రెబల్ స్టార్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా సూపర్ స్టార్ వారణాసి మూవీకే ఎసరు పెట్టేలా ఉన్నాడు.. తను సడన్ గా కల్కీ 2 సెట్లో అడుగుపెట్టడం, కర్ణుడిగా బిజీ అవ్వాటం.. ఇవేవి కూడా రాజమౌళి మూవీ వారణాసికి మంచిది కాదని తెలుస్తోంది. నిజం చెప్పాలంటే వారణాసి రిలీజ్ డేట్ ఎనౌన్స్ అయిన వెంటనే, హర్రీ బర్రీగా నాగ్ అశ్విన్ సీన్ లోకొచ్చాడు.. స్పిరిట్ షూటింగ్ ఇంకాస్త లేటైనా పర్లేదు కాని, ముందు కల్కీ సీక్వెల్ కానియచ్చేయాలని ప్రభాస్ ని తొందర పెట్టాడు.. అందుకే కమల్ హాసన్, అమితాబ్ లను వేగంగా రంగంలోకి దింపాడు.. ప్రొడ్యూసర్స్ నుంచి రెబల్ స్టార్ వరకు అందరికీ ఉరికిస్తున్నాడు.. ఇంతకి వారణాసి రిలీజ్ డేట్ కి, అర్జెంట్ గా కల్కీ సీక్వెల్ ని పట్టాలెక్కించటానికి ఉన్న లింకేంటి?
సూపర్ స్టార్ మూవీ వారణాసికి, రెబల్ స్టార్ మూవీ కల్కీ 2 జలక్ ఇచ్చేలా ఉంది. ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇది ఖచ్చితంగా తప్పని పరిస్తితి... అందుకే ఆగమేఘాల మీద కల్కీ 2 ని స్టార్ట్ చేశారు. దాని వల్ల స్పిరిట్ ని కూడా కాసేపు పక్కనపెట్టే పరిస్తితి వచ్చింది. నిజానికి స్పిరిట్ కోసం ఏకంగా 80 శాతం చేసిన ఫౌజీనే ఆపేశారు..అలాంటి స్పిరిట్ షూటింగ్ కే సడన్ గా బ్రేక్ వేసి, కల్కీ 2 ని మొదలు పెట్టారంటే, కారనం వారణాసినే... రాజమౌళి తీస్తున్న మహేశ్ బాబు మూవీ వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్లో ఎట్టి పరిస్తితుల్లో వస్తుంది..కాబట్టి దానికంటేముందు మార్చ్ లో ఎలాగైనా కల్కీ 2ని రిలీజ్ చేయాలని, పూనకం వచ్చిన వ్యక్తిగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఆల్ ఆఫ్ సడన్ గా సీక్వెల్ ని మొదలు పెట్టాడు.
ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కూడా సెట్లో అడుగుపెడుతున్నాడు. మొన్నటి వరకు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ నటించే కీ సీన్స్ ని తీస్తున్న తను, ఇప్పడు ప్రభాస్ లేని మరిన్ని సీన్స్ కూడా పూర్తి చేసే పనిలో పడ్డాడు. వన్స్ ప్రభాస్ సీన్ లోకి రాగనే, మొదటి షెడ్యూల్ లోనే30 శాతం షూటింగ్ అయిపోతుంది. కల్కీ మొదటి భాగం తీసేప్పుడే 30శాతం షూటింగ్ అయిపోయింది. సో ఇప్పడు కొత్త షెడ్యూల్ లో 30శాతం షూటింగ్ పూర్తైతే, టోటల్ గా జూన్ ఎండ్ కల్లా 60 శాతం షూటింగ్ పూర్తవ్వొచ్చు.ఇంతవ అర్జెంట్ గా ఎందుకు స్పిరిట్ షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి కల్కీ2 ని ముందుకు తెచ్చారంటే, వారణాసి కథలోపాతిక నిమిషాల ఎపిసోడ్ తో కల్కీ 2 కథ కంచికి చేరేలా ఉంది. 80శాతం పూర్తైన ఫౌజీ కోసం కేవలం రెండు నెల్లు టైం కేటాయిస్తే, ప్యాచ్ వర్క్ తో సహా ఫౌజీని పూర్తి చేయొచ్చు..అయినా దాన్ని కూడా పక్కన పెట్టి కల్కీ సీక్వెల్ ని ముందుకు తీసుకురావటానకి రీజన్, వారనాసిలో కాశీ ఎపిసోడ్, అలానే హీరో పాత్రకి ఉన్న పోలికలు.
కల్కీలో హీరో బౌంటీ హంటర్.. వారణాసిలో హీరో బౌంటీ హంటర్.. కల్కీలో హీరో గత జన్మలో కర్ణుడు.. వారణాసిలో హీరో గతజన్మ లోరాముడు.. ఇలా చాలా పోలికలతో పాటు, కాశీలో 25 నిమిషాల సీక్వెన్స్ ని గనక జనం చూసేస్తే, ఇక కల్కీ 2 చూసినా ఆ కిక్ రాదట... ఓరకంగా స్వీట్లు తిన్నాక టీ తాగితే, చప్పగా అనిపించినట్టు.. అందుకే రాజమౌళి నిజంగా నాగ్ అశ్విన్ ని అలర్ట్ చేయటం వల్లే, ఏప్రిల్ కంటే నెల ముందు కల్కీ 2 రిలీజ్ అయ్యేలా లెక్కలన్నీ మార్చాడు.. సందీప్ రెడ్డి, హను రాఘవపూడీని రిక్వెస్ట్ చేసి మరీ స్పిరిట్, ఫౌజీలకు బ్రేకులేసి, కల్కీ 2ని వేగంగా తీస్తున్నాడు... ఇది కల్కీ 2 భయం వెనకున్న వారణాసి వార్నింగ్..అంతా బానే ఉంది కాని, మరి వారనాసి చూసిన వాల్లకి కల్కీ 2 నచ్చకపోవచ్చే, ముందే రిలీజ్ చేసేలా తీస్తున్నారనంటున్నారు. మరి కల్కీ 2 మార్చ్ లో వస్తే, అది చూసిన జనం, ఏప్రిల్ లో వచ్చే వారణాసి చూస్తే సీన్ రివర్స్ కాదా? కల్కీ 2 చూసిన వాళ్లు, అలాంటి సీన్లు, వారణాసిలో ఒక ఎపిసోడ్ లో కనిపిస్తే, అది వారనాసికి డ్యామేజ్ కాదా? అది కూడా తెలియకుండా రాజమౌళి, నిజంగా నాగ్ అశ్విన్ ని అలర్ట్ చేయడు.. కాబట్టి ఎవరి ఏర్పాట్లలో వాళ్లుండే, జాగ్రత్తపడుతున్నట్టున్నారు.