మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ రిలీజ్ డేట్ నాలుగో సారి కూడా మారేలా ఉందా? ఈ విషయంలో క్లారిటీ వచ్చేలోపే కొరటాల శివ దేవర 2 ట్వీట్ తో ఫ్యాన్స్ లో జోష్ పెంచే ప్రయత్నం చేశాడు. కట్ చేస్తే ఊహించని షాకింగ్ వార్త వైరలౌతోంది. అదే డ్రాగన్ కంటే దేవర సీక్వెలే ముందొస్తే ఎలా? ఈ ప్రశ్న ఏదో గాల్లో గుసగుసల్లా కాదు... సీరియస్ గా నే ఇండస్ట్రీలో చర్చకొచ్చింది. ఎన్టీఆరే పిలిచి దేవర 2 చేయమన్నట్టు ఆమధ్య వార్తలొచ్చాయి. అయినా కూడా దేవర 2 మొదలయ్యే దెన్నడు? ఆలెక్కన అదెలా డ్రాగన్ కంటే ముందే రిలీజ్ అవుతుంది? ఈ రెండు ప్రశ్నలకు మైంబ్ బెండయ్యే సమాధానం కొరటాల శివ రెడీ చేస్తున్నాడు. నిజంగానే డ్రాగన్ కంటే ముందు దేవర సీక్వెలే రాబోతోంది. 35 శాతం దేవర 2 షూటింగ్ ని మొదటి భాగం తీసేప్పుడే షూట్ చేశారని తెలుస్తోంది. అయినా కూడా దేవరు 2 మూవీ డ్రాగన్ కంటే ముందు రిలీజ్ అవటం అసాధ్యమే.. కాని దాన్నే సాధ్యం చేయబోతున్నారు.. ఎందుకు? ఈ పెను మార్పు వెనక ఎన్టీఆర్ స్పెషల్ స్కెచ్ ఉందా? పుకార్లని ఇది నిజం చేసేలా ఉందా?
ఒక్క సారి ఊహించుకోండి... నిన్న మొన్నటి వరకు అసలు ఊసేలేని దేవర సీక్వెల్, సడన్ గా సీన్ లోకి వస్తే ఎలా ఉంటుంది.. అది కూడా డ్రాగన్ ని వెనక్కి నెట్టి, అదే ముందు రిలీజ్ అయితే ఇంకెలా ఉంటుంది.. అసలిదేది సాధ్యం అనిపించేలా కనిపించట్లేదు కాద... కాని సీన్ చూస్తుంటే అదే జరిగేలా ఉంది. తెరవెనక ఎన్టీఆర్ నిర్ణయాలు, నిజంగా ఊహాతీతంగా మారుతున్నాయి.ఔను దేవర సీక్వెల్ మీద సడన్ గా కొరటాల శివ ఫియర్ పవర్ రివేంజ్ అంటూ ఇచ్చిన ట్వీట్ ఏదో ప్రమోషన్ లో భాగంగా పోస్ట్ చేశాడనున్నారు. కాని ఇది మాత్రం ఊహాతీతమైన నిర్ణయం అని తెలుస్తోంది. ఎన్టీఆర్ పిలిచి దేవర సీక్వెల్ ప్లాన్ చేయమని చెప్పాడని, ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. దేవర 2 ఆగిందని, తర్వాత ఉందని ఉన్నా కాని త్రివిక్రమ్ మూవీ తర్వాతే అని ఇలా చాలా రకాల ప్రచారాలు జరిగాయి.
కట్ చేస్తే మొత్తం ఎన్టీఆర్ కమిటైన సినిమాలన్నీంట్లో, నెక్ట్స్ రిలీజ్ అయ్యేదే దేవర2 .. ఇది ఫైనల్.. అసలు షూటింగే మొదలు కాలేదు. ఎప్పుడు మొదలౌతుందో తేలలేదు.. అలాంది 40శాతం డ్రాగన్ మూవీ షూటింగ్ పూర్తయ్యక కూడా దానికంటే ముందే దేవర2 రిలీజ అంటే ప్రాక్టికల్ గా అసాద్యం. కాని అక్కడే ఎన్టీఆర్ నిర్ణయం అందరికి షాక్ ఇచ్చేల ఉంది.డ్రాగన్ మూవీ మొదలై ఆల్ మోస్ట్ ఏదాడిన్నరౌతోంది. మరో ఏడాదిన్నర అంటే 2027 సమ్మర్ ఎండ్ వరకు ఇది తెరకెక్కతూనే ఉంటుందట. రెండు భాగాలుగా ప్లాన్ చేయటం వల్ల ఇలా అవుతుందా? లేదంటే ఇంకేదైనా కారణాలున్నాయా? అన్నది తేలాలి.ఐతే పోస్ట్ ప్రొడక్షన్ మరింత లేట్ అయ్యే ఛాన్స్ఉండటంతో, పాన్ ఆసియా, పాన్ వరల్డ్ లెవల్లో మూవీని ప్రమోట్ చేయటానికి కూడా టైం సరిపోదని, మరింత టైం తీసుకుని ముందుకెళ్లాలని డ్రాగన్ టీం డిసైడ్ అయ్యిందట.అందుకే ఎంత ఎన్టీఆర్ బర్త్ ఉన్నా కాని,టైటిల్ పోస్టర్ తప్ప మే 20న ఇంకేలాంటి అప్ డేట్స్ ఉండే ఛాన్స్ లేదట. ఐతే కాస్త మజిల్ పెంచేపనిలో ఉన్నాడు కాబట్టి, ఎన్టీఆర్ మరో నెలలో దేవర 2 లుక్ కి సరిపోయేలా రెడీ అవ్వొచ్చు.. సో మొదటి భాగం తీసినప్పుడే 30నుంచి 35 శాతం వరకు సీక్వెల్ షూటంగ్ జరిగింది. మిగతా 65 శాతం షూటింగ్ 5 నెలల్లో ముగించేలా కొరటాల షెడ్యూల్ ప్లాన్ చేశాడట. కేవలం మూడు షెడ్యూల్స్ లో టోటల్ దేవర 2 పూర్తవుతుందట.