100% బ్యాటింగ్… OG యే క్యా జీ…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తీసిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. చాలా కాలం తర్వాత గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీస్ అయినట్టే, రిజల్ట్ కూడా సెన్సేషన్ ని రిపీట్ చేస్తుందనంటున్నారు.

Post Published By: dialnews
Updated : 17 March 2026, 6:35 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ తీసిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. చాలా కాలం తర్వాత గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీస్ అయినట్టే, రిజల్ట్ కూడా సెన్సేషన్ ని రిపీట్ చేస్తుందనంటున్నారు. టీజర్ ని మించేలా ట్రైలర్ ఉంది.. ఐతే ఇది ఓరకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కే కాదు, తన పవర్ ఫుల్ ఫాలోయింగ్ కి కూడాఅగ్ని పరీక్షలానే మారుతోంది. ఓజీ రిలీజ్ కి ముందు వరకు పవన్ కళ్యాణ్ క్రేజ్, మార్కెట్ లోమైలేజ్ పడిపోయిందన్నారు. కాని ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ వచ్చాకే తన క్రేజ్ కి ఇంకా పవర్ సప్లై చేస్తున్న పవర్ స్టార్ అని తేలింది. అంతవరకు బానే ఉంది. కాని ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ట్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యూచర్ తేలేలా ఉంది. తను ఎప్పటికీ సినిమాలు వదలనని అన్న మాట వెనక ఆంతర్యం కూడా అదే అనంటున్నారు. ఇంతకి ఈ రిజల్ట్ కి పవన్ సినిమాలను వదిలేదు లేదనటానికి ఉన్న లింకేంటి? పవన్ తో పాటు పవర్ స్టార్ ఫ్యాన్స్ ఇక ఉస్తాబ్ భగత్ సింగ్ ఎందుకు? ఎలా అగ్ని పరీక్ష పెడుతోంది?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ఈ వారం దురందర్ సీక్వెల్ కి పోటీ ఇచ్చేందుకు వస్తున్నాడు. అసలే హరీష్ శంకర్ తో పవన్ మూవీ అంటేనే హిట్ కాంబినేషన్. అందులోనూ కలిసొచ్చి ఖాకీ చొక్క... హిట్ అయిన తమిళ తేరీకి రీమేక్... కాబట్టి ట్రైలర్ పేలినట్టే, డైలాగ్స్ ని మించేలా బాక్సాఫీస్ లో వసూళ్లు పేలుతాయనే అంచనాలున్నాయి.అందుకుతగ్గట్టే ట్రైలర్ లాంచ్ ప్రమోషనల్ ఈవెంట్ లో పవన్ పేల్చిన సెటైర్లు ప్లస్ అవుతున్నాయి. ఒకప్పటి పవన్ కళ్యాన్ ని చూసినట్టౌతోందనే మాటే అంతటా వినిపిస్తోంది. బద్రి, ఖుషీ జమానాలో పవన్ ని ఓజీలో సుజీత్ చూపించాడు. ఇప్పుడు అత్తారింటికి దారేది జమనాలో పవన్ ఎలా అయితే ఈవెంట్స్ లో కూడా సందడి చేసేవాడో, అలా ఉస్తాద్ భగత్ సింగ్ ప్రమోషన్ లోఎమోషన్ చూపించాడు పవన్.

అదే సినిమా మీద మరింత ఎక్స్ పెక్టేషన్స్ పెంచేలా చేస్తోంది. అంతవరకు ఓకే కాని, ఓజీ క్రియేట్ చేసిన మానియాను ఉస్తాద్ రీచ్ అవుతుందా అనేది మొదటి ప్రశ్న అయితే.. దీని సమాదానంతో మరో ప్రశ్న ఎదురు కాబోతోంది. అదే పవన్ కి నిజంగా ఒకప్పటి క్రేజ్ ఇమేజ్ ఉందా? ఉంటుందా? ఇక మీదట తన పొలిటికల్ జర్నీ కి సినిమా మైలేజ్ ఎంతగా ఉపయోగా పడుతుంది? తన పొలిటికల్ జర్నీ ఎంతగా తన సినిమా క్రేజ్ ని తగ్గిస్తోంది..?ఈ ప్రశ్నలే ఉస్తాద్ భగత్ సింగ్ కి అగ్ని పరీక్షని ఎదురయ్యేలా చేస్తున్నాయి. ఓజీ వచ్చినప్పుడు బాక్సాఫీస్ ఊగిపోయింది. సో హిట్ మూవీ తర్వాత వచ్చే సినిమాకు పోలికలుంటాయి.. కాబట్టి వసూళ్ల గోల ఏమాత్రం తగ్గినా, ఓజీ ని మించటం కాదు, రీచ్ కాలేదనేలా ఉస్తాద్ మీద సోషల్ మీడియాలో యాంటీఫ్యాన్స్ ఎటాక్ ఉంటుంది. ఇది పక్కన పెడితే, సినిమాల్లో నటించటం వల్ల వచ్చిన క్రేజ్ పవన్ కి పొలిటికల్ గా ఉపయోగ పడొచ్చు..

కాని పాలిటిక్స్ తన సినిమాకెరీర్ కి ఉపయోగ పడేఛాన్సే లేదు.. ఇంకా తన సినీ కెరీర్ కి డ్యామేజే జరుగుతంది. ఒకటి, సినిమాలకు దూరంగా జరిగితే, ఫ్యాన్స్ తో టచ్ పోతుంది.. పొలిటికల్ గా బిజీ అయితే, శత్రువుల శాతం పెరుగుతుంది. ఇవన్నీంటిమధ్య పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ గా వచ్చి, తనని తాను ప్రూవ్ చేసుకుంటాడా? ఒక వైపు ఓజీ రేంజ్ రీచ్ అవుతాడా? ఒకప్పటి పవన్ అని మొన్నే ప్రూవ్ చేసుకున్నప్పటికీ, ఉస్తాద్ తో ఒకప్పటి గబ్బర్ సింగ్ అనిపించుకోగలుగుతాడా అన్న ప్రశ్న ఎదురౌతుంది. ఎంతైనా సినిమాలకు దూరం జరిగాకే, క్రేజ్, ఇమేజ్ తగ్గుతోందని తెలిసే, ఎప్పటికీ పవన్ సినిమాలను వదలనన్నాడా? ఉస్తాద్ భగత్ సింగ్ రిజల్ల్ తో పవన్ ఎందుకు సినిమాలను వదలనన్నాడో తెలుస్తుందా? ఈ ప్రశ్నలన్నీంటికి ఈ ఉగాదికే బ్రేక్ పడబోతోంది... సమాధానం దొరకబోతోంది.

Published : 
  • 17 March 2026, 6:35 PM IST