కెరీర్ ఫిట్‌నెస్ ఇవే చూడండి.!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ ద్వారా సినీ ప్రయాణం ప్రారంభించిన ఈ భామ, అతి తక్కువ సమయంలోనే తెలుగు, హిందీ భాషల్లో అగ్ర కథానాయికగా ఎదిగింది.

Post Published By: dialnews
Updated : 13 August 2026, 9:20 PM IST

నేషనల్ క్రష్ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కన్నడ ఇండస్ట్రీ ద్వారా సినీ ప్రయాణం ప్రారంభించిన ఈ భామ, అతి తక్కువ సమయంలోనే తెలుగు, హిందీ భాషల్లో అగ్ర కథానాయికగా ఎదిగింది. తన నటన, గ్లామర్, క్యూట్ హావభావాలతో పాన్ ఇండియా స్థాయిలో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో రష్మిక తన సినీ ప్రయాణం, సోషల్ మీడియా ప్రవర్తన, బాడీ ఫిట్‌నెస్, అలాగే ఇండస్ట్రీలో ఎదురయ్యే విమర్శల గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రతీ కొత్త ప్రాజెక్ట్ ముందు తనకు కలిగే ఆందోళన గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం టాలీవుడ్ సహా బాలీవుడ్‌లోనూ హాట్ టాపిక్‌గా మారాయి.
సాధారణంగా నటులకు అనుభవం పెరిగేకొద్దీ భయం, టెన్షన్ తగ్గుతాయని భావిస్తుంటారు.

కానీ రష్మిక విషయంలో అది వేరుగా ఉంది. ఎన్ని సినిమాలు చేసినప్పటికీ, ప్రతీ కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించేటప్పుడు తనలో ఆందోళన, టెన్షన్ ఖచ్చితంగా ఉంటాయని ఆమె వెల్లడించారు.సినిమా విడుదల సమయంలో కూడా ఈ భయం ఉంటుందని, అయితే దీనిని తాను ఎంతమాత్రం నెగెటివ్‌గా భావించనని రష్మిక చెప్పారు. ఒక సినిమాలో నటించడం అంటే నాలోని ఒక భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే. అందుకే ప్రతి కొత్త సినిమా విషయంలోనూ నాలో ఒక ప్రత్యేకమైన ఉత్సుకత, భయం ఉంటాయి. ఎంత అనుభవం వచ్చినా ప్రతీ సినిమాను ఒక కొత్త అనుభవంగానే భావిస్తాను" అని రష్మిక పేర్కొన్నారు. ప్రతీ సినిమా ఏదో ఒక రకంగా తనను నటిగా మరింత తీర్చిదిద్దిందని ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో సెలబ్రిటీల ప్రవర్తనపై తరచూ రకరకాల చర్చలు జరుగుతుంటాయి. దీనిపై రష్మిక స్పందిస్తూ.. తాను సోషల్ మీడియా కోసం తన అసలు వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ మార్చుకోనని స్పష్టం చేశారు.

"నేను నిజ జీవితంలో ఎలా ఉంటానో, సోషల్ మీడియాలోనూ దాదాపు అలాగే కనిపిస్తాను. ఇతరులను మెప్పించడం కోసం లేదా లైక్స్ కోసం ఒక 'ఆర్టిఫిషియల్ ఇమేజ్' క్రియేట్ చేసుకోవడం నాకు ఎంతమాత్రం ఇష్టం ఉండదు. తన స్నేహితులతో సరదాగా గడిపిన క్షణాలు, ప్రయాణాలు, వర్కౌట్ వీడియోలు, తన మనసులోని ఆలోచనలను అభిమానులతో సహజంగా పంచుకోవడమే తనకు ఇష్టమని ఆమె వివరించారు. ప్రతి ఒక్కరి ఆలోచనలను లేదా అభిప్రాయాలను మనం నియంత్రించడం సాధ్యం కాదని ఆమె అన్నారు. ప్రతికూల వ్యాఖ్యలను పట్టించుకోకుండా తన దృష్టిని ఎప్పుడూ సినిమాలు, నటనపైనే ఉంచుతానని చెప్పారు. నా ప్రయాణమే నా గురించి మాట్లాడేలా చేయాలని కోరుకుంటాను. విమర్శల కంటే నన్ను ప్రాణంగా ప్రేమించే అభిమానుల నుంచి లభించే ఆప్యాయత, మద్దతు ఎప్పుడూ చాలా ఎక్కువగా ఉంటాయి" అని రష్మిక ధీమా వ్యక్తం చేశారు. రష్మిక ఫిట్‌నెస్ రొటీన్ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

సాధారణంగా హీరోయిన్లు అందంగా కనిపించడానికే ఫిట్‌నెస్ పాటిస్తారనే భావన ఉంటుంది. కానీ రష్మిక దీనిపై భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.ఆహారం విషయంలో కఠినమైన నియమాలు కాకుండా బ్యాలెన్స్ పాటిస్తానని, శరీరానికి తగినంత నిద్ర, విశ్రాంతి చాలా ముఖ్యమని తెలిపారు. ఫిట్‌గా ఉండటం అంటే కేవలం కెమెరా ముందు అందంగా కనిపించడం మాత్రమే కాదు. ప్రతీరోజూ ఉత్సాహంగా సరైన మైండ్‌సెట్‌తో పనిచేయడానికి శరీర ధారుడ్యం ఎంతో అవసరం" అని రష్మిక వెల్లడించారు.సినిమా సినిమాకూ తన పాత్రల్లో వైవిధ్యం చూపిస్తూ, ప్రతి కొత్త ప్రాజెక్ట్‌ను ఒక బాధ్యతగా స్వీకరిస్తూ రష్మిక ముందడుగు వేస్తున్నారు. ప్రతికూలతలను అధిగమిస్తూ తన పనినే సమాధానంగా చూపిస్తున్న రష్మిక రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

Published : 
  • 13 August 2026, 9:20 PM IST