దొరల రాజ్యాన్ని దున్ని పడేస్తా..!

తెలుగు సినీ ప్రియులకు 'దసరా' సినిమా అందించిన అనుభూతి అంత త్వరగా మర్చిపోయేది కాదు. మాస్, రా అండ్ రస్టిక్ కథలతో థియేటర్లలో ఈలలు వేయించిన 'న్యాచురల్ స్టార్' నాని, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల

Post Published By: dialnews
Updated : 8 August 2026, 8:55 AM IST

తెలుగు సినీ ప్రియులకు 'దసరా' సినిమా అందించిన అనుభూతి అంత త్వరగా మర్చిపోయేది కాదు. మాస్, రా అండ్ రస్టిక్ కథలతో థియేటర్లలో ఈలలు వేయించిన 'న్యాచురల్ స్టార్' నాని, యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెల కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. వీరిద్దరి కలయికలో రాబోతున్న లేటెస్ట్ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'ది ప్యారడైజ్'.తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమాలో నాని 'జడల్' అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. మునుపెన్నడూ లేని విధంగా ఒక పూర్తిస్థాయి ఊరమాస్, రగ్గడ్ లుక్‌లో నాని మేకోవర్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంది.

'దిష్టింతా పోవాలే..' అంటూ టీజర్‌లో వచ్చే సంభాషణలు, రక్తపాతం మరియు నాని వాయిస్ ఓవర్ టీజర్‌ను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయి. అణచివేతపై తిరగబడే ఒక నాయకుడి పాత్రలో నాని నటన థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌గా 'కయాదు లోహార్' నటిస్తోంది. కలెక్షన్ కింగ్' మోహన్ బాబు ఈ సినిమాలో ఒక డిఫరెంట్, ఇంపాక్ట్‌ఫుల్ విలన్ క్యారెక్టర్‌లో కనిపిస్తుండగా, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్ మరో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నానితో ఢీకొట్టబోతున్నారు. వీరి కాంబినేషన్ లో వచ్చే సీన్లు కథకి ఆయువుపట్టుగా నిలవనున్నాయి.

సినిమాకి సంగీతం అందిస్తున్నది రాక్‌స్టార్ 'అనిరుధ్ రవిచందర్'. టీజర్‌లో అనిరుధ్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్‌ను ఎలివేట్ చేసింది. శ్రీకాంత్ ఒదెల టేకింగ్, విజువల్ డిజైనింగ్ మరియు షాట్ కంపోజిషన్ సినిమాను ఏ స్థాయిలో తీర్చిదిద్దారో స్పష్టంగా చూపిస్తున్నాయి.
ఇప్పటికే షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
'దసరా'ని మించిన పవర్‌ఫుల్ యాక్షన్ ఎక్స్‌పీరియన్స్ కోసం నాని అభిమానులు, సాధారణ సినీ ప్రేమికులు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Published : 
  • 8 August 2026, 8:55 AM IST