మెగాహీరోతో కొరియన్ సినిమా…!

"అశోకవనంలో అర్జున కళ్యాణం" సినిమాలో వసుధగా వచ్చి తన కళ్ళతోనే కుర్రాళ్ల మనసు దోచుకున్న బ్యూటీ రితికా నాయక్. ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టి, ఈరోజు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళ్తోంది రితిక.

Post Published By: dialnews
Updated : 21 February 2026, 1:55 PM IST

"అశోకవనంలో అర్జున కళ్యాణం" సినిమాలో వసుధగా వచ్చి తన కళ్ళతోనే కుర్రాళ్ల మనసు దోచుకున్న బ్యూటీ రితికా నాయక్. ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టి, ఈరోజు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళ్తోంది రితిక. ఇటీవలే తేజ సజ్జతో నటించిన 'మిరాయ్' సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రితికా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

రితికా నాయక్ చేతిలో ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఆనంద్ దేవరకొండ సరసన రితికా హీరోయిన్ గా నటిస్తోంది. డ్యూయెట్ అనే ఈ సినిమా ఒక ప్యూర్ లవ్ స్టోరీగా, మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకత్వంలో రాబోతోంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ఇండో-కొరియన్ హారర్ కామెడీ కొరియన్ కనకరాజు సినిమాలో రితికా మెయిన్ లీడ్ గా చేస్తోంది. దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని చాలా వెరైటీగా ప్లాన్ చేస్తున్నాడు.

మ్యాచో స్టార్ గోపీచంద్ - సంకల్ప్ రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న ఒక భారీ పీరియడ్ డ్రామాలో కూడా రితికా పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రితికా కేవలం నటి మాత్రమే కాదు, తను ఒక NCC కాడెట్ కూడా. అందుకే తను చాలా ఫిట్‌గా ఉంటుంది. 'హాయ్ నాన్న' సినిమాలో నాని కూతురు మహి పాత్రలో కూడా మెరిసింది. వరుస సినిమాలతో 2026లో రితికా నాయక్ టాలీవుడ్‌ను ఏలేలా కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ, ఎప్పటికప్పుడు ఇన్ స్టాగ్రామ్‌లో తన గ్లామరస్ ఫొటోలతో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

Published : 
  • 21 February 2026, 1:55 PM IST