నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే…!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' తర్వాత నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'పెద్ది'. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Post Published By: dialnews
Updated : 28 February 2026, 3:55 PM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' తర్వాత నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'పెద్ది'. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ 'చికిరి చికిరి' సోషల్ మీడియాను షేక్ చేయగా, ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ సెకండ్ సాంగ్ అప్‌డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చింది.

సినిమా మేకర్స్ అధికారికంగా సెకండ్ సాంగ్ రై రై రారా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. ఈ మాస్ బీట్ సాంగ్‌ను మార్చి 2, 2026న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారట. ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఫస్ట్ సాంగ్ 'చికిరి చికిరి' మెలోడియస్ గా ఉంటే, 'రై రై రారా' మాత్రం పూనకాలు తెప్పించే మాస్ నంబర్ అని ఇండస్ట్రీ టాక్. ఈ పాటలో చరణ్ వేసే స్టెప్పులు థియేటర్లలో ఈలలు వేయించడం ఖాయం అనిపిస్తోంది.

వాస్తవానికి ఈ సినిమాను మార్చి 26, 2026న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటంతో మేకర్స్ రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. వేసవి కానుకగా ఏప్రిల్ చివరలో ఈ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. చరణ్ చేస్తున్న ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుందని మెగా ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.

Published : 
  • 28 February 2026, 3:55 PM IST