ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'రాకా'. ప్రస్తుతం ముంబైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ గురించి ఒక ఆసక్తికరమైన వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రంలో తెలుగు నటి సిరి హన్మంతు ఒక కీలక పాత్రలో నటించబోతున్నారు. ఒక కార్యక్రమంలో నిర్మాత ఎస్.కె.ఎన్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.
గతంలో 'సీతా పయనం', 'చెన్నై లవ్ స్టోరీ' చిత్రాల్లో నటించిన సిరి.. ఈ క్రేజీ ప్రాజెక్టులో భాగమవ్వడం విశేషం. అయితే ఆమె పాత్రకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో, ఒక డాన్ చుట్టూ తిరిగే ఈ యాక్షన్ ఎంటర్టైనర్లో బాలీవుడ్ స్టార్స్ దీపికా పదుకోన్, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూపుదిద్దుకుంటోంది.