రెబల్ స్టార్ ప్రభాస్ బాక్సాఫీస్ ని షేక్ చేసి రెండేళ్లు దాటింది. సలార్, కల్కీ తో 2 వేల కోట్ల వసూల్ల వరదొచ్చింది. ఒకటి 800 కోట్లు, రెండో ది 1200 కోట్లు కొల్లగొట్టింది. కాని తన రేంజ్ కటౌట్ కి తగ్గ హిట్ అంటే మాత్రం బాహుబలినే... తను లేని బాహుబలిని ఊహించలేం, రాజమౌళి మేకింగ్ తోడు లేకుండా బాహుబలి అంత దూసుకెళుతుందని అనుకోలేం. కాని ఇప్పుడు రెబల్ స్టార్ ప్రభాస్ కి కావాల్సింది మిర్చీలాంటి మూవీ... నిజంగా మరో బాహుబలి అంటే మరోసారి రాజమౌలితో తన కాంబినేషన్ సెట్ అవ్వటం తప్ప సేమ్ సీన్ రిపీట్ కష్టమే... కాని మిర్చీలాంటి ఊర మాస్ మూవీ కోసం మాత్రం రాజమౌళితో పనిలేదు.. అలాని చత్రపతి, మిర్చీ లాంటి కథలు కుదరటం అంత ఈజీకాదు.. ఐనా అర్జెంట్ గా మిర్చీలాంటి మూవీ పడాల్సిందే... జోనర్లు, ఫ్లేవర్లు మారుస్తూ ప్రయోగాలు చేయటం మంచిదే కాని, కలిసొచ్చే ఊర మాస్ యాక్షన్ డ్రామా అప్పడప్పుడు ఒకటైనా పడాలి.. అదే మిస్ అవుతోందా? మరో బాహుబలి? మరో మిర్చీ ఎప్పుడు? కల్కీ 2 తో ఏం తేలబోతోంది? స్పిరిట్ తో రెబల్ ఫ్యాన్స్ ఆకలి తీరుతుందా?
రెబల్ స్టార్ ప్రభాస్ మళ్లీ బాహుబలి టైంలో దూసుకెళ్లినట్టు సినీ సునామీ ఎప్పుడు క్రియేట్ చేస్తాడు... సలార్ 800 కోట్ల నుంచి 850 కోట్లు రాబట్టొచ్చు.. కాని ఇందులో తన ప్రెజెన్స్ తక్కువ. ఒక్క భారీ ఫైట్ సీన్ వదిలేస్తే, ప్రబాస్ కటౌట్ కి తగ్గ సీన్లు పడాల్సినన్ని పడలేదు. ఇక కల్కీ 2 లో కర్ణుడిగా కాసేపే కనిపిస్తే బాక్సాఫీస్ లో కలెక్షన్స్ తో రోమాలు నిక్కబొడిచాయి..కాని 90 పర్సెంట్ ప్రభాస్ రేంజ్ తగ్గ పాత్ర మాత్రం కల్కీలో పడలేదు. కర్ణుడిపాత్రే అసలు సిసలు దమ్మున్న పాత్ర.. ఇక మరో రోల్ జస్ట్ ఫర్ పన్ కోసం అన్నట్టు ప్లాన్ చేశారు. కాబట్టి బిర్యాని ముందు పెట్టి, సగమే తిననిచ్చినట్టు... ప్రబాస్ లాంటి కటౌట్ తో కొన్ని షాకింగ్ సీన్లతో సరిపెట్టారు. అందుకే ఫ్యాన్స్ కే కాదు, సినిమా లవర్స్ కి కూడా బాహుబలి, మిర్చీలాంటి ఫుల్ మీల్స్ ప్రాజెక్ట్ ఎప్పుడనే వెలితి కనిపిస్తుంది.. కామెంట్స్ లో వినిపిస్తుంది.
ప్రభాస్ కూడా 2015, 2017 లోనే తన రేంజ్ కి తగ్గ బాహుబలి లుక్ లో కిక్ ఇచ్చాడు. సాహో స్టైలిష్ గా ఉన్నా, ఎమోషనల్ యాక్షన్ డ్రామా మాత్రం మిర్చీ, బాహుబలి లాంటి మూవీల్లోనే ఎక్కువ కనెక్ట్ అయ్యింది. ఆ కటౌట్ కి తగ్గ మాస్ ఎలివేషన్లు, ఎమోషనల్ యాక్షన్ డ్రామాలు పడ్డాయి. కాని బాహుబలి తర్వాత, సలార్ వచ్చే వరకు, అలాంటి సీన్స్ రిపీట్ కాలేదు. సలార్ లో అనుకున్నట్టే ఓరేంజ్ సీన్లు పడ్డా, అంత పెద్ద సినిమాలో ఇంత చిన్న సీన్ తో సరిపెడతారా అన్న వెలితి కనిపించింది.ఆ గ్యాప్ నే ఫిల్ చేసేందుకు కల్కీ 2 లో కర్ణుడి పాత్ర పరిదే పెంచి మైండ్ బ్లాంక్ చేయబోతున్నారు.
ఫౌజీలో కేవలం పీరియాడిక్ వార్ డ్రామానే కాకుండా, యాక్షన్ డ్రామాగా సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు. అన్నీంటికి మించి సందీప్ రెడ్డి లాంటి దర్శకుడి చేతితో, రెబల్ స్టార్ లాంటి కటౌట్ పడితే, బాక్సాఫీస్ బద్దలే.. కాబట్టే కల్కీ 2, ఫౌజీ లేదంటే స్పిరిట్ ఈమూడింట్లో ఏది మరోసారి బాహుబలి జమానాకి తీసుకెళుతుంది..ఇంకేది మిర్చీ వైబ్స్ ని తీసుకొస్తుందనే అంచనాలున్నాయి. కాని కల్కీ 2 నుంచి ఎలాంటి వీడియో అప్ డేట్ లేదు. ఫౌజీ టీం కనీసం గ్లింప్స్ నో టీజర్ నో వదిలింది లేదు. ఇక స్పిరిట్ టీం మాత్రం ఒక్క పోస్టర్ తో సరిపెట్టింది. కాకపోతే కనీసం ఆ పోస్టర్ తో అయినా మిర్చీ, బాహుబలి వైబ్స్ కనిపిస్తున్నాయి. కాబట్టే స్పిరిట్ త్వరగా రావాలనే క్యూరియాసిటీ ఫ్యాన్స్ లో పెరిగింది.. ఫైనల్ గా అందరికి మిర్చీ లాంటి ఊరమాస్ రెబల్ స్టార్ ఎలివేటే కావాలనే కోరిక కనిపిస్తోంది.