1000 కోట్ల గ్యాప్.. వనికించే వారాల గ్యాప్…?

డ్రాగన్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రావటం పక్కా.. డేట్ ఎనౌన్స్ మెంట్ తో సహా గ్లింప్స్ ని రెడీ చేస్తోంది ఫిల్మ్ టీం. మరో 24 రోజుల్లో గ్లింప్స్ తో సినీ సునామీ గ్యారెంటీ.. కాకపోతే ఈమూవీకి వారణాసికి ఉన్న గ్యాపే నిర్మాతలని కంగారు పెడుతోంది.

Post Published By: dialnews
Updated : 7 April 2026, 5:41 PM IST

డ్రాగన్ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి రావటం పక్కా.. డేట్ ఎనౌన్స్ మెంట్ తో సహా గ్లింప్స్ ని రెడీ చేస్తోంది ఫిల్మ్ టీం. మరో 24 రోజుల్లో గ్లింప్స్ తో సినీ సునామీ గ్యారెంటీ.. కాకపోతే ఈమూవీకి వారణాసికి ఉన్న గ్యాపే నిర్మాతలని కంగారు పెడుతోంది. రాజమౌళితో , ప్రశాంత్ నీల్ కి ఉన్న స్నేహం వల్ల, ఇద్దరి మధ్య ఎలాంటి క్లాష్ రాదు.. వాళ్ల మూవీల విడుదల తేదీల మధ్య ఇబ్బంది లేదు.. కాని ఇవేవి పాన్ ఇండియా సినిమాలు కావు.. కాబట్టి నెల, రెండు నెల్ల గ్యాప్స్ సరపోవు.. కాబట్టే డ్రాగన్, వారణాసి కి మధ్య రిలీజ్ డేట్ల గ్యాప్ కొంత ఆలోచనల్లో పడేస్తోందా? సీన్ లోకి కల్కీ 2 రావటం, హిందీ రామాయణానికి ఎక్కువ టైం లేకపోవటంతో, 2027 మొదటి నాలుగు నెలల్లో ఊహించని సినీ సునామీలు వచ్చేలా ఉన్నాయి.. ఇంతకి ఏ రిలీజ్ డేట్ ఈమూవీ ఫేట్ ని మార్చబోతోంది? డ్రాగన్, వారణాసి, కల్క్కీ 2 మధ్యలో 4 వేల కోట్ల రామాయణం నలగబోతోందా?

2027 లో పిడు మీద పిడుగు పడే ఏడాదిగా మారబోతోంది. 2027 జనవరిని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ తో మొదలు పెట్టబోతున్నాడు. సంక్రాంతికి డ్రాగన్ నిప్పుల వర్షం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. ఈ దసరాకు అనుకున్న రిలీజ్ కాస్త, సంక్రాంతికి మారింది. కాకపోతే ఏప్రిల్ లోనే వారణాసి రిలీజ్ అనేసరికి, తక్కువ గ్యాప్ లో వసూళ్ల వర్షంలో ఏదైనా తేడా జరుగుతుందా అన్న ప్రశ్నే షాక్ ఇస్తోంది.ఎందుకంటే జనవరిలో డ్రాగన్ వస్తే, ఏప్రిల్ లో వారణాసి రాబోతోంది. కాబట్టి ఎలా చూసినా ఒక సినిమా, మరో మూవీ వసూళ్లని చీల్చే ఛాన్స్ లేదు. కాని అదే జరిగేలా ఉంది.కారణం, హిందీ రామాయనం..ఔను 4 వేల కోట్లతో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న హిందీ రామాయణం, నిజానికి దీపావలికి ప్లాన్ చేశారు. కాని పోస్ట్ ప్రొడక్షన్ డిలే వల్ల, జనవరికి మార్చాలనుకన్నారు. కాని అప్పటికే సీన్ లో డ్రాగన్ ఉన్నాడు.

కాబట్టి థియేటర్స్ తాలూకు డీల్స్ విషయంలో క్లాష్ వస్తుంది. కాదని ఫిబ్రవరిలో బరిలోకి దిగుదామంటే, అప్పుడు కల్కీ 2 రంగంలోకి దిగేలా ఉంది. వారణాసిలో కొంత భాగం, కల్కీ 2 లో కథకి పోలికలు ఉండటంతో, వారణాసి వచ్చే లోపే కల్కీ సీక్వెల్ ని రిలీజ్ చేయాలనుకున్నారు. అందుకే సడన్ గా కల్కీ 2 షూటింగ్ మొదలుపెట్టారు. 30 శాతం షూటింగ్ గతంలోనే అయిపోయింది కాబట్టి, పెండింగ్ 70 శాతం షూటింగ్ చేస్తూనే, ప్యార్ లల్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెడుతున్నారు.సరే మార్చ్ లో హిందీ రామాయణం రిలీజ్ చేయొచ్చు కదా అంటే, అక్కడా సమస్య ఉంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆట్లీ తీస్తున్న మూవీని మార్చ్ కి ఫిక్స్ చేశారట. థియేట్రికల్ డీల్స్ కూడా జరిగినట్టు తెలుస్తోంది. అన్నీ పెద్ద సినమాలే.. పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ వైపు అడుగులేస్తున్నమూవీలే... కాబట్టే ఏ ఒక్క సినిమాతో కూడా 4 వేల కోట్ల హిందీ రామాయణం పెట్టుకునే పరిస్థితిలేదు.

సరే ఏప్రిల్ లో ఎలాగూ వారణాసి వరదొస్తుంది. సూపర్ స్టార్ మహేశ్ పాన్ వరల్డ్ దండయాత్ర కన్ఫామ్ అయ్యింది. అదయ్యాక 4 వేల కోట్ల హిందీ రామాయణం రిలీజ్ చేయొచ్చు కదా అంటే, అక్కడే సీన్ రివర్స్ అవుతోంది. అసలే హిందీ రామాయనం టీజర్ వచ్చినప్పటి నుంచి దీనికంటే ఆదిపురుషే బెటర్ అంటున్నారు. కారనం అది 650 కోట్ల బడ్జెట్ తో వచ్చినమూవీ. కనీసం అందులో రాముడిగా ప్రభాస్ అయినా కదిలించాడు.ఇక్కడ రణ్ బీర్ ని రాముడిగా ఎవరూ ఒప్పుకోలేని పరిస్తితి.. దీనికితోడు వారణాసి మూవీ వచ్చాక, జనం డెఫినెట్ గా క్వాలిటీ సినిమాకి ఇంప్రెస్ అవుతారు.. భిర్యాని తిన్నాక, ఉప్మా రుచి ఎలా నచ్చదో.. రాజమౌలి రేంజ్ ఆఫ్ విజువల్స్ చూశాక, తక్కువ క్వాలిటీతో వచ్చే హిందీ రామాయనం నచ్చదు.. అందుకే వారణాసి వచ్చేలోపే హిందీ రామాయణాన్ని రిలీజ్ చేసేప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈఏడాది డిసెంబర్ వరకు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తవటమే కష్టం కాబట్టి, ఈ ఏడాది రామాయణ దాడి కష్టం..వచ్చే ఏడాది వారణాసి విడుదలకు ముందే రామాయణం రిలీజ్ చేద్దామంటే సీన్ లో డ్రాగన్, కల్కీ 2, అల్లు అర్జున్ మూవీలున్నాయి.. కేవలం వారణాసి వాయిదా పడితే తప్ప హిందీ రామాయణానికి కాలం కలిసిరాదు... లేదంటే 4 వేల కోట్లు మటాషేనా? కేవలం టీజర్ చూసే అప్పుడే ఒక నిర్ణయానికొస్తే ఎలా...? హ్రితిక్ రోషన్ చెప్పినట్టు వేయిట్ చేయొచ్చు కదా? అంటే బాలీవుడ్ మేకర్స్ మీద జనాలకున్న నమ్మకం అలాంటిది.. అందుకేఈ పరిస్థితి.

Published : 
  • 7 April 2026, 5:41 PM IST