మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది ట్రైలర్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రానగ్ గ్లింప్స్ 24 గంటల తేడాతో ఫ్యాన్స్ కి మాస్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి. విచిత్రం ఏంటంటే ఈ నెల 18న పెద్ది ట్రైలర్ బ్లాస్ట్ చేయబోతున్నారు. మరుసటి రోజు అంటే మే 19 మిడ్ నైట్ డ్రాగన్ గ్లింప్స్ పేల్చేందుకు మహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. సో 24 గంటల గ్యాప్ లో ఇలా ఇద్దరు గ్లోబల్ స్టార్స్ నాటు ప్రోమోలతో దాడి చేయటం కన్ఫామ్ అయిపోయింది. ఇక తేలాల్సింది డ్యూరేషనే.. ఎందుకంటే 180 సెకన్లతో అంటే 3 నిమిషాల నిడివితో పెద్ది ట్రైలర్ వస్తుంటే, అంతే డ్యూరేషన్ తో డ్రాగన్ గ్లింప్ రాబోతోంది. అంటే డ్రానగ్ గ్లింప్స్, పెద్ది ట్రైలర్ తో సమానమా? ఈ విచిత్రమైన పోలిక వెనకున్న మెలికేంటి? మార్కెట్ లో తుఫాన్ క్రియేట్ చేయబోతోంది ఎవరు?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇద్దరు నాటు నాటు సాంగ్ కి ఎంత పర్ఫెక్ట్ సింక్ లో డాన్స్ చేశారో.. ఇప్పుడు అంతకంటే పర్ఫెక్ట్ సింక్ లో ఇద్దరూ ప్రోమోలు వదలబోతున్నారు. ఇద్దరి ఫ్యాన్స్ కి నాటు ఎక్స్ పీరియన్స్ ఇవ్వబోతున్నారు. డ్రాగన్ గ్లింప్స్ వచ్చే వారమే రాబోతోంది. దీనికి 24 గంటల ముందు పెద్ది ట్రైలర్ రిలీజ్ చేసేందుకు బుచ్చి బాబు టీం రెడీ అయ్యింది..ఇక్క కామెన్ కనెక్షన్స్ ఒకటి కాదు, రెండు కాదు,మూడున్నాయి.. ఒకటి ఎన్టీఆర్ తో తీయాల్సిన సినిమాను బుచ్చిబాబు ఇలా రామ్ చరణ్ తో తీశాడు.. రెండు త్రిబుల్ ఆర్ నాటు ఫ్రెండ్స్ ఇద్దరూ, వన్ డే గ్యాప్ లో రెండు క్రేజీ మూవీల ప్రోమోలతో ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వబోతున్నారు. మూడోది అతి ముఖ్యమైంది 180 సెకన్లు... ఔను పెద్ది ట్రైలర్ 180 సెకన్లే ఉండబోతోంది.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లింప్స్ 180 సెకన్లే ఉండబోతోంది.
ఇంతవరకు 180 సెకన్లతో ట్రైలర్స్ అంటే రేరే అయినా, చాలా సినిమాలు వచ్చాయి. లార్జర్ దేన్ లైఫ్ అనిపించే మూవీలే ఇలా 3 నిమిషాల నిడివితో ట్రైలర్ రూపంలో దండెత్తాయి... అందుకే హిందీ మూవీలైన దంగల్, లగాన్ లని కలిపితే వచ్చే ఔట్ పుట్టే పెద్ద మూవీ అంటున్నారు.. సో రెండు జోనర్ల మిక్చర్ లాంటి మూవీ జనాల్లోకి వెళ్లాంటే, ఈమాత్రం నిడివితో ట్రైలర్ వదలితే తప్ప, కంటెంట్ జనాలను రీచ్ కాదు.అందుకే ఇలా 3 నిమిషాల డ్యూరేషన్ తో పెద్ది ప్రోమోని వచ్చే వారం 18న వదలబోతున్నారు. ఇంతవరకు బానే ఉంది కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగనే ఫ్యాన్స్ నుంచి ఇండస్ట్రి వరకు అందరికి షాక్ ఇచ్చేలా ఉంది. అదే గ్లింప్స్ డ్యూరేషన్ తో.. ఇక్కడ కామన్ కనెక్షన్ ఏంటంటే పెద్ది ట్రైలర్ 180 సెకన్ల డ్యూరేషన్ తో వస్తే, డ్రాగన్ గ్లింప్స్ 180 సెకన్ల నిడివతో వస్తోంది..కాకపోతే గ్లింప్స్ ని ఎవరైనా 30 సెకన్ల కు మించి రిలీజ్ చేయరు.. అలాంటిది టీజర్ కాదు, ట్రైలర్ కాదు, కేవలం గ్లింప్సే పెద్ది ట్రైలర్ తో పోటీ పడేలా 180 సెకన్లతో వస్తోందంటే, ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఏదేమైనా మే 18న పెద్ది 3 నిమిషాల ట్రైలర్, మే 19న డ్రాగన్ 3 నిమిషాల గ్లింప్స్ ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కి పండగ తెచ్చేలా ఉన్నాయి. నాటు తూఫాన్ ని క్రియేట్ చేసేలా ఉన్నాయి.