ఇజ్జత్ కా సవాల్.. నిప్పులుకక్కుతూ ఎగిరేది…!

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా డ్రాగన్. అఫీషియల్ టైటిల్ ఫిక్స్ కాకున్నా, ప్రస్థుతానికి ఈ వర్కింగ్ టైటిల్ తోనే ఎన్టీ ఆర్ ప్రాజెక్ట్ మీద ప్రచారం గట్టిగా జరుగుతోంది.

Post Published By: dialnews
Updated : 28 February 2026, 8:30 PM IST

ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తీస్తున్న సినిమా డ్రాగన్. అఫీషియల్ టైటిల్ ఫిక్స్ కాకున్నా, ప్రస్థుతానికి ఈ వర్కింగ్ టైటిల్ తోనే ఎన్టీ ఆర్ ప్రాజెక్ట్ మీద ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఐతే ఎన్టీఆర్ కెరీర్ లోనే డ్రాగన్ మూవీ ఇజ్జత్ కా సవాల్ గా మారిందంటే నమ్ముతారా? త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గా ఎన్టీఆర్ పేరు మారుమోగింది. చరన్ తో కలిసి నాటు నాటు పాటతో తూటాలా దూసుకెళ్లి తారక్ తర్వాత దేవరగా మారాడు. రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ చేశాడు. అసలు దేవర వస్తుంటే, అది ఎన్టీఆర్ ఇమేజ్ కి ఇజ్జత్ కా సవాల్ అనాలి.. అలాంటి టైంలోనే బ్లాక్ బస్టర్ పడింది... అలాంటప్పుడు డ్రాగన్ ఎందుకు ఎన్టీఆర్ కి ఇప్పుడు డూ ఆర్ డై సిచ్చువేషన్ గా మారింది...? అక్కడే తన తలరాత మారే ట్విస్ట్ ఉంది... ఎన్టీఆర్ కి పాన్ ఇండియా లెవల్లో మాస్ మార్కెట్ ఎంతైనా పెరగొచ్చు.. కాని ఇకమీదటే తను ఎదగాలన్నా, సైడ్ కి వెల్లిపోవాలన్నా అంతా డ్రాగన్ రిజల్ట్ మీదే ఆధారపడి ఉంది. ఒక వైపు హాలీవుడ్ లో సూపర్ హీరో ఛాన్స్,మరో వైపు రాజమౌళి నెక్ట్స్ ప్రాజెక్ట్ రెండూ తనకి దక్కుతాయనే ప్రచారం మాత్రం బలంగా వినిపిస్తోంది. కాని ఏది అఫీషియల్ గా కన్ఫామ్ కాలేదు... సో బ్రైట్ ఫ్యూచర్ కంటికి కనిపిస్తుంటే కూడా ఎన్టీఆర్ ఎందుకు కంగారు పడాలి.?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. మాస్ స్టార్ గా మొన్నటి వరకు యంగ్ టైగర్, త్రిబుల్ ఆర్ తర్వాత మ్యాన్ ఆఫ్ మాసెస్ గా మారిపోయాడు. దేవరతో నార్త్ ఇండియాని కూడా షేక్ చేశాడు.
అక్కడ కూడా మాస్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. వార్ 2 మూవీ అంతగా ఆడకున్నా, తన వల్లే కనీసం 300కోట్ల వరకు వసూళ్లు వచ్చాయనేంతగా హ్రితిక్ నే ఓవర్ షాడో చేశాడన్నారు

మల్టీ స్టారర్ మూవీ వార్ 2 ఫ్లాపైనా, ఆమాత్రం ఆడటానికి ఎన్టీఆర్ మాస్ ఇమేజే కారణమనే మాట వచ్చిందంటే, హిట్లతోనే కాదు, ఫెల్యూర్స్ తో కూడా ఒక మూవీకి మాస్ ఇమేజ్ ఎంత ముఖ్యమో, నార్త్ మార్కెట్ లో ఎన్టీఆర్ కి పెరిగిన ఇమేజ్ ఏంటో క్లారిటీ వచ్చినట్టైంది. ఇదోరకంగా చెడులో మంచే.. సో ఎలా చూసినా, ప్రబాస్, చరణ్ కంటే కూడా పాన్ ఇండియా లెవల్లో ఎన్టీఆర్ స్ట్రాటజీ బానే ఉంది.ఫేట్ కూడా బానే కలిసొస్తోంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ లో డ్రాగన్ రెండు భాగాలతో దండెత్తబోతున్నాడు. దేవర కు సీక్వెల్ ఎలాగూ ప్లానింగ్ లోఉంది కాబట్టి, అక్కడ కూడా తనకి సేఫ్ జోనే.. కాని డ్రాగన్ మూవీ పోతే ఇక ఫ్యూచరే లేనట్టు, ఎన్టీఆర్ కెరీరే ఆగిపోయినట్టు ఇజ్జత్ కా సవాల్ అన్న మాటెందుకొస్తోంది..? ఇదే ప్రశ్న ఎన్టీఆర్ వేసుకున్నట్టున్నాడు.. అందుకే ఇప్పుడు డ్రాగన్ విషయంలో తనది డూ ఆర్ డౌ సిచ్చేవేషన్ అంటున్నారు

దానికి ఓ సాలిడ్ కారణం ఉంది. బేసిగ్గా ఎదిగే టైంలో మొక్క విరిగినా, చెట్టు సైడ్ కి వొరిగినా, దాని ఎదుగుదలకి అర్ధం లేనట్టే.. తెలుగు జనాలకి ఈజీగా కనెక్ట్ అవ్వాలంటే, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ లైఫే బెస్ట్ ఎగ్జాంపుల్.పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం ఇలా ఒకటి తర్వాత ఒకటి హిట్టవటం, అర్జున్ రెడ్డి పాత్రతో భారీగా ఇమేజ్ రావటం.. కట్ చేస్తే లైగర్ తర్వాతతన అడ్రసే లేదు.ఎదగాల్సినటైంలో ఘోరమైన ఫ్లాపులు పడ్డాయి.. సో తనకి ఎన్టీఆర్ కి పోలికా అంటే, కానేకాదు. కాకపోతే డ్రాగన్ మూవీ విషయంలో డైరెక్టర్ ప్రశాంత్ నీలే ఎన్టీఆర్ కి ప్లస్ అవ్వాలి. కాని అంతా ఎన్టీఆర్ మీదే బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఫ్యాన్స్ తోపాటు కామన్ ఆడియన్స్ ఏమనుకున్నా,ఇండస్ట్రీలో లెక్కలు వేరేలా ఉంటాయి. వాటి ప్రకారం సలార్ సోసోగా ఆడటం వల్ల, ప్రశాంత్ నీల్ మీద మార్కెట్ లో గట్టి నమ్మకం కనిపించట్లేదు. కాబట్టే డ్రాగన్ బారమంతా ఎన్టీఆర్ మీదే పడుతోంది.

ఆల్రెడీ వార్ 2 విషయంలో నిర్మాతను నమ్మి నార్త్ లో ఎదిగే టైంలో ఫెల్యూర్ ఫేస్ చేసి మోసపోయాడు ఎన్టీఆర్. ఇలాంటి టైంలో హిట్ పడకపోతే, పెరిగిన తన నార్త్ మార్కెట్ కుప్పకూలే ఛాన్స్ ఉంది. కాస్త పెరిగినప్పుడే మరింత మార్కెట్ ని, మాస్ ఇమేజ్ ని నార్త్ లో పెంచుకుంటే, తర్వాత తను చేసే ప్రతీ ప్రయోగం రీచే ఓరేంజ్ లో పెరిగిపోతుంది. ఈ మాత్రం దానికే డ్రాగన్ డూ ఆర్ డై సిచ్చువేషన్ అనుకోవాలా? అంటే తప్పదు.. కొన్ని సార్లు ఎదగాల్సిన స్థాయికి ఎదక్క పోతే, అది ఫెల్యూర్ కంటే డేంజరస్ సిచ్చువేషనే.. కేవలం ఒకటి రెండు పాన్ ఇండియాహిట్లతో ఎన్టీఆర్ జర్నీ ఆగకూడదంటే, లాంగ్ రన్ తో తను దూసుకెళ్లాలంటే, డ్రాగన్ నిప్పుల వర్షంతోపాటు వసూళ్ల వర్షం కురిపిస్తేనే లెక్క సరిపోతుంది.

Published : 
  • 28 February 2026, 8:30 PM IST