భం.. భం.. బాంబు పేల్చేస్తాం… ఇది రెబల్ మాస్…!

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ కల్కీ సీక్వెల్ షూటింగ్ తో 12 రోజులు బిజీ కాబోతున్నాడు. తర్వాత ఫౌజీ పెండింగ్ షూటింగ్ తోపాటు స్పిరిట్ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశారు.

Post Published By: dialnews
Updated : 28 February 2026, 7:30 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ కల్కీ సీక్వెల్ షూటింగ్ తో 12 రోజులు బిజీ కాబోతున్నాడు. తర్వాత ఫౌజీ పెండింగ్ షూటింగ్ తోపాటు స్పిరిట్ కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్లాన్ చేశారు. కట్ చేస్తే ఆల్ ఆఫ్ సడన్ గా సీన్ లోకి హంబలే బ్యానర్ వచ్చింది. కేజీయఫ్, సలార్, మహావతార్ నరసింహ లాంటి సినిమాలు తీసిన పవర్ హౌజ్ హంబలే... అలాంటి సంస్థ మళ్లీ సీన్ లోకి రావటంతో, సలార్ సీక్వెల్ షురూ అవబోతోందని అనుకున్నారు. కాని ఇక్కడ ఫ్రెష్ ప్రాజెక్ట్ తో షాక్ ఇస్తోంది హంబలే సంస్థ... ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమాకు పెరుగుతున్న డిమాండ్ ని ద్రుష్టిలో పెట్టుకుని, ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూషన్ లోకి అడుగుపెడుతూనే, హాలీవుడ్ సంస్తలతో టై అప్ అవుతోంది. సలార్ సీక్వెల్ కాకుండా, సుకుమార్ డైరెక్షన్ లో ప్రభాస్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఈ సినిమా సెట్స్ పైకెళ్లదు.. 2030 లోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేలా ఉంది. సో 4 ఏళ్ల తర్వాత పట్టాలెక్కే ప్రాజెక్ట్ కోసం ఇప్పటి నుంచే ప్లానింగా? ఇంతకి 4 ఏల్ల వేయిటింగ్ పీరియడ్ ఎందుకు?

రెబల్ స్టార్ ప్రభాస్ తో హంబలే బ్యానర్ లో సినిమా కొత్త కాదు. ఆల్రెడీ సలార్ మూవీ వచ్చింది. కేజీయఫ్ రెండు భాగాల తర్వాత ప్రశాంత్ నీల్ మేకింగ్ లో ఇదే సంస్త సలార్ మూవీ తీసింది. ఇప్పుడు సలార్ శౌర్యంగా పర్వం అంటే సలార్ పార్ట్ 2 మొదలౌతుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. కాని ఇప్పుడు హంబలే బ్యానర్ లో ప్రభాస్ చేయబోయే క్రేజీ ప్రాజెక్ట్ సలార్ 2 కాదు..అంతకుమించేలా భారీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తోంది హంబలే బ్యానర్. అసలుహంబలే అంటేనే కేజీయఫ్ రేంజ్ మూవీలనే బ్రాండ్ ఇమేజ్ ఉంది. ఇప్పుడా బ్రాండ్ ఇమేజ్ కే బ్యాండేసేలా ఉన్నారు హంబలే నిర్మాతలు. కాకపోతే డైరెక్టర్ మాత్రం సుకుమార్.. తన మేకింగ్ లోనే ప్రభాస్ సినిమా సెట్స్ పైకెళ్లటం ఆల్ మోస్ట్ కన్పామ్ అయ్యింది. అగ్రిమెంట్లు కూడా ఉగాది లోపు జరగొచ్చని తెలుస్తోంది.

నిజానికి రెబల్ స్టార్ లాంటి కటౌట్ తో సినిమా తీయలేకపోయా అన్న అభిప్రాయం సుకుమార్ కి ఎప్పటి నుంచో ఉందన్నాడు. విచిత్రంగా ఇలాంటి దర్శకుడి మేకింగ్ లో రెబల్ స్టార్ మూవీ పడకపోవటం కూడా ఎవరికి అంతుచిక్కని అంశమే. ఏదైమైనా వీళ్ల కాంబినేషన్ ఓకే అయ్యేలా ఉంది. కాకపోతే 2030 లోనే ఈ కాంబినేషన్ లో సెన్సేషన్ సెట్స్ పైకెళ్లే ఛాన్స్ఉంది.ఔను ప్రజెంట్ ప్రభాస్ కల్కీ 2 ని పూర్తి చేయాలి. 4 నెలల్లో ఫౌజీ షూటింగ్ పూర్తవుతుంది. ఈ ఏడాది ఎండ్ వరకు సందీప్ రెడ్డి మూవీ స్పిరిట్ నడుస్తూ ఉంటుంది.. ఇది కాకుండా ఇంకా హంబలే సంస్థలోనే సలార్ సీక్వెల్ శౌర్యంగా పర్వం తెరకెక్కాలి. ఇంకా మైత్రీ మూవీ మేకర్స్ తో ప్రభాస్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడనంటున్నారు. ఇవన్నీ తను పూర్తి చేయాలి.. అలానే సుకుమార్ కూడా ప్రజెంట్ రామ్ చరణ్ మూవీ, తర్వాత సూపర్ స్టార్ మహేశ్ తో సినిమా తీయాలి..

ఇంకా పుష్ప3 కూడా సేఫ్ సైడ్ కోసం ప్లాన్ చేయిస్తున్నాడు బన్నీ.. సో ఇలాఇటు సుకుమార్, అటు ప్రభాస్ ఫ్రీ అయ్యేది 2030 లోనే కాబట్టి, అప్పుడే ఈ రేర్ కాంబినేషన్ సెట్ అయ్యేలా ఉంది. కనీసం 1500 కోట్ల వరకు బడ్జెట్ అయినా పర్లేదని, రెబల్ స్టార్ టచ్ చేయని జోనర్ లో సినిమా ప్లాన్ చేస్తున్నారట. ఇంకా కథే సెట్ కాకుండా బడ్జెట్ అనుకోవటం తొందరపాటేఅవుతుంది. కాని ప్రచారంలో మాత్రం 1500 కోట్ల బడ్జెట్ అన్న నెంబర్ వినబడుతోంది.

Published : 
  • 28 February 2026, 7:30 PM IST