40 సెకన్ల ‘పెద్ది’ తుఫాను…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త వచ్చేసింది. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన చరణ్, తన తదుపరి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడానికి అన్నివిధాలా సిద్ధమవుతున్నాడు.

Post Published By: dialnews
Updated : 25 March 2026, 4:50 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు పూనకాలు తెప్పించే వార్త వచ్చేసింది. గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన చరణ్, తన తదుపరి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడానికి అన్నివిధాలా సిద్ధమవుతున్నాడు. డైరెక్టర్ బుచ్చిబాబు సానాతో చేస్తున్న పెద్ది సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్‌డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా, చిత్ర యూనిట్ ఒక భారీ సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేసింది.

ఈ సినిమాకు సంబంధించి 40 సెకన్ల నిడివి గల ఒక 'స్టార్మింగ్ టీజర్' విడుదల కానుందని సమాచారం. కేవలం 40 సెకన్లే అయినా, అందులో చూపించబోయే విజువల్స్ మరియు చరణ్ మేకోవర్ ప్రేక్షకులను అశ్చర్యపరుస్తుందని ఇండస్ట్రీ టాక్. ఈ టీజర్‌ను ఇప్పటికే చూసిన కొంతమంది సినీ ప్రముఖులు మరియు టెక్నీషియన్లు చెబుతున్న మాట ఒక్కటే.. "కేక అంతే!". ఈ ఒక్క మాటతోనే మెగా ఫ్యాన్స్‌లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

బుచ్చిబాబు సానా ఈ చిత్రాన్ని ఒక రా అండ్ రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ ఒక పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ మరియు వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. కాగా,ఈ చిత్రం 30 ఏప్రిల్ 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Published : 
  • 25 March 2026, 4:50 PM IST