పవర్ స్టార్ ఫ్యాన్స్! 'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ కాంబో అంటే అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ అంచనాలను డబుల్ చేస్తూ, మన ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి సెకండ్ సింగిల్ 'Aura of Ustaad' ప్రోమో వచ్చేసింది. "ప్రోమో చూస్తుంటేనే, హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్‌ను ఏ రేంజ్లో చూపిస్తున్నారో అర్ధమైపోతుంది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గెటప్‌లో పవన్ కళ్యాణ్ స్వాగ్ మామూలుగా లేదు. ముఖ్యంగా ఆ నడక, కళ్ళలో ఉన్న తీక్షణత ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించేలా ఉన్నాయి.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన మార్క్ మాస్ బీట్తో అదరగొట్టారు. 'గబ్బర్ సింగ్' మ్యాజిక్ మళ్ళీ రిపీట్ అవ్వబోతుందని మ్యూజిక్ వింటేనే క్లియర్ గా తెలుస్తోంది. ఈ పాట గురించి డైరెక్టర్ హరీష్ శంకర్ సోషల్ మీడియాలో చేసిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సాధారణంగా నేను ఇలా చేయను, కానీ ఈ పాట విన్నాక నా గుండె వేగం పెరిగింది' అని హరీష్ శంకర్ చెప్పడం చూస్తుంటే, ఇది కేవలం పాట మాత్రమే కాదు, ఒక పవర్ఫుల్ ఆంథమ్ అని తెలుస్తోంది." ఈ పాటను ఆస్కార్ విజేత చంద్రబోస్ గారు రాశారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి, ఆయన 'ఆరా'కు అద్దం పట్టేలా ఈ లిరిక్స్ ఉండబోతున్నాయి. పూర్తి పాటను ఫిబ్రవరి 22, 2026న రిలీజ్ చేయబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 26, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. పవన్ సరసన శ్రీలీల మరియు రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'దేక్ లేంగే' సాంగ్ తర్వాత వస్తున్న ఈ 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్ యూట్యూబ్ రికార్డులను తిరగరాయడం ఖాయం. పవన్ కళ్యాణ్ మాస్ అప్పియరెన్స్ కోసం మీరు ఎంతలా వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.