పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కెరీర్లో 25వ చిత్రంగా రాబోతున్న 'స్పిరిట్' గురించి ప్రతి చిన్న అప్డేట్ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా రన్ టైమ్ గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో ఎమోషన్స్ మరియు డ్రామాను ఎంత లోతుగా చూపిస్తారో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'స్పిరిట్' కోసం కూడా అదే ఫార్ములాను వాడబోతున్నట్లు తెలుస్తోంది.సందీప్ రెడ్డి వంగా గత చిత్రాలైన 'అర్జున్ రెడ్డి', 'యానిమల్' సినిమాలను గమనిస్తే.. వాటి రన్ టైమ్ 3 గంటల కంటే ఎక్కువే ఉంటుంది. కథలోని గాఢతను తగ్గించకుండా ఉండటానికి ఆయన లెంగ్త్ విషయంలో రాజీ పడరు.
స్పిరిట్' సినిమా రన్ టైమ్ కూడా సుమారు 3 గంటల 15 నిమిషాల నుండి 3 గంటల 25 నిమిషాల మధ్య ఉండే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ టాక్. ఇందులో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ ఆర్క్, ఎమోషనల్ జర్నీ మరియు యాక్షన్ బ్లాక్స్ అన్నీ కవర్ చేయాలంటే ఈ మాత్రం సమయం అవసరమని దర్శకుడు భావిస్తున్నారట.ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారిగా పూర్తిస్థాయి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. "స్పిరిట్" సినిమాలో ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ మరియు డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్‌గా ఉంటుందని, సందీప్ వంగా మార్క్ 'రా' అండ్ రస్టిక్ యాక్షన్ సీన్స్ హైలైట్‌గా నిలుస్తాయని సమాచారం.
ఇటీవలే చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించిన ప్రకారం, ఈ సినిమా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ డేట్‌కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, మార్చి 6న మహా శివరాత్రి మరియు మార్చి 10న రంజాన్ సెలవులు ఉన్నాయి.
ఈ లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ 'స్పిరిట్' బాక్సాఫీస్ వసూళ్లకు భారీగా దోహదపడనుంది. ప్రభాస్ సరసన త్రిప్తి దిమ్రి హీరోయిన్గా నటిస్తోంది. ప్రకాష్ రాజ్, వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. కేవలం తెలుగులోనే కాదు.. హిందీ, తమిళం, మలయాళం, కన్నడతో పాటు చైనీస్, కొరియన్, జపనీస్ వంటి 9 అంతర్జాతీయ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ భారీ ప్రాజెక్ట్‌కు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే 'సలార్', 'కల్కి' సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఇప్పుడు వంగా మార్క్ యాక్షన్ తోడైతే, 'స్పిరిట్' సినిమా తొలిరోజే 200 కోట్ల వసూళ్లను సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.