ముగ్గురు ప్రభాసులు.. 3వ రెబల్ స్టార్…!

సిల్వర్ స్క్రీన్ మీద ఒక్క ప్రభాస్ ఉంటేనే, బాక్సాఫీస్ బద్దలైపోతుంది.. కథ ఏమాత్రం కనెక్ట్ అయినా, కాసుల సునామీనే.. అలాంటిది ఒకే తెరమీద ఇద్దరు ప్రభాసులుంటే, ఎలా ఉంటుందో భిల్లా, బాహుబలి తో ప్రూవ్ అయ్యింది.

Post Published By: dialnews
Updated : 28 April 2026, 5:00 PM IST

సిల్వర్ స్క్రీన్ మీద ఒక్క ప్రభాస్ ఉంటేనే, బాక్సాఫీస్ బద్దలైపోతుంది.. కథ ఏమాత్రం కనెక్ట్ అయినా, కాసుల సునామీనే.. అలాంటిది ఒకే తెరమీద ఇద్దరు ప్రభాసులుంటే, ఎలా ఉంటుందో భిల్లా, బాహుబలి తో ప్రూవ్ అయ్యింది. కాని ఇంతవరకు ఎన్నడూ జరగంది, ఇప్పడు జరగబోతోంది.. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ముగ్గురు ప్రభాస్ లను వెండితెరమీద చూడబోతున్నాం.. ఆ వింత కల్కీ సీక్వెల్ కల్కీ 2 లోనే జరిగేలా ఉంది. కర్ణ 3102 బీసీ టైటిల్ తో రెడీ అవుతున్న ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ మూడో పాత్ర కూడా వేయబోతున్నాడా? ఆల్రెడీ భైరవుడిగా బౌంటీ హంటర్ గా కనిపించాడు. కర్ణుడిగా కత్తి తిప్పాడు.. మరిప్పుడు వేసే ఆ మూడో పాత్ర ఏంటి? క్లైమాక్స్ లోనే ఆ పాత్ర కనిపిస్తుందన్న ప్రచారానికి రీజనేంటి?

ఒకే వెండితెర.. దాని మీద ముగ్గురు ప్రభాస్ లు.. ఇది రాజమౌళి వల్ల రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ లో క్రియేట్ అయిన కల.. బాహుబలి 3 ఉంటుంది.. అందులో మూడో ప్రభాస్ వస్తాడు అని అప్పట్లో ప్రచారం జరిగింది. బాహుబలి 3 కి ఛాన్సేలేదు.. కాని ఒకే తెరమీద ముగ్గురు బాహుబలులుంటే, ఆ ఊహే నెక్ట్స్ లెవల్.. అదే ఇప్పడుు కల్కీ సీక్వెల్ లో జరగబోతోంది.నిజానికి బిల్లాలో ప్రభాస్ డ్యూయెల్ రోల్ వేశాడు.. కాని ఎక్కడా ఇద్దరు ప్రభాస్ లు ఒకే స్క్రీన్ మీద కనిపించలేదు. అలానే బాహుబలిలో కూడా ప్రభాస్ తండ్రి కొడుకుల పాత్రలు వేశాడు. కాని ఎక్కడా ఈ రెండు పాత్రలు ఒకేసారి సిల్వర్ స్క్రీన్ మీద కనిపించింది లేదు. కాని కల్కీ సీక్వెల్ కర్ణ 3102 బీసీలో మాత్రం ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గుర ప్రభాస్ లు ఒకేసారి వెండితెరమీద వెలిగేలా ఉన్నారు.కల్కీ మొదటి భాగంలో, ఒకే ఒక్క సీన్ లో కర్ణుడిగా కానసేపే కనిపించిన ప్రభాస్, క్లైమాక్స్ లో మాత్రం ఇద్దరు ప్రభాస్ లను చూడమన్నాడు... కల్కీలో భైరవగా కనిపించిన ప్రభాస్, క్లైమాక్స్ లో ఒకేసారి భైరవగా, కర్ణుడిగా మారుతూ కనిపించాడు.. ఒకరకంగా స్పిట్ పర్సనాలిటీ ఫీల్ కలిగిందన్న రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కల్కీ 2 లో మూడో పాత్ర ఎంట్రీ ఇవ్వబోతోంది.

మొన్నటి వరకు టైటిల్ కల్కీ కాబట్టి, కల్కీ అవతారం లో ప్రభాస్ కనిపిస్తాడనే ప్రచారం జరగింది. కాని కాదు... యాస్కిన్ రోల్ షిఫ్ట్ కాబోతోందట. ఇది బిగ్గెస్ట్ లీక్... ఇదెంతవరకు నిజం అన్నది ఫిల్మ్ టీం నుంచి అఫీషియల్ గా తేలాలి.. అసలు విషయం ఏంటంటే, కల్కీలో భైరవగా నవ్వించిన ప్రబాస్, కర్ణుడిగా కనిపించి థియేటర్స్ ని షేక్ చేశాడు.ఇప్పుడు కల్కీ 2 క్లైమాక్స్ లో విలన్ గా అంటే, కమల్ వేసిన యాక్సిన్ రోల్ లో సర్ ప్రైజ్ చేసేలా ఉన్నాడు. కల్కీ అవతారంలో వచ్చి ఆ యాస్కిన్ ని చంపే బాధ్యత కమల్ హాసన్ నిర్వర్తించబోతున్నాడు. ఇదే కల్కీ2 అసలు సిసలు ట్విస్ట్..మరి ఇలా ఎందుకు పాత్రలు స్విఫ్ట్ అవుతాయో కాని, ఒకేసారి వెండితెరమీద, ఇటు భైరవ, అటు కర్ణ, అలానే యాస్కిన్ గా ప్రభాస్ కనిపిస్తే, బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే... సెన్సేషన్ క్రియేట్ అవ్వాల్సిందే.

Published : 
  • 28 April 2026, 5:00 PM IST