ప్రభాస్ ‘స్పిరిట్’ ఆందోళన Vs క్లారిటీ.!

ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో కొంత నిరాశకు గురిచేశాయి

Post Published By: dialnews
Updated : 26 August 2026, 8:15 PM IST

ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇటీవల నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు ఫ్యాన్స్‌లో కొంత నిరాశకు గురిచేశాయి.ఈ సినిమా ఇంటర్నేషనల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందని, కొరియన్ స్టార్ డాన్ లీ నటిస్తారని అంతా భావించారు.కానీ ఇది పూర్తిగా హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఒక లోకల్ కాప్ స్టోరీ అని, ఆ వార్తల్లో నిజం లేదని నిర్మాత స్పష్టం చేయడంతో హైప్ కొద్దిగా తగ్గింది.

బడ్జెట్ పరంగానూ తక్కువ ఖర్చుతో తెరకెక్కుతుంది అనే ప్రచారం జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందారు.అయితే తాజాగా ఈ సినిమా ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలుస్తాయని వార్తలు వస్తున్నాయి.చిత్రంలో ఒక భారీ ట్విస్ట్ ఉంటుందంటూ వస్తున్న వార్తలు మళ్లీ ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

ఇదంతా తగ్గిన హైప్‌ను మళ్లీ పెంచడానికి చేస్తున్న డ్యామేజ్ కంట్రోల్ అని కొందరు భావిస్తున్నారు. త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ వైల్డ్ మాస్ అవతార్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. వంగా తన మార్క్ టేకింగ్‌తో ఈ లోకల్ కాప్ స్టోరీని ఏ స్థాయిలో నిలబెడతారనే దానిపైనే సినిమా సక్సెస్ ఆధారపడి ఉంది.

Published : 
  • 26 August 2026, 8:15 PM IST