రెబల్ స్టార్ Vs రిధి కుమార్…!

బాహుబలి తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా, తన సింప్లిసిటీతో అందరినీ ఆశ్చర్యపరిచే వ్యక్తి మన 'డార్లింగ్' ప్రభాస్. ఆయనతో పనిచేసిన ఏ నటి అయినా సరే.. షూటింగ్

Post Published By: dialnews
Updated : 9 March 2026, 3:50 PM IST

బాహుబలి తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగినా, తన సింప్లిసిటీతో అందరినీ ఆశ్చర్యపరిచే వ్యక్తి మన 'డార్లింగ్' ప్రభాస్. ఆయనతో పనిచేసిన ఏ నటి అయినా సరే.. షూటింగ్ ముగిసిన తర్వాత కూడా ప్రభాస్ గురించి గొప్పగా చెప్పకుండా ఉండలేరు. తాజాగా 'రాజా సాబ్' హీరోయిన్ రిధి కుమార్, ప్రభాస్ ఆన్-స్క్రీన్ మీద మాత్రమే కాదు.. ఆఫ్-స్క్రీన్ లో కూడా ఒక 'రియల్ జెంటిల్మెన్' అంటూ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రభాస్ సెట్‌లో ఉంటే తిండికి కొదవ ఉండదని అందరికీ తెలిసిందే.

రిధి కుమార్ కూడా అదే విషయాన్ని ఒక సరదా ఉదాహరణతో చెప్పారు. ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్‌కు వెళ్ళేటప్పుడు కచ్చితంగా ఒక 'యోగా మ్యాట్' వెంట తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఆయన పెట్టే ప్రేమపూర్వకమైన విందు భోజనానికి మనం ఎంత బరువు పెరుగుతామో తెలియదు.. అది కవర్ చేసుకోవడానికి యోగా చేయాల్సిందే" అని రిధి నవ్వుతూ పేర్కొన్నారు. కేవలం తోటి నటీనటులకే కాదు, సెట్‌లో ఉండే టెక్నీషియన్స్ అందరికీ ఇంటి భోజనాన్ని అరేంజ్ చేస్తారని, ఆయన ఆతిథ్యంలో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంటుందని ఆమె ప్రశంసించారు.

'రాజా సాబ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో రిధి కుమార్ ఒక అందమైన శారీ కట్టుకుని వచ్చారు. ఆ చీర గురించి ఆమె ఒక ఎమోషనల్ సీక్రెట్ చెప్పారు. ఆ శారీని ప్రభాస్ స్వయంగా ఆమెకు గిఫ్ట్‌గా ఇచ్చారట. సుమారు మూడు సంవత్సరాల క్రితమే ప్రభాస్ ఆ చీరను బహుమతిగా ఇవ్వగా.. దాన్ని ఎంతో జాగ్రత్తగా దాచుకున్నానని, తన కెరీర్‌లో అత్యంత ముఖ్యమైన వేదికపై మాత్రమే దాన్ని ధరించాలని నిర్ణయించుకున్నానని ఆమె వెల్లడించారు. ఒక నటికి ఇంతటి విలువ ఇచ్చి, చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకోవడం కేవలం ప్రభాస్ లాంటి జెంటిల్మెన్‌కే సాధ్యమని ఆమె కొనియాడారు.

రిధి కుమార్ గతంలో ప్రభాస్‌తో కలిసి 'రాధే శ్యామ్'లో చిన్న పాత్ర చేశారు. కానీ 'రాజా సాబ్'లో ఆయన సరసన మెయిన్ హీరోయిన్‌లలో ఒకరిగా ఛాన్స్ రావడం ఒక కల లాంటిదని ఆమె అన్నారు. షూటింగ్ సమయంలో తనకు భాష తెలియక ఇబ్బంది పడుతున్నప్పుడు, ప్రభాస్ ఎంతో ఓపిగ్గా గైడ్ చేశారని, ఆయన పక్కన ఉన్నప్పుడు ఎప్పుడూ ఒక భద్రతా భావం ఉంటుందని ఆమె చెప్పారు. అందుకే ఆయనను అందరూ 'డార్లింగ్' అని పిలుస్తారని రిధి స్పష్టం చేశారు.

Published : 
  • 9 March 2026, 3:50 PM IST