు సర్ ప్రైజులకు టైం వచ్చింది. ఉగాదికి ఊగిపోయే అప్ డేట్ రాబోతోంది. ఎన్టీఆర్ బర్త్ డేకంటే ముందే ఫస్ట్ లుక్ పోస్టర్ కిక్ ఇవ్వబోతోంది. అదొచ్చే వరకు ఎన్టీఆర్ ఎవరికీ కనబడడా? డ్రాగన్ సెట్లో ఎవరూ కూడా సెల్ ఫోన్ వాడకూడదా? ఇంతకాలం ఇదే జాగ్రత్తలు పాటించిన టీం, ఇప్పుడు అంతకుమించి జాగ్రత్తుల పెంచింది... అంతా ఒక్క ఫస్ట్ లుక్ కోసమేనా? దానికి ఈ నిబంధనకున్న లింకేంటి?
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన డ్రాగన్ మూవీ సెట్లోకి తన సెల్ ఫోనే తీసుకువెళ్లే పరిస్థితి లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సహా అంతా సెల్ ఫోన్లు కూడా సెట్లోకి తీసుకువచ్చే పరిస్థితి లేదు. అసలు డ్రాగన్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి ఉన్నా, ఇప్పుడు అంతకు మించి స్ట్రీక్ ఇన్ స్ట్రక్షన్స్ టోటల్ టీం ఫాలో అవుతోంది.అంతటికీ కారణం డ్రాగన్ ఫస్ట్ లుక్ పోస్టరే.. ఇందులో అసలు టైటిల్, అలానే రిలీజ్ డేట్ ని మెన్షన్ చేయబోతున్నారు. అది కాకుండా ఎన్టీఆర్ ఇందులో డ్రాగన్ గా ఎలా కనిపిస్తాడో చూపించబోతున్నారు. ఇంతకాల తను సన్నబడటం, గెడ్డం పెంచటం, ఆలుక్ లో ఏయిర్ పోర్ట్ లో కనిపించటంతో, అదే ఫైనల్ లుక్ అనుకున్నారు. కాని అంతకుమించేలా తన లుక్ ఉండటం వల్లే, అది లీక్ అవకుండా జాగ్రత్త పడుతోంది ఫిల్మ్ టీం.
మొదటినుంచి ఎన్టీఆర్ లుక్ బయటికి లీక్ కాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్న డ్రాగన్ టీం, ఇప్పుడు మరింత జాగ్రత్తలు పెంచింది. కారణం ఈ సినిమాలో సర్ ప్రైజ్ అనుకున్న అసలు లుక్ తో ఇప్పుడు షూటింగ్ జరుగుతోంది. ఆ లుక్ తోనే ఫస్ట్ లుక్ పోస్టర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అది కూడా పోస్టర్ ని రిలీజ్ చేసే ముందే లీకైతే, ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేయటంలో అర్ధం లేదు.అందుకే ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చే వరకు ఎట్టిపరిస్థితుల్లో ఎన్టీఆర్ లుక్ రివీల్ కాకూడదు.. అందుకే సెట్లో సెల్ ఫోన్లే కాదు,మరే ఇతర సౌకర్యాలు లేకుండా చేస్తున్నారట.ఇంటర్నెట్టే లేకుండా ఫిల్మ్ టీం జాగ్రత్త పడుతోందట. అందులో భాగంగానే, దర్శకుడే కాదు,హీరో కూడా తన సెల్ ఫోన్ నిఫిల్మ్ సెట్లో అడుగు పెట్టే ముందే తన టీం దగ్గర డిపాజిట్ చేస్తున్నాడని తెలుస్తోంది.ఇంత జాగ్రత్తలు పాటిస్తూ తన లుక్ లీక్ కాకుండా చేస్తున్న టీం, ఈ ఉగాదికి డ్రాగన్ పోస్టర్ ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుంది. మే 20న ఎన్టీఆర్ బర్త్ డే కి మాత్రం ఇంతకుమించిన సర్ ప్రైజ్ ప్లాన్ చేయటం, వల్ల, ముందుగా ఉగాదికి స్పెషల్ గా ఈ పోస్టర్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.