ఎడిటింగ్ టేబుల్ దద్దరిల్లేలా…!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది' గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉప్పెన' చిత్రంతో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్

Post Published By: dialnews
Updated : 18 March 2026, 6:34 PM IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది' గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఉప్పెన' చిత్రంతో సంచలనం సృష్టించిన బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో వేగం పెంచింది. ముఖ్యంగా ఎడిటింగ్ టేబుల్ వద్ద జరుగుతున్న పనులు మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు గ్రహీత, ప్రముఖ ఎడిటర్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి గతంలో అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాలకు పనిచేశారు, ఇప్పుడు 'పెద్ది' ని ఒక విజువల్ వండర్‌గా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. తాజాగా విడుదలైన సమాచారం ప్రకారం, సినిమా మొదటి సగం ఎడిటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది.

దర్శకుడు బుచ్చిబాబు మరియు నవీన్ నూలి ఎడిటింగ్ రూమ్‌లో వర్క్ చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. "ఎవ్రీ సీన్.. ఎవ్రీ ఫ్రేమ్ ఫైర్" అంటూ చిత్ర యూనిట్ ఇచ్చిన అప్‌డేట్ సినిమా రేంజ్ ఏంటో చెబుతోంది. సాధారణంగా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత ఎడిటింగ్ మొదలవుతుంది. కానీ 'పెద్ది' టీమ్ సమయాన్ని వృధా చేయకుండా, ఒకవైపు షూటింగ్ నిర్వహిస్తూనే మరోవైపు ఎడిటింగ్ పనులను కూడా పూర్తి చేస్తోంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించి సెకండ్ హాఫ్ పనులు జరుగుతున్నాయి. రామ్ చరణ్ ఈ సినిమాలో మునుపెన్నడూ లేని విధంగా ఒక 'రా అండ్ రస్టిక్' లుక్‌లో కనిపించబోతున్నారు. 1980ల నాటి ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఎమోషన్స్ మరియు యాక్షన్ సీక్వెన్స్‌లను ఎడిటింగ్ టేబుల్ వద్ద అత్యంత జాగ్రత్తగా పాలిష్ చేస్తున్నారట. ఈ చిత్రానికి మరో ప్రధాన బలం ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్.

ఎడిటింగ్ లాక్ అయిన సీన్లకు రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఇప్పటికే మొదటి సగానికి సంబంధించిన రీ-రికార్డింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. రెహమాన్ అందించిన మ్యూజిక్ ఎడిటింగ్ లో వచ్చిన అవుట్‌పుట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిందని చిత్ర వర్గాల సమాచారం. ఇటీవల సోషల్ మీడియాలో ఈ సినిమా రన్‌టైమ్ గురించి అనేక రూమర్స్ వచ్చాయి. అయితే మేకర్స్ వీటికి చెక్ పెడుతూ.. సినిమా ఇంకా ఎడిటింగ్ దశలోనే ఉందని, రన్‌టైమ్ పై వస్తున్న వార్తలు వాస్తవం కాదని స్పష్టం చేశారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా తగ్గకుండా, ప్రతి సన్నివేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి ఎడిట్ చేస్తున్నట్లు తెలిపారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఒక భారీ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉంది.

Published : 
  • 18 March 2026, 6:34 PM IST