మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గా పేల్చే మాట కంటే ముందు, రెండో దేవర పాటే పేలేలా ఉంది. ఔను ఎన్టీఆర్ బర్త్ డేకి పక్కగా డ్రాగన్ గ్లింప్స్ లేదంటే టీజర్ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ప్రచారం కాదు, అది ఆల్ మోస్ట్ నిజమే.. ఈసారి కూడా ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోతే ప్రశాంత్ నీల్ మీద ఫ్యాన్స్ ట్వీట్ల బాంబులు పేల్చే ఛాన్స్ఉంది. అది కాకుండా లాస్ట్ ఇయర్ లా ఈ ఏడాది టీజర్ ని వాయిదా వేసేందుకు మరో కారనం కూడా లేదు. అయితే ఇలాంటి టైంలో మరో గుడ్ న్యూస్ ఏంటంటే దేవర సీక్వెల్ విషయంలో కొరటాల శివ స్పీడ్.. ఈ సినిమా టీం తామింకా సీన్లోనే ఉన్నామని తేల్చేందుకు, రెండో దేవర పాటని పేల్చబోతున్నారు. ఇదే జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సూపర్ మాస్ పండగ వచ్చినట్టే. కాకపోతే ఎందుకు డ్రాగన్ టీజర్ కంటే కనీసం 20 రోజులు ముందు ఈ పాటని ప్లాన్ చేస్తున్నారు? ఈ ప్రశ్నకి మైండ్ బెండయ్యే సమాధానం వినిపిస్తోంది. కాకపోతే మరో ట్విస్ట్ ఏంటంటే 200 కోట్లు అప్పనంగా వస్తుంటే వద్దని, ఓవర్ సీస్ లో ప్రశాంత్ నీల్ డ్రాగన్ తో రిస్క్ చేస్తున్నాడు..? అంత నమ్మకమా? ఏకంగా 500 కోట్లు కొల్లగొట్టే అత్యాశా? ఏంటి రీజన్..?
డ్రాగన్ టీజర్ లేదంటే, గ్లింప్స్ మీద ఎలాంటి హింట్ కాని, అప్ డేట్ కాని అఫీషియల్ గా లేదు. కాకపోతే ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా మే 20 కి ఒకరోజు ముందు గ్లింప్స్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయనే ప్రచారం మాత్రం నిజం... ఇది కేవలం ప్రచారంగా మాత్రమే తీసుకోలేం... ఎందుకంటే ఈ ఏడాది కూడా ఎన్టీఆర్ బర్త్ డే కి డ్రాగన్ గ్లింప్స్ లేదంటే, టీజర్ ఏదో ఒకటి రావాల్సిందే.లేదంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకునే పరిస్థితి ఉండదు.. అంతవరకు బానే ఉంది. కాని అసలు ఈ టీజర్ సంగతి తేలకముందే, దేవర సీక్వెల్ పాట తూటాలా పేలే ఛాన్స్ కనిపిస్తోంది. ఔను దసరా ఫేం శ్రీకాంత్ ఓదేల తీస్తున్న ప్యారడైజ్ సాంగ్ పేలింది. దానికి అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ మతిపోగొడుతోంది. ఆ పాట వచ్చి రాగానే, దేవర 2 మీద డిస్కర్షన్ మొదలైంది.
కారణం దేవరకు కూడా మ్యూజిక్ ఇచ్చింది అనిరుధ్దే.. దేవర సీక్వెల్ కి కూడా మ్యూజిక్ కంపోజ్ చేయబోయేది కూడా అనిరుధ్ధే.. ఐతే ఇప్పుడు దేవర సీక్వెల్ తాలూకు పాటే ముందు తూటాలా పేల్చేందుకు ఏర్పాట్లు చేయటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి దేవర సీక్వెల్ మొదలౌతుందా, లేదా లాంటి ప్రశ్నలకు పర్మినెంట్ గా బ్రేక్ వేయాలంటే, దేవర 2 తాలూకు ఏదో ఒక అప్ డేట్ సాలిడ్ గా పడాలి...ఆల్రెడీ కథ సిద్దం గా ఉంది. డ్రాగన్ పూర్తయ్యాక దేవర 2 అని ఎన్టీఆర్ కూడా కొరటాల శివకి మాటిచ్చాడు. మధ్యలో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ వచ్చి, వివాదానికి వెల్ కమ్ చెప్పి,దేవర 2 ప్లాన్ మీద దెబ్బేసింది. అలాంటి పరిస్థితి మల్లీ రాకూడదంటే, దేవర 2 పాటని తూటాలా ముందే వదిలేయటం తెలివైన పనిగా భావిస్తున్నాడట కొరటాల శివ. ప్రాక్టికల్ గా చూసినా ఇది కరెక్టే.
నిజానికి డ్రాగన్ గ్లింప్స్ లేదంటే టీజర్ మే 19 లేదా 20న ఎన్టీఆర్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. కాని అప్పుడే అప్ డేట్ ఇచ్చి పోటీలోకొచ్చే బదులు, మే 1 కి రిలీజ్ చేస్తే బెటరనే నిర్ణయానికి కొరటాల శివ వచ్చాడట. ఎలాగూ పాట కూడా మేడే కార్మికుల కాన్సెప్ట్ తో ప్లాన్ చేసింది కాబట్టి, అప్పడే పాటని వదిలితే రెండు రకాలుగా కలిసొస్తుందనేది కొరటాల శివ ప్లాన్ అని తెలుస్తోంది.ఇక డ్రాగన్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ ఈ సినిమా ఓవర్ సీస్ రైట్స్ తనదగ్గరే ఉంచుకుంటున్నాడట. ఎవరికీ అమ్మకుండా, తనే ఈ రైట్స్ సొంతం చేసుకుని, సొంతంగా ఓవర్ సీస్ లో తన టీం ద్వారా ఈమూవీని అక్కడ రిలీజ్ చేయించాలనుకుంటున్నాడని తెలుస్తోంది. డ్రాగన్ యూఎస్, కెనెడా రైట్స్ 200 కోట్లు పలుకుతున్నా, వద్దని తానే సొంతంగా డ్రాగన్ ని రిలీజ్ చేసే రిస్క్ చేస్తున్నాడంటే, ఈ సినిమా కంటెంట్ మీద తనకెంత నమ్మకం ఉందో అర్ధమౌతోంది. కేజీయఫ్, సలార్ లనే ఇది మించే ప్రాజెక్టుగా ప్రమోట్ అవుతోంది.