తెలుగు చిత్రసీమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడు శర్వానంద్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన 'భోగి' చిత్ర చిత్రీకరణను పూర్తి చేసే పనిలో మునిగిపోయారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే, ఆగస్టు నెల నుంచి శ్రీను వైట్ల దర్శకత్వంలో రాబోయే కొత్త సినిమా కోసం సెట్స్‌లోకి అడుగుపెట్టనున్నారు.
అయితే, ఈ రెండు సినిమాలు లైన్లో ఉండగానే.. శర్వానంద్ తదుపరి చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి ఫిల్మ్‌నగర్‌లో చక్కర్లు కొడుతోంది. నాగబంధం' సినిమాతో దర్శకుడిగా మారిన అభిషేక్ నామాతో శర్వానంద్ ఒక భారీ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇది చారిత్రక అంశాలతో ముడిపడిన ఒక పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోంది.
ప్రాచీన కావ్యమైన 'మహాభారతం'లోని ఓ ముఖ్యమైన ఘట్టం ఆధారంగా ఈ కథను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్‌తో పాటు మరొక ప్రముఖ హీరో కూడా నటించే అవకాశం ఉందట. శ్రీను వైట్లతో చేయబోయే సినిమా పూర్తయిన వెంటనే అభిషేక్ నామా దర్శకత్వంలో ఈ సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. మహాభారతం బ్యాక్‌డ్రాప్‌లో శర్వానంద్ చేయబోయే ఈ ప్రయోగం సినీ అభిమానుల్లో ఇప్పటి నుంచే భారీ అంచనాలను పెంచేస్తోంది.