పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ బాక్సాఫీస్ వద్ద తన ప్రభంజనాన్ని మొదలుపెట్టేశాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా నుంచి వచ్చిన సెకండ్ సింగిల్ 'Aura of Ustaad' ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డుల దుమ్ము దులుపుతోంది. 'గబ్బర్ సింగ్' కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుండటంతో ఉస్తాద్ మీద అంచనాలు ఆకాశాన్ని దాటుతున్నాయి. ఈ పాటలో పవన్ కళ్యాణ్ 'మాస్ ఎలివేషన్' నెక్స్ట్ లెవల్ లో ఉంది. లిరిక్స్ వింటుంటే పవన్ కళ్యాణ్ నిజ జీవిత వ్యక్తిత్వానికి, ఆయన పొలిటికల్ అండ్ సినిమాటిక్ ఇమేజ్ కి దగ్గరగా ఉన్నాయి. ఈ సాంగ్ విడుదలైన మొదటి 24 గంటల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి, టాలీవుడ్ టాప్ వ్యూస్ లిస్ట్ లో చేరింది.
యూట్యూబ్ మ్యూజిక్ ట్రెండింగ్ లో గ్లోబల్ వైడ్ గా 13వ స్థానంలో, ఇండియాలో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అయ్యింది. అతి తక్కువ సమయంలో లక్షకు పైగా లైక్స్ సాధించిన సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. మొదటి సాంగ్ 'దేఖ్ లేంగే సాలా' 29.5 మిలియన్ వ్యూస్ రికార్డును ఇది దాటేలా కనిపిస్తోంది. "నేను మెడ ముట్టుకుంటే.. తొడ కొట్టినట్టే!" అనే డైలాగ్ ఈ పాటకి మెయిన్ హైలైట్ గా వినబడుతూ, పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్స్ తో విజిల్స్ వేయించడానికి ముస్తాబవుతోంది.
ఆస్కార్ విజేత చంద్రబోస్ అందించిన సాహిత్యం పవన్ కళ్యాణ్ రియల్ లైఫ్ ఇమేజ్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ కావడంతో, వరల్డ్ వైడ్ గా ఉన్న పవర్ స్టార్ అభిమానులకు కూడా ఇది మరింత చేరువైంది. మల్లా రెడ్డి విశ్వవిద్యాలయంలో వేలాది మంది విద్యార్థులు మరియు అభిమానుల మధ్య జరిగిన ఈ ఈవెంట్‌లో దర్శకుడు హరీష్ శంకర్ చేసిన స్పీచ్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించింది. సినిమా కచ్చితంగా మార్చి 26న థియేటర్లలో బాక్సాఫీస్ వద్ద అరాచకం సృష్టిస్తుందని ధీమా వ్యక్తం చేయడంతో, పవన్ ఫ్యాన్స్ కూడా తమ అభిమానాన్ని చాటుకోవడానికి సిద్ధమవుతున్నారు.