5000 కోట్ల బంపర్ ఆఫర్.. 2027లో 1+2…!

రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించే నిర్ణయం తీసుకున్నాడు ప్రభాస్. రాజాసాబ్ లాంటి షాక్ తర్వాత, ప్రభాస్ నిర్ణయాల్లో ఇంత మార్పుని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. స్పిరిట్ రిలీజ్ డేట్ ని తనే లాక్ చేశాడట.

Post Published By: dialnews
Updated : 5 May 2026, 6:50 PM IST

రెబల్ స్టార్ ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించే నిర్ణయం తీసుకున్నాడు ప్రభాస్. రాజాసాబ్ లాంటి షాక్ తర్వాత, ప్రభాస్ నిర్ణయాల్లో ఇంత మార్పుని ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు. స్పిరిట్ రిలీజ్ డేట్ ని తనే లాక్ చేశాడట. కల్కీ సీక్వెల్ రిలీజ్ డేట్ లాక్ చేసేలా దర్శక నిర్మాతలకు అల్టీ మేటం ఇచ్చేశాడట. ఐతే దీని ఎఫెక్ట్ తో 2027 అంటే, వచ్చే ఏడాది రెబల్ సునామీలు ఒకటి కాదు, రెండు కాదు మూడు రాబోతున్నాయి. ఫౌజీ, కల్కీ 2, స్పిరిట్ ఈ మూడు సినిమాలు మూడెక్కాన్ని ఫాలో కాబోతున్నాయి.. రెండు సినిమాల మధ్య 3 నెల్ల గ్యాప్, మూడో మూవీకి 9 నెలల గ్యాప్.. ఇలా ఒకే ఏడాది మూడు ప్రభాస్ సినిమాలొస్తే ఎలా ఉంటుంది.. డ్రాగన్, వారణాసి ని మధ్యలో పెట్టి, ముందు వెనక, రెబల్ ప్యాకేజ్ ని ప్లాన్ చేస్తున్నాడు ప్రభాస్..

రెబల్ స్టార్ ప్రభాస్ ఒక్కడే ఒకే ఏడాది 5 వేల నుంచి 10 వేల కోట్ల సునామీ తెస్తే ఎలా ఉంటుంది.. రెబల్ ఫ్యాన్స్ కి పండగే.. కాకపోతే ఇదెంత వరకు సాధ్యం.? ఈ ప్రశ్నకే మూడు ఆన్సర్స్ కనిపిస్తున్నాయి. 5 వేల కోట్లు, 6 వేల కోట్లు కాలం కలిసొస్తే వచ్చే ఏడాది 10 వేలకోట్ల ప్రభాస్ వల్లే ఇండయిన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసే నెంబర్స్ గా మారేలా ఉన్నాయి.ఇందులో యావరేజ్ టాక్ వచ్చినా కనీసం 1000 కోట్ల నుంచి 2 వేలకోట్లు రాబట్టే స్టామినా ఉన్న మూవీ అంటే స్పిరిటే.. సందీప్ రెడ్డి వంగ, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ కున్నా క్రేజే కాదు, కంటెంట్ మీద జనాలకున్న నమ్మకం వల్ల కూడా, ఈ సినిమా ఈజీగా 1000 కోట్ల నుంచి 2 వేల కోట్లు రాబట్టే ఛాన్స్ఉందంటున్నారు.. అయితే ఇది కాదు అసలు సెన్సేషన్.

అంతా 2027 నెంబర్ లోనే ఉంది. అంటే వచ్చే ఏడాది రెబల్ నామ సంవత్సరంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. నిజానికి వచ్చే ఏడాది జూన్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మూవీ డ్రాగన్ రాబోతోంది. అంతుకుముందు ఏప్రిల్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి వాయించబోతోంది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ బెండు తీసేందుకు నెక్ట్స్ ఇయర్ ముహుర్తం చూసుకుంటే...ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా మూడు సినిమాలతో వచ్చే ఏడాది మీద రెబల్ దాడి చేయబోతున్నాడు రెబల్ స్టార్. ఐను 2027 మార్చ్ లో కల్కీ సీక్వెల్ కర్ణ3102 బీసీ రాబోతోంది. ఇక 9 నెలల గ్యాప్ తో స్పిరిట్ మూవీ రిలీజ్ డేట్ కన్ఫామ్ అయ్యింది. హిందీ యానిమల్ రిలీజైన డిసెంబర్ ఒకటినే ఇది రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. ఇక హను రాఘవపూడీ డైరెక్షన్ లో ప్రభాస్ తీస్తున్న ఫౌజీ మాత్రం సంక్రాంతికే బరిలోకి దిగేలా కనిపిస్తోంది.

నిజానికి ఈ ఏడాది దసరాకే ఫౌజీ రిలీజ్ అన్నారు. కాని కల్కీ 2 షూటింగ్ సడన్ గా మొదలవ్వటం, స్పిరిట్ కి బ్రేకులు వేయటం, ఆతర్వాత మళ్లీ స్పిరిట్ కి డేట్లు ఇవ్వటం... ఈ మొత్తం హడావిడిలో, ఫౌజీ పెండింగ్ షూటింగ్ వెనకబడుతోంది. కాబట్టే దసరాకు కష్టం. సంక్రాంతికే రిలీజ్ అంటున్నారు. అదే నిజమైతే, జనవరిలో ఫౌజీ, మార్చ్ లో కల్కీ 2, వచ్చే ఏడాది డిసెంబర్ లో స్పిరిట్... అంటే వచ్చే ఏడాది మూడు సినిమాలతో పాన్ ఇండియా మీద మూడు సార్లు రెబల్ స్టార్ దాడి చేసేలా ఉన్నాడు. ఫౌజీ 1000 కోట్ల అంచనాలతో వస్తుంటే, కల్కీ 2 కనీసం రెండు వేల కోట్ల అంచనాలతో వస్తోంది. స్పిరిట్ 1000 కోట్ల నుంచి 2 వేల కోట్ల మధ్య రాబడుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి. అయితే ఇవన్నీ మినిమమ్ ఎక్స్ పెక్టేషన్సే.. ఏ మాత్రం కథ బాగుండి, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా 5 వేలకోట్లనుకున్న దగ్గర 6 వేల కోట్ల నుంచి 10 వేల కోట్ల వరకు ఈ మూడు సినిమాలు మూకుమ్మడి దాడి చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

Published : 
  • 5 May 2026, 6:50 PM IST